S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/18/2016 - 22:46

నల్లగా ఉన్నానని కుమిలిపోతున్న మహిళల్లో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టేందుకు రెండు పదులు దాటిన ఓ యువతి సోషల్ మీడియా ద్వారా సమరభేరీ మోగించింది. ‘‘నలుపే అందం’’ అనే పేరుతో సోషల్ నెట్‌వర్క్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ యువతి చేస్తున్న ప్రచారంలో పాలుపంచుకునేందుకు తమిళనాడులోని సెలబ్రిటీలు సైతం ముందుకు వస్తుండటం విశేషం. ఫెయిర్‌గా ఉండే చర్మం అంటే అందరూ ఇష్టపడతారు. నల్లగా ఉంటే చిన్నచూపు చూస్తారు.

03/18/2016 - 01:15

ఓ సినిమాలో హీరోయిన్ ఆఫీసుకు తయారవుతుంటుంది. ఇంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొడుతుంటాడు. ఏ చీర కట్టుకోవాలో తెలియక వార్డు రోబ్ అంతా చిందర వందర చేసేసి చివరకు తన ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తుంది. ఆమె చెప్పిన చీర హడావుడిగా కట్టుకుని ఆఫీసులో అడుగుపెట్టగానే అందరూ హాయ్ అని చెబుతుంటారు. ఇది సినిమా అయినప్పటికీ నేడు ఉద్యోగినుల వస్త్ధ్రారణపై కళ్లకు కట్టే సన్నివేశం.

03/17/2016 - 07:22

ఈ పుష్ప విలాసం చూసి హాలెండ్ అనుకుంటున్నారా..? కానే కాదు కాశ్మీర్‌లోయలో విరగబూసిన తులిప్ అందాలు. ఆసియాలోనే అతి పెద్ద తులిప్ ఉద్యావనం ద్వారాలు తెరుచుకుని పూల ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. మన దేశ తొలి మహిళా ప్రధాని పేరుతో వెలసిన ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్‌లో డెబ్బయి రకాల పూలు వివిధ రంగులలో కనువిందు చేస్తాయి. వాస్తవానికి ఒకప్పుడు తులిప్‌కు పెట్టింది పేరు హాలెండ్ దేశం.

03/15/2016 - 22:16

‘‘జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే బాగా చదువుకోవాల్సిన అవసరం లేదు. తగిన అర్హతలు ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా నిర్దిష్టమైన లక్ష్యం, లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన కృషి మాత్రమే. చేస్తూన్న పనిపట్ల నమ్మకం చాలు. అలా చేసినపుడు సాధించలేనిదంటూ ఏమీ లేదు’’ అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన జానైన్ అలీస్. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని ఆమె చెబుతారు.

03/15/2016 - 22:12

‘డెలివరీ బోయ్’ అనే మాట సర్వసాధారణంగా అందరూ వినేదే. కాని ‘డెలివరీ గళ్’ అనే మాట నేడు సరికొత్తగా వినబోతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే వింటున్నారు. ఈ వ్యవస్థ త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలు లేకపోలేదు. అమెజాన్ సంస్థ దీనికి రూపకల్పన చేసింది. తిరువనంతపురంలో ఏడుగురు మహిళలు ఈ రంగంలోకి ప్రవేశించారు. వీరంతా గృహిణులే కావటం విశేషం.

03/11/2016 - 23:33

రసాయనిక మందులతో పండ్లను మగ్గబెడుతున్న నేపధ్యంలో మార్కెట్లో లభ్యమయ్యే ఫలాలను తినాలంటే భయపడే పరిస్థితి నెలకొందని స్వయంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. చెట్టుమీద కాయ పండేందుకు సహజసిద్ధమైన ప్రక్రియ ఒకటి ఉంది. కాలాన్ని బట్టి వేసవిలో మామిడి, శీతాకాలంలో యాపిల్ ఎలా కాస్తాయో అలా ప్రతీ ఫలానికి ఒక సమయం ఉంది. చెట్టులో కాలానుగుణంగా వాతావరణం, ఉష్ణోగ్రత, గాలిలో తేమ ఆధారంగా మార్పులు వస్తుంటాయి.

03/11/2016 - 00:54

మార్చి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఇం ట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే వేసవిలో శరీర సంరక్షణ సులభత రమవుతుంది. ఎండలబారి నుంచి కళ్లు, చర్మం, శిరోజాలను కాపాడుకోవడం, డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడం ఎలాగో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. మన శరీరంలో నీటి శాతం తగ్గడమే డీహైడ్రేషన్. ఇది ఒక్కోసారి ప్రాణాలమీదకు తెస్తుంది. కళ్లు తిరగడం, నీరసపడడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది.

03/11/2016 - 00:50

నేటి ఆధునిక యుగంలో సంపన్నుల ఇళ్లలోనే కాదు, మధ్య తరగతి కుటుంబాల్లోనూ పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తున్నారు. చిన్నారులకు ఆనందం కలిగించేలా వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆ గదిని తీర్చిదిద్దాలి. వారికి కావలసిన అన్ని సౌకర్యాలను అక్కడ సమకూర్చాలి. పిల్లలు సరదాగా గడిపేందుకు, ఏకాగ్రతతో చదువుపై దృష్టి సారించేందుకు ఆ గదిలో తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే.

03/10/2016 - 03:50

దేశ సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించే కీలక బాధ్యతలను తొలిసారిగా ఓ మహిళ స్వీకరించబోతోంది. రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన 24 ఏళ్ల తనూశ్రీ పరీఖ్ సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) అధికారుల శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందేందుకు ఎంపికై సరికొత్త రికార్డును సృష్టించారు. శిక్షణ అనంతరం ఆమె అసిస్టెంట్ కమాండర్‌గా బాధ్యతలు చేపడతారు. బిఎస్‌ఎఫ్‌లో నేరుగా అధికారి హోదాలో ఓ మహిళ నియామకం పొందడం ఇదే ప్రథమం.

03/08/2016 - 22:02

మూడు దశాబ్దాల తర్వాత ఆమె ఇపుడు మళ్లీ చరిత్ర సృష్టించింది.. దేశంలో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా ముంబయిలో 1986లో జన్మించిన హర్ష చావ్దా సోమవారం నాడు పండంటి మగశిశువును ప్రసవించింది. 2015లో దివ్యపాల్ షాను ఆమె వివాహం చేసుకుంది. గత ఏడాది గర్భం దాల్చిన ఆమెకు ముంబయిలోని కెఇఎం ఆసుపత్రిలో వైద్యులు సిజేరియన్ శస్తచ్రికిత్స చేశారు.

Pages