S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

08/20/2018 - 20:06

ఉదాహరణకు- చెర్నోబిల్ అణువిస్ఫోట దుర్ఘటన తరువాత కొంతమంది శాస్తవ్రేత్తలు యుగోస్లేవియాలో హోమ ప్రభావాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి, హోమ పరిసర ప్రాంతాలలో రేడియో ధార్మిక వికిరణ ప్రభావం తగ్గిందని నిర్ధారించారు. అలాగే భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ రసాయనిక ఫ్యాక్టరీ గాస్ లీకేజ్ జరిగినప్పుడు కూడా హోమంవల్ల రక్షణ జరిగింది.

08/19/2018 - 23:34

ఉభయ సంధ్యలలోను, హోమాలను నిత్యవిధులుగా ఏర్పాటుచేశారు.
హోమంలో రసాయన శాస్త్రం:
ప్రశ్న: హోమములవల్ల కార్బన్ మొనాక్సైడ్- కార్బన్‌డై యాక్సైడ్ వంటి చెడు వాయువులు అధికంగా పుట్టి వాతావరణాన్ని కలుషితం చేయవా?
జవాబు: దూలాలకు దూలాలువేసి తగలబెడితే ఆ పనే జరుగుతుంది. కాని హోమంలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి.
1. ప్రత్యేక దినుసులనే వాడతారు.
2. పరిమితంగా వాడతారు.

08/15/2018 - 22:03

వర్ణం అనే పదంవల్ల వ్యక్తమయ్యే అక్షరము, తేజస్సు- రెండూ ఒకే తత్త్వంలోంచి వ్యక్తం అవుతున్నాయి గనుక, ఆ రెంటికీ సహజంగానే సమన్వయం వుంటుంది. మూలాధారంలో వ్యక్తమయ్యే గణపతి తత్త్వం పృథివీ తత్త్వానికి సన్నిహితం కనుక, ఆయన వ్యక్తంచేసే జ్యోతిస్సు రక్తవర్ణంగా వుంటుంది. (పృథివీతత్త్వం ఎరుపు రంగని యోగశాస్త్రంలో ప్రసిద్ధం.) అందుకనే గణపతి రక్తచందన ప్రియుడు. రక్తపుష్ప ప్రియుడు.
త్రికోణం

08/10/2018 - 19:46

ఇంత లోతైన పరిశీలన, పరిశోధన వున్నాయి గనుకనే, సుశ్రుతాచార్యుడు ప్రపంచంలోని మొట్టమొదటి శస్తచ్రికిత్సాచార్యుడుగా, ప్లాస్టిక్ సర్జరీ, శస్తచ్రికిత్సా సృష్టికర్తగా, మనిషి కపాలానికి కూడా శస్త్ర చికిత్స జరిపిన ప్రజ్ఞానిధిగా ఆధునికుల చేత కూడా కీర్తింపబడుతున్నాడు.

08/09/2018 - 19:41

కనుక, ఆయుర్వేద వైద్యుడు, కేవలం రోగ లక్షణాలను మాత్రమేగాక, ఆ లక్షణాలకు కారణమైన దోష వైషమ్యాన్ని దానివల్ల ప్రభావితమైన దూష్య స్థానాన్ని, దాన్ని నివారించగల ఔషధ యోగాన్నీ కూడా గుర్తించగలగాలి. (యోగము అంటే - వివిధ ఓషధుల కలయికవల్ల యేర్పడిన ఔషధ స్వరూపము.)

08/08/2018 - 18:46

మనకు లభిస్తున్న భారతీయ వైజ్ఞానిక శాఖలలో ఆచరణ పరంగానూ, గురుశిష్య పరంపరగానూ అమలులో ఉన్న సజీవ శాఖలు రెండే రెండు. అవే గణితము, వైద్యము. వీటిలో గణితం పంచాంగ గణిత రూపంలో సజీవంగా ఉండగా వైద్యం, ఆయుర్వేదం రూపంలో విస్తృత ప్రచారంలో ఉన్నది. దీనిలో పోయినంత పోగా మిగిలి ఉన్నదే సముద్రమంత ఉన్నది. ప్రజలలో దీనిని గురించిన అవగాహన కూడా ఎంతో కొంత వుంది.

08/07/2018 - 19:25

అందువల్ల వ్యవసాయ పద్ధతులు, దానికి సంబంధించి శాస్త్రం అధికాధికంగా అల్లుకుపోయి అభివృద్ధి చెందవలసిన అవసరం ఏర్పడింది.
వ్యవసాయ సాధనాల వర్ణన ఇందులోని ఒక ప్రధానాంశం. వివిధ వ్యవసాయ పనిముట్లు, వాటిలోని భాగాలు, వాటి కొలతలు వర్ణించబడ్డాయి. ప్రత్యేకించి ఇందులో వర్ణించిన నాగలి! ఈనాటికీ అదే వర్ణన సరిపోలుతుంది. చెప్పుకొని వున్నాం కదా.

08/06/2018 - 19:27

క్రీ.పూ.321-296 కాలంలోని కౌటిల్యుని అర్థశాస్త్రంలో ‘‘వ్యవసాయ రంగం’’ గురించిన అనేక విషయాలు ప్రస్తావించబడి వున్నాయి. ఆ రోజుల్లో రాజాస్థానాలలో ‘‘సీతాధ్యక్షుడు’’ (సీత అనగా నాగటిచాలు)అనే పదవి వుండేది. ఆయనకు వ్యవసాయ విధానాలు తెలిసి వుండాలి, పైరు పంటలకు, వృక్షాలకు వచ్చే వివిధ వ్యాధుల గురించి వాటి నివారణోపాయాల గురించి కూడా క్షుణ్ణంగా తెలిసి వుండాలి.

08/01/2018 - 18:52

భరద్వాజుని గ్రంథంలో ఇలా ఉంది.
సర్వేషాం లోహవర్గాణాం గాలనార్థం విశేఃతః
ద్వాత్రింశదుత్తర పంచశతం భస్త్రా ఇతీరితాః
భస్ర్తీకా నిబంధనాఖ్య గ్రంధే సమ్యజ్నిరూపితాః
దీనిని బట్టి ‘్భస్ర్తీకానిబంధనము’ అనే పేరుగల గ్రంథంలో భస్ర్తీకల నిర్మాణ విషయాలున్నాయనీ, ఆ భస్ర్తీకలు అయిదు వందల ముప్ఫై రెండు రకాలనీ, అవి ఎనిమిది వర్గాలుగా వర్గీకరించబడ్డాయనీ తెలుస్తోంది.

07/27/2018 - 20:42

ఈ మంత్రం భూమిలో బంగారం రూపొందే విధానాన్ని పరామర్శిస్తోందని మనం గుర్తించాలి.
వేద పరిభాషలో రోగాలకు పాపాలనే పేరు ఉంది గనుక, బంగారాన్ని రక్షాద్రవ్యంగా వినియోగించటాన్ని ఈ మంత్రం చెపుతోంది గనుక, బంగారం యొక్క ఓషధీ విలువలను కూడా అథర్వశ్రీవేదం ప్రస్తావిస్తోందని మనం గుర్తించాలి.

Pages