S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/28/2015 - 23:26

ఇతరులకు చెప్పడం తేలికే కానీ, ఆదుర్దా పడకుండా ప్రస్తుత రోజుల్లో హాయిగా గడపడం ఒక సవాలే. నేటి ఆధునిక జీవనం సమస్యల మయం అవుతోంది. పాత సమస్యను పరిష్కరించుకునే లోగా ఏదో ఒక కొత్త సమస్య చుట్టుముడుతుంది. సమస్య వచ్చిందంటే మొదట అది తెచ్చేది ఆదుర్దానే. పిల్లల దగ్గర్నించి పెద్దవాళ్ళదాకా, అమాయకుల దగ్గర్నుంచి మేధావుల దాకా అందరూ ఏదో ఒక విషయంలో ఆదుర్దా పడకుండా ఉండలేక పోతున్నారు.

11/28/2015 - 03:15

నిద్ర అనేది అందరికీ తప్పనిసరైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక మార్పులు అనివార్యం. జీవనోపాధికి పగలంతా పనిచేయాల్సి రావడంతో రాత్రివేళ నిద్ర పోవడం అన్నది అనాదిగా అలవాటై పోయింది. కాలక్రమంలో చాలా ఉద్యోగాలు రాత్రిళ్ళే చే యాల్సి వస్తున్నాయి. పరిశ్రమలు, కమ్యూనికేషన్ సెంటర్స్, ఆస్పత్రులు, కాల్ సెంటర్స్, రవాణా, సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతోమంది రాత్రివేళ పనిచేయక తప్పడం లేదు.

11/26/2015 - 04:03

‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు’ అన్నట్లు మన దేశానికి చెందిన నిపుణుల ప్రతిభను సొంతగడ్డపై ప్రసార మాధ్యమాలు గుర్తించకపోయినా డిస్కవరీ చానల్ మాత్రం తన బాధ్యతను నెరవేర్చింది. ‘మట్టిలో మాణిక్యం’ అయిన
ఓ యువకుడి నైపుణ్యాన్ని గుర్తించడమే కాదు, అతడి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఆ చానల్

11/26/2015 - 00:13

ఉసిరికాయను దైవవృక్షంగా భావిస్తారు గనుకే కార్తీకమాసంలో వనభోజనాల సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద వంటలు వండుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. కార్తీక మాసంలో పూజలకు, అనేక నోములు, వ్రతాల్లోనూ ఉసిరికి ప్రాధాన్యం ఉంది. తరచూ ఉసిరికాయలు తినేవారు అనారోగ్యాలకు దూరంగా ఉంటారని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. చర్మవ్యాధుల నివారణకు, శిరోజాల గట్టిదనానికి ఇది దోహదపడుతుంది. ఉసిరికాయలు తక్కువ కేలరీలను అందిస్తాయి.

11/26/2015 - 00:08

ఒంటరి జీవితాన్ని అనుభవించేవారు మా నసిక సమస్యల్నే కాదు, అనేక వ్యాధులను ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. షికాగో విశ్వవిద్యాలయం పరిశోధకులు 2002 నుంచి జరిపిన సుదీర్ఘ పరిశోధనల్లో ఆసక్తికరమైన పలు అంశాలు వెలుగు చూశాయి. ఏళ్ల తరబడి ఒంటరిగా ఉంటున్నవారు పలురకాల అనారోగ్యాలను భరిస్తున్నారని, వృద్ధులైతే తొందరగా మరణిస్తున్నారని అధ్యయనంలో కనుగొన్నారు.

11/25/2015 - 05:08

చిన్న చిన్న కుండీల్లో అందమైన మొక్కలను పెంచడం హాబీగా మారితే- ఆ ఇల్లు నయనమనోహరంగానే కాదు, అక్కడి పరిసరాలూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. పట్టణాలు, నగరాలు ‘కాంక్రీటు జంగిళ్లు’గా మారుతున్న నేటి కాలంలో ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చే పరిస్థితులే కనిపించడం లేదు. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గడం, హానికారక వాయువుల వల్ల రోగాల బారిన పడడం నేడు సర్వసాధారణమైంది.

11/24/2015 - 04:43

‘భజగోవిందమ్’ ముగింపు శ్లోకం మానవ జీవనానికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. అందులోని అర్థాన్ని గ్రహించి ఆచరించగలిగితే మానవజన్మ చరితార్థం అవుతుంది. సుఖాలను ఆశించి మానవులు ఇంద్రియలోలురవుతారు. ఫలితంగా శరీరం రోగాలతో నిండిపోతుంది. మరణమే చివరకు శరణమైనా చాలామంది పాపాలు చేయడం మానరు. దేహాన్ని కేవలం భోగాలకే పరిమితం చేసి, జీవితాన్ని పాపాల పుట్టగా మార్చేస్తే అది మన పురోగతికి ప్రతిబంధకమవుతుంది.

11/22/2015 - 04:56

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన మహిళలకు సంబంధించి వంద మంది పేర్లతో రూపొందించిన జాబితాలో భారత్ నించి ఏడుగురికి స్థానం లభించింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వందమంది మహిళల్ని ఎంపిక చేసి, ప్రఖ్యాత మీడియా సంస్థ ‘బిబిసి’ ఏటా ఓ జాబితాను ప్రకటిస్తుంది.

11/20/2015 - 23:40

సానుకూల పరిణామాలు మనల్ని ఉత్సాహపరుస్తున్న సమయంలోనే కొన్ని ప్రతికూల సంఘటనలొచ్చి కుంగదీస్తాయి.ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మార్గంనుంచి పక్కకు తొలగే పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి ఎనె్నన్నో ప్రతికూల పరిణామాలను కూడా ఎదురీది విజేతగా నిలిచిన వారు నిజమైన ధీరోదాత్తులు.
ఈ సూక్తికి నిజమైన ఉదాహరణ క్విన్ డ్యూన్

06/26/2015 - 22:42

‘‘ఆకాశంలో సగం మేము- అవకాశాలలో కూడా సగం’’ కావాలంటూ ఉద్యమిస్తూన్న మహిళలకు బాసటగా నిలవడానికి మేము సైతం అంటూ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం ఐటి కంపెనీలలో మహిళా ఉద్యోగులు 35 శాతం మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా, పీపాల్స్, డెల్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు వినూత్న రీతిలో పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నాయి.

Pages