డైలీ సీరియల్

యాజ్ఞసేని-125

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరువాత తన శిబిరానికి వెళ్ళి అశ్వత్థామ కత్తిచేత ఖండించబడిన తన కొడుకులను చూచి వారి శరీరాలపైబడుతూ బిగ్గరగా యేడ్వసాగాడు. శ్రీకృష్ణార్జునులూ, తక్కినవారు తగిన మాటలతో ఓదార్చారు. ఏడుపు మాని ద్రౌపదికొరకు ప్రతీక్షిస్తూ ఒకచోట కూలబడ్డారు.
అక్కడ ద్రౌపది కూడా నకులుని ద్వారా కొడుకులూ, సోదరులూ చనిపోయిన విధం వినటంచేత నోరు అర్చుకపోయేటట్లుగా రోదిస్తూ మూర్చబోతూ, తెప్పరిల్లుతూ వుండగా నకులుడు మెల్లగా ఆమెను ఓదారుస్తూ తోడ్కొని వచ్చాడు. తగిన వాహనాలెక్కి వెంట వచ్చిన స్ర్తిలు గూడా యేడుస్తూ ద్రౌపది చుట్టూ కూచ్చున్నారు. తదుపరి ద్రౌపది లేచి కొన్ని అడుగులు వేసి నేలమీద వాలింది. వెంటనే భీమసేనుడు ద్రౌపదిని పట్టుకొని లేవదీసి ధర్మరాజువద్దకు తీసికొనిపోయాడు. ధర్మరాజును చూసిన ద్రౌపది.
‘‘ప్రభూ! సంపదకు తగ్గట్టుగా పరివారమైన నా కుమారులు వర్ధిల్లటం నేను చూడలేకపోయాను. అమిత పరాక్రమవంతుడైన ‘అభిమన్యుడు’ కూడా నశించాడు.
రాజా! అదృష్టంకొద్దీ నీవు క్షత్రధర్మంతో పుత్రులను యమునకిచ్చి ఈ భూమినంతా పొంది అనుభవింపగలవు. భాగ్యవంతుడవే. క్షధర్మం కొరకు ఉపప్లాన్యంలో నాతోపాటు నివసిస్తూ నీవు శూరులైన కుమారులను మరచిపోగలవు.
పార్థా! పాపకర్ముడైన అశ్వత్థామ నిదురిస్తున్న నా కుమారులను చంపాడని విని అగ్ని తగులబెట్టినట్లు శోకం నన్ను దహిస్తున్నది.
ఈరోజు నీవు యుద్ధంలో పరాక్రమించి పాపపు పనిచేసినఆ అశ్వత్థామ ప్రాణాలను, బంధుజనుల ప్రాణాలతో సహా అపహరించకపోతే నేనిక్కడ ప్రాయోపవేశం చేస్తాను.
పాండవులారా! వినండి ఈ పాపకృత్యానికి తగిన ఫలితాన్ని అశ్వత్థామ పొందకపోతే నేను బ్రతకను’’ అని యాజ్ఞసేని ధర్మరాజుతో పలికి ఆయనయెదుట కూర్చున్నది. అలా మాట్లాడిన ద్రౌపదితో ధర్మరాజు.
కళ్యాణి! రాచ బిడ్డలు యుద్ధంలో మరణించటం సముచితమేగదా! నీ కొడుకులూ, సోదరులూ, ధర్మబద్ధంగా పోరాడి ధర్మమార్గంలో మరణించారు. ఇక నీవు దుఃఖంతో బాధపడటం దేనికి? మంచి మనస్సుగల నీవు శాంతించటం మంచిది. శోకం మానుము. అశ్వత్థామ చేసిన అవమానంవల్ల కలిగినకోపం వాడిని చంపితే కానీ పోదని చెప్పటం కాదు. నా అభిప్రాయం కూడా ఇదే. అయితే అశ్వత్థామ యిక్కడినుండి యెంతో దూరంలోని దుర్గమారణ్యానికి వెళ్ళాడు. చంపినట్లు నీకెలా తెలుస్తుంది చెప్పుమా?’’ అని అనగా ద్రౌపది.
‘‘ఆ దుష్టుడికి పుట్టుకతోనే తలపై సహజమైన శిరోమణి వున్నదని విన్నాను. ఆ పాపాత్ముని యుద్ధంలో చంపి ఆ మణిని తెస్తే చూస్తాను. రాజా! ఆ మణిని నీతల మీద ధరిస్తే నేను బ్రతుకుతాను. ఇది నా నిర్ణయం’’ అని యుధిష్ఠిరునితో అని భీముని దగ్గరకువచ్చి అతడిని స్పృజించి
‘‘్భమసేనా! మనస్ఫూర్తిగా క్షత్రియోచిన ధర్మాన్ని పూని శీఘ్రమేవెళ్ళి దుష్టుడైన ఆ అశ్వత్థామను తాకి శంబరుని ఇంద్రుడు చంపినట్లు చంపుము. నా మనస్సులోని కోపాన్ని, శోకాన్నీ మాన్పినన్ను రక్షించుము. నీతో సమానమైన మగవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. గతంలో యెలా మహాకార్యాలు చేశావో అలాగే ఈజు అశ్వత్థామను చంపి సుఖంగా వుండుము’’ అని అనగా
అనేక రీతులుగా వున్న ఆ ద్రౌపది విలాపాన్ని విన్న భీమసేనుడు భరించలేక పోయాడు. రథాన్నియెక్కాడు. బాణాలతో సహా విల్లును చేతబట్టాడు. నకులుని సారథిగా చేసికొని, వింటిని యెక్కుబెట్టి, బాణాన్ని సంధించి వేగంగా గుఱ్ఱాలను నడిపించాడు. అశ్వత్థామ వెళ్లిన రథచిహ్నాలను అనుసరిస్తూ ఈ మార్గంలోనే వేగంగా ముందుకు పోయాడు. కురుక్షేత్రంలో తిరిగే జనులను చూచి
‘‘అశ్వత్థామ యెక్కడున్నాడో యెరుగుదురా?’’ అని అనగా వారు భీమసేనునితో
‘‘అతడు కృపకృతవర్మలతో హస్తినాపురం వైళ్ళి మరల, గంగానది ఒడ్డుకు వచ్చి అక్కడ ఆ యిద్దరు వీరులు తనను విడిచి ఒక దిక్కుగా వెళ్ళగా తాను వ్యాసాశ్రమానికి పోయి అక్కడ నిలిచాడు’’ అని విన్నవించారు. ‘‘ఆవైపు రథం పోనీ’’ అని భీమసేనుడు అన్నాడు.
భీమసేనుడు బయలుదేరగానే శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ‘‘పాండునందనా! ఈ నీ సోదరుడు పుత్రశోక పరాయణుడై యుద్ధంలో అశ్వత్థామను చంపాలని ఒంటరిగా దాడిచేయబోతున్నాడు. ఇప్పుడు కష్టాన్ని యెదుర్కొనబోతున్నాడు. నీవెందుకు సహకరించవు? ద్రోణాచార్యుడు అర్జునునిపై ప్రీతితో బ్రహ్మ శిరోనామకమైన అస్త్రాన్ని ఉపదేశించాడు. ఆ అస్త్రం ఇప్పుడు భూమండలాన్ని దహించగలదు. అశ్వత్థామ అర్జునునిపై ఈర్ష్యతో బ్రహ్మశిరోనామకమైన అస్త్రాన్ని తనకుగూడా ఉపదేశించమన్నాడు. ద్రోణుడు ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామకు ఉపదేశించాడు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము