సబ్ ఫీచర్

మగాళ్ల సూట్స్ తయారీలో మగువ ఘనత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆలోచనల్లో వైవిధ్యం ఉంటే గెలుపు ఖాయం’- అని భరోసా ఇస్తోంది విద్యా నటరాజ్. శ్రీలంకలో ఓ భారతీయ కుటుంబంలో జన్మించిన ఆమె లండన్‌లో ఉన్నత చదువులు ముగిశాక అక్కడే ‘ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకర్’ గా చాలా కాలం పనిచేసింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత బిజినెస్ స్కూలు లో ఎంబిఎ పూర్తిచేశాక భారత్‌కు చేరుకుంది. చెన్నైలో బిజినెస్ కన్సల్టెంట్‌గా ఆమె తన కెరీర్‌ను మొదలుపెట్టింది. వివాహం జరిగాక భర్తతో ఆమె బెంగళూరుకు చేరుకుంది. అక్కడ ‘బ్లూ స్టోన్’ పేరిట ఆన్‌లైన్ జ్యూయలరీ స్టోర్‌ని ప్రారంభించింది. కొన్నాళ్లపాటు ఆ వ్యాపారం నడిపిన తర్వా త, అందరికంటే విభిన్నం గా ఏదైనా చేయాలని ఆమె సంకల్పించింది. అప్పటికే ఆసియాలో పురుషుల సూట్స్ తయారీలో ఎంతో పేరుపొందిన గౌతమ్ గోల్చాతో కలిసి వ్యాపారంలో అడుగుపెట్టాలని భావించింది. అదొక ఛాలెంజ్‌గా ఆమె భావించింది. తొలుత కుటుం బ సభ్యుల నుండి పెద్దగా ప్రోత్సాహం లభించకపోయినా విద్య వెనకడుగు వేయలేదు. తాను చేసింది నలుగురికీ నచ్చితే సక్సెస్ అసాధ్యం కాదని భావించి రిస్క్ తీసుకుంది. మగవారి సూట్స్ తయారీలో అప్పటికే గట్టి పోటీ ఉంది. అది పురుషాధిక్య రంగం కావడంతో నిలదొక్కుకోవడానికి విద్యకి సవాళ్లు తప్పలేదు. చిత్తశుద్ధి, గెలవాలన్న తపనతో పనిచేయడంతో కొద్ది కాలంలోనే ఆమె ఉత్పత్తి చేసిన సూట్స్ మగవారిని ఆకర్షించాయి. దాంతో ఆమె చేపట్టిన వ్యాపారం క్రమంగా పెరిగింది. హ్యూగోమాస్, రాల్ఫ్‌లారెన్ పేర్లతో ఆమె రూపొందించిన సూట్స్‌కి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఆ సూట్స్ వాడేందుకు ఆసక్తి చూపడంతో విద్యకి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ‘టైలర్‌మేన్’ పేరిట ఆమె సొంతంగా నెలకొల్పిన సూట్స్ స్టోర్ బెంగళూరులో ఎంతో ప్రాచుర్యం పొందింది. సూట్స్ తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకత సాధించడంతో కోల్‌కత, చెన్నైలో కూడా స్టోర్‌లను ప్రారంభించి ఆమె వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో సూట్స్ అందించడం ‘టైలర్‌మేన్’ ప్రత్యేకత అని విద్య చెబుతోంది. నాణ్యమైన ముడిసరకు వాడడం, కొలతల్లో వ్యత్యాసాలను కచ్చితంగా పాటించడం, నిర్ణీత సమయానికి సూట్స్ అందించడం వంటివి తన విజయ రహస్యాలని ఆమె అంటోంది. తమ వద్ద సూట్ కుట్టించుకున్న కస్టమర్‌కు సంబంధించి కొలతలను డిజిటల్ పద్ధతిలో నిక్షిప్తం చేస్తామని, ఆ వ్యక్తి మళ్లీ మళ్లీ సూట్ కుట్టించుకునే సమయంలో ప్రతిసారీ కొలతలు ఇవ్వనవసరం లేదని విద్య అంటోంది. ఇలా చేయడం వల్ల కస్టమర్ల సమయం ఆదా అవుతుంది. వారు నేరుగా స్టోర్‌కి రాకుండానే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తమ సూట్‌ని పొందవచ్చు. మహిళగా వ్యాపారరంగంలో అడుగుపెట్టి, మగవారి సూట్స్ తయారీలో నెగ్గుకురావడం ఎంతో ఆనందం కలిగిస్తోందని ఆమె చెబుతోంది. కస్టమర్ల సంతృప్తివల్లనే ఈ విజయం సాధించానని విద్య వినమ్రంగా అం టోంది. ఆమె వద్ద నైపు ణ్యం కలిగిన టైలర్లు ఎం తోమంది ఉన్నారు. తగిన సలహాలు ఇస్తూ వారిని ప్రోత్సహించడం తప్ప పని విషయంలో జోక్యం చేసుకోనని అం టారు. టీమ్‌వర్క్ తప్ప, ఇది తన ఘనత కాదని ఆమె విశే్లషిస్తుంటారు. తాను అనేక వ్యాపారాలు చేసినప్పటికీ ఎక్కడా ఎటువంటి సమస్యని ఎదుర్కొనలేదని, సవాల్‌గా తీసుకుని పురుషుల సూట్స్ ఉత్పత్తిని చేపట్టానని ఆమె గుర్తు చేస్తుంటారు. పని విషయంలో మగాళ్ల కంటే స్ర్తిలే ఎక్కువగా దృష్టి సారిస్తుంటారని అందుకే తన ఫ్యాక్టరీలో అధిక భాగం మహిళలే ఉన్నారని అంటోంది. ఆడవారు బహుముఖ నైపుణ్యం కలిగి ఉంటారని, తమకు కేటాయించిన పనే కాకుండా మరిన్ని పనులు చేయగలిగే సామర్థ్యం వారికి ఉంటుందని అంటారు. నేడు ఆన్‌లైన్ బిజినెస్ విస్తరించడంతో తమకు ఆర్డర్లు భారీగా వస్తుంటాయని, తాము ‘ఫేస్‌బుక్ పేజీ’ నిర్వహిస్తూ కస్టమర్ల సలహాలు, సూచనలు తీసుకుంటామని విద్య వివరిస్తున్నారు. వినియోగదారుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతుందంటారు. డిమాండ్ పెరిగినప్పటికీ అందరికీ అందుబాటు ధరల్లోనే సూట్స్ కుడతామని చెబుతుంటారు. అనిల్ కుంబ్లే, రోహన్ బోపన్న వంటి ప్రముఖ క్రీడాకారులు ఆమె వద్ద సూట్స్ కొంటారు. సెలబ్రిటీలకే కాదు, సామాన్యులకు కూడా ఒకే విధంగా సూట్స్ అందిస్తామని,
జ్యూయలరీ వ్యాపారంలో భర్త, సూట్స్ తయారీలో తాను బిజీగా వున్నప్పటికీ ప్రతిరోజూ ఎంతోకొంత సమయం కుటుంబానికి కేటాయిస్తామని విద్య చెబుతుంటారు. మనసుకి నచ్చిన రంగంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తే విజయం దానంట అదే వస్తుందని ఆమె అంటారు.

-బాబు