S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

03/21/2019 - 01:01

దేశంలో మొట్టమొదటిసారి 1951 అక్టోబర్ 25 నుంచీ 1952 ఫిబ్రవరి 21వరకు- మొత్తం అరవై ఎనిమిది దశలలో ఎన్నికలు నిర్వహించారు. కానీ అటు తర్వాత ఎన్నడూ 36 రోజులకు మించి పోలింగ్ ప్రక్రియ జరుగలేదు. సుదీర్ఘ కాలం పోలింగ్ దశలు కొనసాగిన ఎన్నికలలో యిప్పుడు జరుగుతున్న ఎన్నికలు రెండో స్థానాన్ని ఆక్రమించుకుంటున్నాయి.

03/14/2019 - 00:57

ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే జమిలిగా లోక్‌సభకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందున్న రాజకీయ పరిస్థితికీ, యిప్పుడు ఉభయ రాష్ట్రాలలో వున్న రాజకీయ స్థితిగతులకీ పోలికే లేదు.

02/28/2019 - 01:36

అధీనరేఖ అంటే ఎల్.ఒ.సి నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన భూభాగంలో యాభై కిలోమీటర్ల దూరంలో వున్న జైషే మహమ్మద్ టెర్రరిస్టు శిక్షణా శిబిరాలమీద తెల్లారితే మంగళవారమనగా భారతీయ వైమానిక దళానికి చెందిన పనె్నండు మిరాజ్‌లు బాలాకోట్, చికౌటీ, ముజఫరాబాద్ టెర్రరిస్టు స్థావరాలమీద మెరుపుదాడులు చేసి మసూద్ అజర్ మహమ్మద్ బావమరిది ఉస్తాద్ ఘోరీ సహా వందలాదిమంది పాషాణ ఉగ్రవాదులను ముట్టుబెట్టి ‘అడంగు’కి విజయోత్సాహంతో తిర

02/21/2019 - 03:41

వ్యక్తికన్నా గొప్పది దేశం. దేశ సరిహద్దుల్నీ, భద్రతనీ కాపాడే సైనికుడు అందరికన్నా గొప్ప. కశ్మీర్‌లో తరాలు మారినా శక్తిసామర్థ్యాలు, ధైర్య సాహసాలు తగ్గకుండా- టెర్రరిస్టు రక్కసి మూకల దొంగదాడులకు గురి అయి వుండి- వారిని ‘గురి’పెట్టి మట్టువెట్టే వీరజవాన్లు యుద్ధరంగంలోగాక దొంగ దాడుల నీచ నికృష్ట రంగంలో ప్రాణాలు కోల్పోడం జాతీయ విషాదం.

02/14/2019 - 01:05

దేశం మొత్తం మీద ‘విగ్రహ పుష్టి’ ఎవరికి వున్నదయ్యా అంటే, ఇంకెవరికి..? ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజనుల ఆరాధ్యదేవత మాయావతికే అని ప్రతిపక్ష నాయకులు కూడా ఒప్పుకుంటారు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్నట్లు బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు- తనకి తగ్గ లెవెల్‌లో పార్టీ సింబల్‌ని కూడా ఎన్నుకున్నది.

,
02/07/2019 - 00:22

సకల జనులు ‘ఔరా!’ యనగా- పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి- వీర వనితగా వాసికెక్కిన ‘ధర్నా దీదీ’ మమతా బెనర్జీ నడిరోడ్డుమీద- కటిక చలిలో- లంఘించిన బెబ్బులి మాదిరి రాత్రి తెల్లవార్లూ బైఠాయించింది. ఈ ‘గయోపాఖ్యానం’లో ‘గయుడు’- కలకత్తా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్, కలకత్తా మేయర్ కూడా ఆమె పక్కనే ఒదిగి కూర్చున్నారు. దీదీ దీక్ష చేస్తున్నారని తెలిసి దేశం నాలుగు చెరగులా ఉలిక్కిపడ్డది.

01/24/2019 - 01:11

‘‘అబ్బా.. బోడిగుండా..?’’ అని అంటారు. కానీ అమూల్యమైన సంపదగా పెంచుకున్న శిరోజ పుంజాల్ని- నీలాద్రి కొండ మీదుగాపోయి, శ్రీవారి కళ్యాణకట్ట దగ్గర, నారుూబ్రాహ్మడి ముందు అతి వినయంగా తలవొంచి- ‘గోవిందార్పణం’ అయినాక- ‘‘యింతకన్నా ఏడువారాల నగలు నిలువుదోపిడీగా యిచ్చేసుకున్నా బాగుండేది..’’అనుకుంటారు- మహిళామణులు.

01/16/2019 - 23:10

మాయావతి పుట్టింరోజు అంటే అభిమానులూ భక్తులూ ఆమెకి పూలదండలు కాదు- రూపాయల దండలు వేస్తారన్నది లోకోక్తి. దృఢమయిన ఆమె మెడలు విరిగేలాగ కరెన్సీ నోట్ల గజమాలలు ధరిస్తేనే ఆమెకు ఆనందంగా వుంటుంది. ఏనుగు ఆమె పార్టీ ఎన్నికల గుర్తు.

01/10/2019 - 01:38

హమ్మయ్య! డెబ్భై ఒక్క ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ‘ఇండియాను ఇంతకాలం పట్టిపీడించిన గ్రహణం’ విడిపోయింది. కొహ్లీ సేనకు ప్రచండభాను సమాన ఘన విజయం లభించింది. మెల్‌బోర్న్ విజయం ఒక కొత్త రికార్డు, సరికొత్త చరిత్ర! అందుకే ముందస్తుగానే భారత్‌లోని క్రికెట్ ప్రియులంతా కలసి చేసిన విజయోత్సాహ నృత్యహేలని ఇప్పుడు కొనసాగించి కొహ్లీ సేనకి జయభేరి వినిపిస్తున్నాం!

01/03/2019 - 21:57

మూడేళ్లుగా క్రికెట్ క్రీడలో ‘విరాట్ కొహ్లీ బ్యాటింగ్‌దే హవా!’ జయభేరి మోగిస్తూ, తిరుగులేని ‘బ్యాటింగ్ కింగ్’గా మనవాడు నిలిచాడు. అది ‘టెస్ట్ మ్యాచ్’ అయినా ‘వన్ డే’ లేదా ‘ఇరవై-ఇరవై’ పోటీ అయినా అతని బ్యాట్ మెరుపులు మెరిపించింది.

Pages