S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/05/2016 - 21:40

‘రామారావు కొడుకు కిషోర్‌తో తిరగవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాన్రా..? వాడు ఎప్పుడూ చదువుసంధ్యల్ని పట్టించుకోకుండా రోడ్లమీద జులాయిగా తిరుగుతూ కనిపిస్తుంటాడు. అలాంటివాడితో నీకు స్నేహమేంట్రా..?’- అంటూ కామేష్‌ను మందలించాడు వాళ్ల నాన్న ప్రభాకరం.

01/05/2016 - 04:02

‘కబడ్డీ ఆడితే ఆడపిల్లలకు ఏం ఉపయోగం? ఆటపాటల పేరిట అమ్మాయిలు బయటకు వెళితే వారికి భద్రత ఎలా? జీవనోపాధికి దారిచూపే పనేదైనా నేర్పించండి..’- అంటూ మురికివాడల్లో ఉంటున్న పలు కుటుంబాలు ప్రశ్నించినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆటల్లో పాల్గొనే బాలికలు లింగవివక్షను ధైర్యంగా ఎదుర్కొంటూ సమాజంలో స్వేచ్ఛగా జీవించగలరన్న విశ్వాసాన్ని వారిలో ఆమె కలిగించారు.

12/28/2015 - 21:38

‘వాడికి ఆ ఊళ్లో నిప్పు పుట్టదు’- అన్నమాట ఈతరం వారిలో కొంతమందికి తెలియకపోవచ్చు. మధ్య వయస్కులూ, వృద్ధులూ విని ఉన్నప్పటికీ చాలామందికి ఆ మాట అర్థం తెలిసి ఉండకపోవచ్చు. గత వందేళ్ల కాలంలో ‘అగ్గిపెట్టె’ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అది లేని రోజులుండేవన్నది మన ఊహక్కూడా అందని విషయం. అరక్షణంలో అగ్గిపుల్ల గీసి దీపాన్నో, స్టవ్‌నో అంటించేస్తాం. అది లేని కాలంలో నిప్పు తయారీ చాలా కష్టమైన ప్రక్రియ.

12/24/2015 - 07:52

‘మల్లయోధులకు పుట్టినిల్లు’గా ఆ గ్రామానికి ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఆ ఊరి యువతకు మల్లయుద్ధం, క్రికెట్ తప్ప మరే ఇతర క్రీడల గురించి తెలియదు. అలాంటి పల్లె నుంచి వచ్చిన ఓ కుర్రాడు తన అద్భుత నైపుణ్యంతో గోల్ఫ్ క్రీడాకారుడిగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. ప్రపంచ స్థాయి జూనియర్ గోల్ఫ్ పోటీల్లో గ్రాండ్‌స్లామ్ సాధించి, అంతర్జాతీయ వేదికపై మనదేశానికి గుర్తింపు తీసుకువచ్చాడు ఈ బుడతడు.

12/23/2015 - 02:56

రాజస్థాన్‌లో ఎడారి భూములను హరిత వనాలుగా మార్చిన ఘనత ఆమెకే దక్కింది.. అందుకే ఆమెను అందరూ ‘వాటర్ మదర్’ అని గౌరవంగా పిలుస్తారు. ఎండిపోయిన చెరువులు, కుంటల్లో మళ్లీ జలకళ ఉట్టిపడేలా చేయడం ఆమెకి వెన్నతో పెట్టిన విద్య. నీటిని ఒడిసి పట్టుకోవడం, పొదుపుగా వాడుకోవడం, వ్యవసాయానికి వినియోగించుకోవడంలో పల్లెవాసులకు ఆమె తగిన తర్ఫీదు ఇస్తుంటారు.

12/22/2015 - 05:08

నిశ్చితార్థమో, పెళ్లో, ఏదైనా శుభకార్యమో జరిగినపుడు బంధుమిత్రులంతా ఒకచోట కలుసుకోవడం మధురమైన జ్ఞాపకం. రెక్కలొచ్చిన పక్షుల్లా ఎక్కడెక్కడికో ఎగిరిపోయి ఉద్యోగాల పేరిట దూర ప్రాంతాల్లో ఉంటున్న పిల్లలు శుభకార్యాల సందర్భంగా తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకుంటారు. ఇలాంటి సందర్భాలు జీవితంలో కొన్నిసార్లు మాత్రమే వస్తుంటాయి. తల్లిదండ్రులు, పిల్లలు, బామ్మలు, తాతలు, అత్తమామలు, పిన్నీ బాబాయిలు..

12/17/2015 - 02:06

అండమాన్, నికోబార్ దీవులకు చెందిన ఇరవై ఏళ్ల దెబోరా హెరాల్డ్ సైక్లింగ్‌లో వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుని భారత పతాకాన్ని రెపరెపలాడించింది. యుసిఐ (యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్) ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ యువతి ఇంతటి ఘనతను సాధించడం ఇదే ప్రథమం.

12/17/2015 - 02:05

నేటి యువత ఎంత చదివినా, ఎంత ఎదిగినా అంతిమ లక్ష్యం డబ్బు సంపాదన వైపే ఉంటుంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. స్వతంత్రంగా బతకడానికి అవసరమైన డబ్బు సంపాదించడం చేతకాకపోతే ఎంతటి మంచివాడినైనా, మేధావినైనా సమాజం తిరస్కార భావంతో చూస్తుంది. అందుకే మంచి కెరీర్ పట్ల యువత అవగాహన పెంచుకుని, ఆ దిశగా లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిందే.

12/15/2015 - 22:52

‘అందరికంటే భిన్నంగా జీవించడం లోనే అసలైన మజా ఉంటుంది..’ అంటోంది ప్రముఖ ట్రావెలర్ బ్లాగర్ రేణుకా సింగ్. పుస్తకాల్లో చదివిన దానికన్నా వివిధ ప్రాంతాలను ఒంటరిగా సందర్శిస్తూ నేర్చుకున్న విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె చెబుతోంది. పర్యాటక ప్రాంతాలకు వెళ్లే మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రేణుక తన బ్లాగులో వివరిస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఎలా ప్రయాణించాలో మెళకువలు బోధిస్తుంది.

12/15/2015 - 01:47

‘ఆలోచనల్లో వైవిధ్యం ఉంటే గెలుపు ఖాయం’- అని భరోసా ఇస్తోంది విద్యా నటరాజ్. శ్రీలంకలో ఓ భారతీయ కుటుంబంలో జన్మించిన ఆమె లండన్‌లో ఉన్నత చదువులు ముగిశాక అక్కడే ‘ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకర్’ గా చాలా కాలం పనిచేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూలు లో ఎంబిఎ పూర్తిచేశాక భారత్‌కు చేరుకుంది. చెన్నైలో బిజినెస్ కన్సల్టెంట్‌గా ఆమె తన కెరీర్‌ను మొదలుపెట్టింది.

Pages