S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/04/2016 - 04:57

‘గుంటూర్ టాకీస్ చిత్రంలో చేసిన పాత్ర ఇప్పటివరకూ నేను ఏ సినిమాలోనూ చేయలేదు. రివాల్వర్ రాణిగా నిజమైన గన్స్ పట్టుకొని నటిస్తూ, తుపాకి పేలిస్తే ముఖం మీదికి స్పార్కల్స్ వచ్చేవి’ అని నటి శ్రద్ధాదాస్ తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ, రేష్మీగౌతమ్, శ్రద్ధాదాస్ ప్రధాన తారాగణంగా ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.రాజ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘గుంటూర్ టాకీస్’.

03/03/2016 - 07:19

సౌత్ క్రేజీ భామ శ్రుతిహాసన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఈ మధ్య వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ భామ లేటెస్ట్‌గా తెలుగు ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మలయాళ సూపర్‌హిట్ ‘ప్రేమమ్’ సినిమాకు రీమేక్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో టీచర్ పాత్రలో గ్లామర్ భామ శ్రుతిహాసన్ నటిస్తోంది.

03/03/2016 - 07:17

సినిమాలో మొదటినుండి సామాజిక స్పృహ వున్న వ్యక్తి పాత్రలో నటించడంతో ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యారని, 25 సంవత్సరాలు క్రితం ‘ఎన్‌కౌంటర్’ చిత్రంలో నక్సలైట్ లీడర్‌గా నటించిన నేను, ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించడం ఆనందాన్నిస్తోందని నటుడు శ్రీకాంత్ తెలిపారు.

03/03/2016 - 07:15

ఆశిష్‌గాంధీ, దీక్షాపంత్ ప్రధాన తారాగణంగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో అశోక్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘ఓ స్ర్తి రేపురా’ (కల్పితమా ఖచ్చితమా). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 11న విడుదలకు సిద్ధం చేశారు.

03/03/2016 - 07:14

హాలీవుడ్‌లో ‘ఇన్‌టచ్‌బుల్స్’ చిత్రాన్ని తెలుగులో ఎవరైనా చేస్తే బావుంటుందని అనుకున్నాం. అందులో నేను నటించాలని కూడా అనుకున్నాను. మనసులో గట్టిగా కోరుకుంటే జరుగుతుందన్నట్లుగా దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని చేయడానికి రావడంతో ఒప్పుకున్నాను అని నాగార్జున తెలిపారు. పి.వి.పి. సినిమా పతాకంపై నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’.

03/03/2016 - 07:12

సూర్య కథానాయకుడుగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈనెల 4న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని నితిన్ అందిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత సూర్య మాట్లాడుతూ, సైన్స్ ఫిక్షన్ కథనం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, మూడు విభిన్నమైన పాత్రల్లో తాను నటిస్తున్నానని తెలిపారు.

03/03/2016 - 07:12

కళైయరసన్, రమీజ్‌రాజా, మాయ, కాళివెంకట్ ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తమిళ చిత్రం ‘డార్లింగ్-2’. ఈ చిత్రాన్ని ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై మాధురి బొల్లు తెలుగులో అందిస్తున్నారు. సతీష్‌చంద్రశేఖరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి, సెన్సార్‌కు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..

03/03/2016 - 07:10

తమిళంలో విజయవంతమైన ‘నంబేండ’ చిత్రాన్ని తెలుగులో ‘గుడ్ ఈవెనింగ్’గా అందిస్తున్నారు. భద్రకాళి ఫిలిమ్స్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు ఎ.జగదీష్.

03/03/2016 - 07:07

యాబా ప్రొడక్షన్స్ పతాకంపై సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో సమీఉల్లాఫయాజ్, సయ్యద్ వసీమ్‌యాబా రూపొందించిన చిత్రం ‘దావత్ ఏ షాదీ.’ హైదరాబాదీ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది.

03/03/2016 - 07:06

నిత్యామీనన్, సందీప్ కిషన్ జంటగా తాడినాడ రాజాసింహ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. టాకీపార్టు పూర్తిచేశామని, పాటల చిత్రీకరణ కూడా జరుపుతున్నామని, ఓ వైవిధ్యమైన నేపథ్యంలో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దామని తెలిపారు.

Pages