S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

07/26/2018 - 00:06

కళ్లల్లో కళ్లు పెట్టి చూడు అన్నాడు ‘రాగా’ (రాహుల్ గాంధీ). వెంటనే- మీరు చూడలేరు సారూ!.. అని కూడా అన్నాడు. ‘నమో’ (నరేంద్ర మోదీ) కితకితలెట్టినట్లు నవ్వాడు. ఈ ‘రాగా’ల, ‘నమో’ల సరాగాలే లేకుంటే- జనాలకి -ఒకరు యాభై నిమిషాలు - జవాబుగా మరొకరు తొంభై నిమిషాలు తాషా మర్ఫా వాయించి పారేస్తారు- బోరుకొట్టి చచ్చేవాళ్ళం.. అన్నాడో టీవీ ప్రేక్షకుడు ..

07/18/2018 - 22:38

దేవుడి గుడికి శుద్ధి ఉంటుంది. కాని ‘దేవుడికి శుద్ధి’ అనే మాటకి అర్థమేమిటి? దేవుడే నిజానికి శుద్ధి.. ఆయన ఎదో పాపం లేదా పుణ్యవశానో.. విగ్రహంలో ప్రవేశించాడు.. ఆ విగ్రహం ఏడు కొండలపై కొలువైంది.

07/05/2018 - 00:57

ఎందుకొచ్చిన ప్రగతి..? ఎందుకొచ్చిన అత్యంత సోకాల్డ్ ఆధునికత..? అరచేతిలోనే ప్రపంచం అంతా చూడొచ్చు. ఆగమేఘాల మీద ప్రపంచాన్ని చుట్టి రావొచ్చు. కాని రోడ్లకి రక్తదాహమెక్కువ అయిపోయింది. తెల్లారేపాటికి ఇప్పటికీ- ఇంటర్నెట్ కాలంలో కూడా పేపరు కోసం ఎదురుచూడటం అలవాటైపోయింది. రివ్వున మూడో అంతస్తుకైనా- ఎగిరి వచ్చిపడే ‘పిట్ట’ (పేపర్ చుట్ట) అది. దాన్ని విప్పి చూడాలంటేనే భయం- ఆందోళన..

06/28/2018 - 00:23

ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఏకుమేకైపోయి చాలా కాలమైంది. ఆ మాటకొస్తే ‘సంఘ్ పరివార్’లో ఎవరు ఇప్పుడు ‘జో హుకుం సర్కార్! మోదీ సాబ్ జిందాబాద్!’ అంటూ చిడతలు పట్టుకొని తిరుగుతున్నారు? శివసేన పార్టీ ముందే భాజపాకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఏదో సామెత చెబుతారే అలాగ - యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హాలనే రెండు సింహాలు పబ్లిగ్గా మోదీజీని, భాజపా సర్కార్‌ని కూడా నిందిస్తూ తిడుతూ ఎడాపెడా వాయించేస్తున్నారు.

06/20/2018 - 23:52

ఓ సంకటం తప్పింది!

06/14/2018 - 02:10

గుళ్ళో.. రైల్లో.. బళ్ళో.. హాల్లో.. కిచెన్లో.. బాత్‌రూమ్‌లో ఎక్కడైనా సరే, ట్రైనింగులో.. మీటింగులో.. మార్నింగు వాకింగులో.. ఆఫీసులో.. కాలేజీలో - ‘ఎనీ వేర్.. ఎవ్వెరీ వేర్- మనిషి వెంట ‘నీ నీడను నేను, నిను వీడను నేను’.. అంటూ వెంటవచ్చే ఫ్రెండు.. ఫిలాసఫర్ అండ్ గైడ్- సెల్ ఫోన్ మాత్రమే . స్మార్ట్ ఫోను ఒక్కటి చేత ఉంటె అదే స్వర్గమూ అదే స్వర్గమూ.. పొతే పోతాడు పక్క వాడు ‘ హెల్’కి.

06/07/2018 - 00:18

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఒకేసారి ఆరుగురు ఘనత వహించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ‘కొంపలేని వారు’ అయిపోయారు. మాజీ ముఖ్యమంత్రులైనప్పటికీ పార్టీ అగ్రనేతల హోదాలో ప్రభుత్వ బంగ్లాల్లో సుఖభోగాలు అనుభవిస్తూ- ‘ఏనుగు చచ్చినా బతికున్నా వెయ్యి వరహాలే’ అన్నట్టు దర్పంగా బతికేస్తున్న రెండు బడా పార్టీలకు చెందిన ముగ్గురు బడాబాసులు ‘రోజులు మారాయ్’ అని గ్రహించాల్సి వచ్చింది.

05/31/2018 - 01:56

నిప్పులు చెరిగే ఎండాకాలంలో- క్రికెట్ బంతీ బ్యాటూ పోరా? .. జనాలు బతకాలా? చావాలా? పిల్లకాయలకి ఎంట్రన్సు పరీక్షలు లేవా? ఏప్రిల్ ఏడు నుంచి మే నెల చివరిదాకా చండ ప్రచండ ఎండలకి ఫ్లడ్ లైట్స్ వేడిమి - తోడుగా పెట్టుకొని పగలూ రాత్రీ కలిపి- నానా గోత్రస్య - నానా దేశస్థ -బహుళ జాతి క్రికెట్‌ని తిలకించి పులకించగా కోట్లాది ప్రేక్షకుల వేలం వెర్రియా?

05/24/2018 - 00:13

ఎండాకాలంలో పాదయాత్రలు సంకల్పబలం ఉన్న వాళ్ళే చే య్యగల్రు. అందరూ చెయ్యలేరు. సంకల్పయాత్రలో అద్భతమైన సంకల్పమ్స్ అందరికీ రావు. మోదీ మహాశయుడు - కాంగ్రెస్సు రహిత భారత దేశం గురించి కలలు కనడం -అందుకు ఎన్నో చిట్కాలు, పథకాలు తయారు చేసుకోడం చూసి గొప్ప నాయకులు అదే బాట తామున్నూ అనుసరించడంలో నామోషీ లేదు. కానీ.. . ‘నమో’ ఒక గొప్ప థింకర్ - మేధావి అని కమూ నిస్టులు, కమ్మూనలిస్టులు కూడా ఒప్పుకుంటారు.

05/16/2018 - 23:24

నీపుర్ర చెయ్యి తియ్ .. నా ఎడం చెయ్యిపెడతానన్నట్లుగా ఉంది కర్ణాటక పరిస్థితి. మన సానుభూతి అందవలసింది -కర్ణాటక ప్రజలకే. పాపం..! క్యూలు కట్టి నిలబడి వేలి మీద ముద్దరేయించుకున్న వోటరు ఏపార్టీ వాడైనా మిగిలింది చింతే..

Pages