S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

02/17/2016 - 21:05

తాము చెప్పినట్టే వినితీరాలని తల్లిదండ్రులు ఆంక్షలు విధించకుండా, చిన్నారుల ఆకాంక్షలు నెరవేరేలా స్వేచ్ఛను ఇవ్వాలని పూణెకు చెందిన పదేళ్ల ఐశ్విత కాత్యాల్ అంతర్జాతీయ వేదికపై తన మనోభావాలను వెల్లడించి అందర్నీ అబ్బురపరచింది. కెనడాలోని వాంకోవర్ నగరంలో తాజాగా జరిగిన ‘టెడ్-2016’ (టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్ సమ్మేళనం)లో ఆమె తన అద్భుత వాగ్ధాటితో ఆహూతులను విస్మయపరచింది.

02/17/2016 - 05:42

సంగీత ప్రపంచానికి ఆస్కార్‌లాంటి గ్రామీ అవార్డుల సంబరం లాస్‌ఏంజిలిస్‌లో అట్టహాసంగా, హాలీవుడ్ తారలు, సంగీత రంగ ప్రముఖులతో కనులపండువగా సాగింది. సోమవారం రాత్రి జరిగిన 58వ గ్రామీ అవార్డుల వేడుకలో ఆధునిక సొబగులద్ది ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో, వింతైన మేకప్‌తో పాప్, రాక్‌స్టార్స్ రెడ్‌కార్పెట్‌పై అందచందాల ప్రదర్శనతో ఆహూతులను ఆకట్టుకున్నారు.

02/13/2016 - 21:28

నీ నవ్వుల చలువ పందిళ్ల నీడన
నీ రెప్పల పచ్చటి పానుపుపై సేదతీరా..
నా, నీ అరచేతుల ఆలింగనం
మన జీవితాలకు రక్షాబంధం..

నా కళ్లు సిందూరాలై వర్షించినప్పుడు
నీ చేతుల్లో పూచే మల్లెల చల్లదనమే మందు..
నీ కలల ఊయలపై
నా మనసు పవళిస్తోంది...
పడిపోతాననే భయం లేదు
నీ అడుగుల కంచె ఉండగా..

02/12/2016 - 20:13

శారీరక సౌందర్యం కోసం ఖరీదైన లోషన్లు, క్రీములను మితిమీరి వాడడం వల్ల రసాయనాల దుష్ప్రభావం బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంత వైద్యంతో ఇబ్బందులను ఎదుర్కొనే బదులు ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యపడుతుంది. ఆయా సీజన్లలో లభించే తాజాపండ్లను తినడానికే కాదు, శారీరక సౌందర్యం పెంచుకునేందుకు కూడా వాడవచ్చు.

02/11/2016 - 22:28

ఆర్థికంగా స్థితిమంతులైన వారే పొరుగువారి కోసం రూపాయి కూడా విదల్చని ఈ కలికాలంలో- ఓ యాచకుడు తన కష్టార్జితాన్నంతా బాలికల విద్య కోసం ఖర్చు చేస్తున్నాడు. పేదింటి బాలికలు బడికి వెళ్లాలని, వారి కనీస అవసరాలను కొంతమేరకైనా తీర్చాలని ఆ బిచ్చగాడు నిరంతరం పరితపిస్తునే ఉంటాడు.

02/11/2016 - 07:36

ఏటా ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ వస్తోందంటే చాలు.. వారం రోజుల ముందుగానే ప్రేమికులు పార్కులు, పబ్‌లు మొదలైన సంకేత స్థలాల వేటలో, బహుమతుల ఎంపికలో నానా హడావుడి పడుతుంటారు. ఈసారి ఆదివారం వచ్చింది ‘ప్రేమికుల రోజు’. చాలాచోట్ల అమ్మాయిలూ, అబ్బాయిలూ- ఇల్లు వదిలి ఎక్కడికోపోడానికి సాకులు వెతుక్కుంటూ వుంటే- గోవాలో మాత్రం ప్రేమికులు కొబ్బరిచెట్లు వెతుక్కుంటున్నారు.

02/11/2016 - 07:34

ఎంతటి ఆరోగ్యవంతులైనా ఏదోఒక సందర్భంలో ‘కడుపులో మంట’ సమస్యను ఎదుర్కొనక తప్పదు. కొంతమంది మాత్రం దీంతో నిత్యం సతమతమవుతుంటారు. అతిగా భుజించడం, మసాలా వంటకాలు, ఊబకాయం, మితిమీరి మద్యం, కాఫీ సేవించడం వంటివి ఎసిడిటీ (కడుపులో మంట)కి కారణాలని వైద్యులు చెబుతుంటారు. ఉదర భాగంలోని గాస్ట్రిక్ గ్రంధులు ఎక్కువ మోతాదులో యాసిడ్లను విడుదల చేయడం వల్ల కడుపులో మంటగా ఉంటుంది. కొంతమందికి ఛాతీ భాగంలో మంటగా ఉంటుంది.

02/13/2016 - 21:33

కేంద్ర ఆర్థికమంత్రి వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారంటే చాలు అన్ని వర్గాల్లోనూ ఒకటే ఉత్కంఠ.. పన్నుల భారం పడకూడదని, రాయితీల జల్లు కురవాలని అన్ని వర్గాల్లోనూ ఒకటే ఎదురుచూపులు.. సమాజంలో కుటుంబ వ్యవస్థే కీలకం గనుక ఈసారైనా బడ్జెట్ తమకు అనుకూలంగా ఉండాలని గృహిణులు కోరుకుంటున్నారు. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా కుటుంబ నిర్వహణకు సంపాదన సరిపోని పరిస్థితి సర్వత్రా కనిపిస్తోంది.

02/10/2016 - 08:41

ఉన్నత చదువులు, ప్రభుత్వోద్యోగాల్లోనే కాదు.. నటన, మోడలింగ్ వంటి కళారంగాల్లోనూ తామేమీ తక్కువ కాదని లింగమార్పిడి చేయించుకున్నవారు నిరూపిస్తున్నారు. ‘హిజ్రాల’ పేరిట సమాజంలో నిరాదరణకు, అపహాస్యానికి గురవుతున్న వీరు ఆత్మవిశ్వాసంతో తమకు నచ్చిన రంగంలో దూసుకుపోతున్నారు. ‘మూడో తరగతి పౌరులు’గా ముద్రపడిన వీరు ఓ వైపు సమాన హక్కుల కోసం ఉద్యమిస్తూనే తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.

02/06/2016 - 23:09

ఈ నెలలో జరిగే ఆస్కార్ వేడుకల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేసేందుకు ఎంపికైన సెలబ్రిటీగా మన దేశానికే ఖ్యాతి తెచ్చిన బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా మరో ఘనతను తాజాగా తన ఖాతాలో వేసుకుంది. ప్రఖ్యాత సామాజిక మీడియా ‘ఇన్‌స్టాగ్రామ్’లో ఆమె అనుచరుల సంఖ్య అయిదు మిలియన్లకు చేరింది. ఇంతమంది అనుచరులకు తాను దగ్గర కావడం ఎంతో ఆనందానికి గురిచేసిందని ప్రియాంక ఇపుడు ఉబ్బితబ్బిబ్బవుతోంది.

Pages