త్వరలో జతగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మలయాళంలో రూపొందిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి అనువదించారు. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో దుల్కర్, నిత్యామీనన్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. లవ్ సెంటిమెంట్ ఎంటర్‌టైనర్‌గా పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం ప్రధాన అంశంగా అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ ఫీల్‌గుడ్ మూవీ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. సాహితి రాసిన సంభాషణలు హైలెట్‌గా నిలుస్తాయని, గోపీసుందర్ స్వరపరచిన పాటలు అందరికీ నచ్చుతాయని ఆయన అన్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.లోకనాథన్, సంగీతం: గోపీసుందర్, మాటలు: సాహితీ, దర్శకత్వం: అన్వర్ రషీద్, నిర్మాత: సురేష్ కొండేటి.