S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

06/08/2018 - 21:39

వ్యాసుని, నారదుని, తపోధనులైన మార్కండేయ మహర్షిని, భరద్వాజుని, యాజ్ఞవల్క్యుని రుచిగల పదార్థాలతో భుజింపచేశాడు. ఇదంతా శ్రీకృష్ణుని వుద్దేశించి చేసినదే. శ్రీకృష్ణుని నామాన్ని కీర్తిస్తూ బ్రాహ్మణ శ్రేష్ఠులకు రత్నాలనూ, వస్త్రాలనూ, గ్రామాలనూ, గుఱ్ఱాలనూ, రథాలనూ, వందల వేలకొలది స్ర్తిలను, గోవులనూ దానంచేశాడు.

06/07/2018 - 21:33

ధృతరాష్ట్రుడు యోగనిష్ఠుడై ఆ అగ్నియందే సంయోగం చెందాడు. పుత్రులను కోల్పోయిన మహాపతివ్రత అయిన గాంధారి భర్త సేవావ్రతంలో నిలిచి పతిననుసరించి ఆ అగ్నిలోనే తానూ సంయోగం చెందింది. ఉత్తమ లోకాలకు వెళ్ళింది.

06/06/2018 - 21:34

యుయుత్సుడు, సంజయుడు, యశస్విని అయిన గాంధారీదేవి మొదలైనవారు ధృతరాష్ట్రునివైపు కూర్చున్నారు.
పట్ట్భాషేకానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధపరిచారు. అప్పుడు పురోహితుడైన ‘్ధమ్యుడు’ శ్రీకృష్ణుని అనుమతితీసికొని ఈశాన్యంవైపు చూచే వేదిక నేర్పరిచాడు. అగ్నికాంతులుగల ‘సర్వతోభద్ర’మనే ఆసనం మీద ‘‘్ధర్మరాజును, ద్రౌపదిని’’ కూర్చుండబెట్టాడు. మంత్రపూర్వకంగా దౌమ్యుడు అగ్నిహోమం చేశాడు.

06/05/2018 - 21:59

అప్పుడు ద్రౌపది కలిగించుకొని ధర్మరాజుకు దండనీతి గురించి వివరిస్తుంది. ధర్మసూక్ష్మాలను దర్శించగల ద్రౌపది ధర్మరాజునుద్దేశించి ఎంతో మృదువుగా అనునయిస్తూ-
‘‘రాజా! నీ తమ్ముళ్ళు చాతక పక్షులవలె నీరసించిపోతున్నారు. ఇంకా యింకా కుమిలిపోతున్నారు. సముచితంగా సంభాషించి వారిని సంతోషపెట్టుము. పూర్వం ద్వైతవనంలో చలికి, గాలికి కృశించినపుడు నీ తమ్ముళ్ళతో ఎలా చెప్పావు?

06/03/2018 - 21:19

‘‘నాయనా! కౌంతేయుడు మహాజ్ఞాని. అర్జునుడు రణభూమిలో బ్రహ్మశిరోస్త్రాన్ని రోషంతో కానీ, నిన్ను నాశనం చేయాలని గానీ ప్రయోగింపలేదు. కేవలం నీవు ప్రయోగించిన అస్త్రాన్ని శాంతింపజేయటానికి మాత్రమే ప్రయోగించాడు. మరలా ఉపసంహరించాడు. నీ తండ్రి ఉపదేశంతో ఈ అస్త్రాన్ని పొంది గూడా అర్జునుడు క్షత్ర ధర్మంనుండి తొలిగిపోలేదు. అతడు ధృతిమంతుడు. సాధువు, సర్వాస్తవ్రేత్త. సజ్జనుడు.

06/01/2018 - 20:53

దుర్మార్గుడైన తన కుమారుని చంచలత్వం ఆచార్యునికి తెలుసును. అందువలన ధర్మవేత్త అయిన తనా తదుపరి కుమారుని శాసించి ‘‘నాయనా! ఎంత ఆపదలోనున్నా, యుద్ధ్భూమిలో ఈ అస్త్రాన్ని విశేషించి మనుష్యులమీద ప్రయోగింపరాదు. నీవెప్పుడూ సజ్జన మార్గంలో నిలవవని నా సందేశం’’ అని అన్నాడు.

05/31/2018 - 21:16

తరువాత తన శిబిరానికి వెళ్ళి అశ్వత్థామ కత్తిచేత ఖండించబడిన తన కొడుకులను చూచి వారి శరీరాలపైబడుతూ బిగ్గరగా యేడ్వసాగాడు. శ్రీకృష్ణార్జునులూ, తక్కినవారు తగిన మాటలతో ఓదార్చారు. ఏడుపు మాని ద్రౌపదికొరకు ప్రతీక్షిస్తూ ఒకచోట కూలబడ్డారు.

05/30/2018 - 22:01

ఆ దివ్య పురుషుని విశ్వరూపాన్ని చూడటానికి మహర్షులు, నారదాది మునుల తమ మనస్సులో కుతూహల పడుచుండగా ఆ దేవదేవుడు అప్పుడు నారద, మహర్షుల, భీష్మద్రోణవిదుర సంజయులవైపు దయతో నిండిన చూపులు ప్రసరింపజేసి వారికి తన విశ్వరూపాన్ని సందర్శించగలిగే దివ్యదృష్టిని ప్రసాదించాడు. ఆ పుణ్యపురుషులు ఆ నారాయణుని విశ్వరూపాన్ని తిలకించి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించారు.

05/29/2018 - 21:11

మహర్షులు తమ తమ ఆసనాలలో ఆశీనులైన తరువాత శ్రీకృష్ణుడు భీష్మద్రోణాది కురువృద్ధులు తమ తమ పీఠాలను అలంకరించారు. దుర్యోధన కర్ణశకుని దుశ్శాసనాదులు అందరూ తమతమ పీఠాలయందు ఆశీనులయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను పాండవుల పక్షాన రాయబారానికి వచ్చానని తెలిపాడు. ధృతరాష్ట్రునితో పాండవుల భాగం పాండవులకు యిచ్చి నీ రాజ్యభాగాన్ని కురుకుమారులకు యిచ్చి అందరూ సుఖంగా వుండేటట్లు చూడవలసిందని హితవు పలికారు.

05/28/2018 - 21:11

హిమవత్పర్వతము కదలాడినను, భూమి పగిలి ముక్కలైననూ, నక్షత్రములతోపాటు మిన్ను విరిగి నేలగూలిననూ నా మాట పొల్లుబోవదు. వమ్ముగాదు. శత్రువులను చంపి సంపదలను సమకూర్చుకొన్న నీ భర్తలను త్వరలోనే చూతువు’’ అని అన్నాడు. ద్రౌపదిని శాంతపరచాడు.

Pages