డైలీ సీరియల్

యాజ్ఞసేని-123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహర్షులు తమ తమ ఆసనాలలో ఆశీనులైన తరువాత శ్రీకృష్ణుడు భీష్మద్రోణాది కురువృద్ధులు తమ తమ పీఠాలను అలంకరించారు. దుర్యోధన కర్ణశకుని దుశ్శాసనాదులు అందరూ తమతమ పీఠాలయందు ఆశీనులయ్యారు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను పాండవుల పక్షాన రాయబారానికి వచ్చానని తెలిపాడు. ధృతరాష్ట్రునితో పాండవుల భాగం పాండవులకు యిచ్చి నీ రాజ్యభాగాన్ని కురుకుమారులకు యిచ్చి అందరూ సుఖంగా వుండేటట్లు చూడవలసిందని హితవు పలికారు.
తరువాత అక్కడకు వచ్చిన మునులు, మహర్షులుగూడా దుర్యోధనునికి హితకార్యాలు చెప్పారు. సంధి చేసికొమ్మన్నారు. భీష్మద్రోణాదులు గూడా దుర్యోధనుని పాండవుల రాజ్యభాగాన్ని వారికిచ్చి కౌరవ పాండవులిద్దరూ వారి వారి రాజ్యాభాగాలను వారు యేలుకొమ్మన్నారు. కానీ దుర్యోధనుడు అహంకారంతో
‘‘నేనూ వారూ పుడమిని పంచుకొని పాలించటం జరగదు. వారికి ‘వాడి’ సూదిమొన మోపినంత మాత్రమైనా భూమిని పంచి పాండునందనులకు నేనివ్వను. మాలో యెవరో వొకరు యుద్ధంలో విజయం సాధించి రాజ్యం చేయటానికే నిర్ణయించాను’’ అని అన్నాడు.
పిమ్మట ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో ‘‘వాసుదేవా కృష్ణా! నా కుమారుడు మూఢ చిత్తుడు. నీవో త్రోసిరాజనని బాంధవుడవు. మహాత్ముడవు. కారుణ్య కలితహితయుడివి. వీని నెటులైనా శాంతింపజేయుమని వేడుకొంటున్నాను.’’ అని అన్నాడు. ధృతరాష్ట్రుడారీతిగా కోరగా శ్రీకృష్ణుడు దుర్యోధనునితో
‘‘సుయోధనా! నీకు మొండి పట్టుదల తగదయ్యా! ఎవరో కుత్సితులు తప్ప నీవంటి వుత్తమ ప్రభువు అన్యాయానికి పాల్పడడు. చెడు మాటలను వినవద్దు. పాండవులు పరాక్రమ సమగ్రులు. వీరితో కలిసిమెలిసి జీవించవలెనన్నదే ధృతరాష్ట్ర భీష్మద్రోణబాహ్లికుల కోర్కె. కర్ణశకుని దుశ్శాసనాదుల సలహాలు కార్యాన్ని సాధించి పెట్టవు. పాండవులు మీపై యుద్ధానికి తరలివచ్చినప్పుడు వారినెదిరించటానికి వీరు యేమాత్రం కొరగారు సుమా!
దుర్యోధనా! కర్ణాదులే కాదు దేవతలు కూడా కౌంతేయులను ఎదుర్కొనటం శక్యంకాదు. కావున పాండవులతో సంధియే సర్వవిధాలా శ్రేయస్కరం. భీముడు, అర్జునుడు గతంలో ప్రదర్శించిన వీరకృత్యాలను నీవెరుగుదువు. రాజా! నే చెప్పేది కోపగించక వినుము. నేనే అర్జునుడికి సహాయుడనైరాగా అతడిని ప్రతిఘటించడం చేటునకు మూలం. యుద్ధంలో నీకు విజయం అసంభవము సుమా! కులనాశకుడవని అపనిందను పొందటం మంచిది కాదు. సుయోధనా! పాండవులు నీతో సంధి చేసుకొని జీవిస్తామంటే వారి పొత్తు వద్దనటం లక్ష్మి తానై యింటికి వస్తుంటే వద్దని మోకాలడ్డం పెట్టిన చందంగా వున్నది.’’అని అన్నాడు.
తదుపరి భీష్మద్రోణాదులు మరలా దుర్యోధనునికి హితమైన పలుకులు పలికారు. ధృతరాష్ట్రుడు బ్రతికి వుండగానే విడువకుండా బంధువులను, రాజ్యాన్ని కీర్తిని నాశనం చేయాలని ప్రయత్నించటం మూర్ఖమైన పననీ, శ్రీకృష్ణార్జునులతో పెట్టుకొనే శత్రుత్త్వం సమస్త బంధువులనేగాక, భూమిపై యెవ్వరికినీ సహించరానిదే అవుతుందనీ, కావున పాండవులతో కలిసిమెలిసి జీవించటం మంచిదని హితాన్ని చెప్పారు.
దుశ్శాసనుని ప్రేరణతో దుర్యోధనుడు సభనుంచి లేచి వెళ్ళాడు. అతని వెంట కర్ణశకుని, సహోదరులు కూడా సభనుండి లేచి పోయారు.
శ్రీకృష్ణుడిని పట్టవలెననెడి దుష్కార్యాలోచన చేసి దుష్టచతుష్టయం, మరికొందరు రాజులు కలిసి అక్రమమార్గాన్ని యెంచుకొన్నారు. సాత్యకి, కృతవర్మ దానిని గమనించి తగిన జాగ్రత్తలు తీసికొని, శ్రీకృష్ణునికి విషయాన్ని తెలిసేటట్లు చేశారు. ఆ విషయాన్ని ధృతరాష్ట్రుడు తెలిసికొని విదురుని పంపి దుర్యోధనుడిని అతని పరిజనులతో కూడా సభలోనికి రప్పించాడు. దుర్యోధనుని నిందించాడు.
ఆ సమయంలో శ్రీకృష్ణుడు యెదుటనున్న దుర్యోధనుని చూచి ‘‘దుర్యోదనా నేను ఒంటరివాడిననేగదా నీవు దుర్వర్గంతో నన్ను పైబడి బంధించడానికి యుత్సాహపడుచున్నావు. ఇప్పుడు నేనెక్కడికి పోగలాడను? సరే నన్ను పట్టుకొనుము’’ అనది ఒక చిరునవ్వు నవ్వి
శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ ముకుందుడి దివ్య తేజస్సును చూడటానికి శక్యంగాక సమస్త జనులు (దుర్యధనాదులతో సహా) కన్నులు మూసుకొని నిశే్చష్టులయ్యారు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము