వీరాజీయం

గుజరాత్.. వాళ్లదేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం.....

సర్దార్ వల్లభభాయ పటేల్ మాత్రమే మన అందరి వాడు. కానీ, మన అందరం మాత్రం ఆయన సొంత రాష్టమ్రైన గుజరాత్‌కి అన్యులం. ఇదండీ - దేశ ఏకత్వానికి భిన్నత్వంగా ఇప్పుడు కనబడుతున్న గుజ రాత్ రాష్ట్ర దృశ్యం. బిహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల నుంచి ఏనాడో పొట్ట చేత బట్టుకుని వచ్చిన కూలీ జనం, బడుగు వర్గాలు - ఇవాళ ప్రాణాలు అరచేత బట్టుకొని తట్టా బుట్టా నెత్తినెట్టుకుని గుజరాత్ నుంచి సొంత రాష్ట్రాలకు- దొరికిన వాహనాలను ఎక్కి పారిపోతున్నారు. ఈ విషయమై మాట్లాడేవారంతా ఇప్పుడు గుజరాత్ నగరాలలో అన్యులు, శత్రువులు . యూపీ, ఎంపీ, బిహార్ కూడా చాల పెద్ద రాష్ట్రాలు కానీ పేద రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి జనం ఉపాధిని వెతుకుంటూ గుజరాత్‌కి ఏనాడో వచ్చి సెటిల్ అయి పోయారు. అక్కడి శ్రామికవాడలు మినీ ఇండియా గోచరిస్తాయ. ఉత్తర భారతానికి వ్యాపారం చెయ్యడాన్ని నేర్పిన వాణిజ్య రాష్ట్రం గుజరాత్. గత రెండు వారాలుగా యాభై వేల మంది పిల్లాపాపలతో సొంత రాష్ట్రాలకు శరణార్థుల్లా చేరుకుంటున్నారు.
ఈ నేపథ్యాన్ని చూస్తే- జరిగిన ఒక సంఘటన దారణమైనదే- కానీ ,ఇంత ఉపద్రవానికి, జాత్యహంకార వైషమ్యానికి, దౌర్జన్య చేష్టలకి దారి తీయగలది మాత్రం కాదు. గుజరాత్‌లో 14 నెలల చిన్నారిపై బిహార్ వలస కార్మికుడొకడు లైంగిక దాడి చేశాడన్న వార్త దావానలంలా చెలరేగింది. ఈ అఘయిత్యానికి కారణంగా పేర్కొనబడ్డ కార్మికుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కాని దారుణానికి గురి అయిన పాప ఠాకూర్ వర్గానికి చెందినదిట. దాంతో కాంగ్రెస్ నాయకుడు అల్పేష్ ఠాకూర్ అధీనంలోని క్షత్రియసేన నాన్- గుజరాతీ కార్మికులపై దాడులు మొదలు పెట్టాయిట. ఈ నేపథ్యంలో చెలరేగుతున్న నిరసనలు, హింసాకాండ వలస కార్మికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. క్షత్రియ ఠాకూర్‌సేన ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్న క్రమంలో గుజ రాతేతరులపై ఎలాంటి దాడులకు పాల్పడటం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ స్పష్టం చేశారు. వలస కార్మికులపై గుజరాత్‌లో మూకదాడులకు తాము ఎన్నడూ పిలుపివ్వలేదని, గుజరాత్‌లో శాంతి కోసం కృషిచేస్తున్నామని క్షత్రియ ఠాకూర్ సేనకు నేతృ త్వం వహిస్తున్న అల్పేష్ వాదన. గుజరాత్ ముఖ్య మంత్రి విజయ్ రూపానీ మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై త్వీట్ల దాడి మొదలుపెట్టాడు.
బిహార్, యూపీ వాసులపై దాడులను ఖండిస్తున్నట్లు బిహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. దీనిపై గుజరాత్ సీఎంను తాను ఫోన్‌లో సంప్రదించానని అల్పేష్ ఠాకూర్ తెలిపారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్నదని- వెంటనే రాహుల్ గాంధీ దీన్ని అరికట్టాలని సీఎం రూపానీ, దానికి ప్రతిగా ఈ దాడులను దేశ భద్రత, ఏకత దృష్ట్యా ముఖ్య మంత్రియే ఆపాలని రాహుల్ త్వీట్లతో కొట్టుకుంటున్నారు . అవతల కార్మికులు లేక రాష్టంలోని పరిశ్రమలు ముఖ్యంగా మందుల కంపెనీలు ఈడిగిల పైపోతున్నాయి. ఠాకూర్ వర్గాలది రాష్ట్రంలో పైచెయ్యి. అల్పేష్ ఠాకూర్ ఈ సంఘటనకు ఒక రకంగా ప్రత్యక్ష సాక్షి. ఆయన ఒక ఇంటర్వ్యూ లో వివరణ ఇస్తూ బాధితురాలైన పాపను తాను ఆదుకొని అహమ్మదాబాద్ ఆసుపత్రికి చేర్చే ఏరాట్లు చేశానని - ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆమె కోసం వెతుక్కుంటూ ఉండగా -వారికి పొలాల వేపునుంచి వస్తున్న ఒక వలస కార్మికుడు దొరికాడని అతని దుస్తులు ఎర్రని మరకలతో ఉన్నట్లు చూసి- జనం అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారని వివరించారు. ఆ చిన్నారి పొలాల్లో రక్తపు మడుగులో దొరికింది. ఆ పాప చనిపోయిందని భావించి అక్కడి జనం ఆ కార్మికునిపై దాడి చేశారు.
కాంగ్రెసు నాయకుడైన అల్పేష్ ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతని గ్రహించి ఆ పాపను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేశాడు. అల్పేష్ అనుయాయులతో పాటు మరి కొందర్నీ పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. ఠాకూర్ వర్గానిక్ చెందినదే ఆ పాప అన్నది కూడా నిర్ధారణ కాలేదని ఈ ఘాతుకం పై విచారించి నేరస్తున్ని గట్టిగా శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశానని అల్పేష్ వాదన. తాము కొవ్వొత్తుల ప్రదర్శన కూడా చేశామే ? దాడులు మేమెందుకు చేస్తాము. గుజరాత్ మీది, మాది అందరిదీ.. ఇందులో తమ పారీని బద్నాం చెయ్యాలన్న కుట్ర ఉందన్నారు కాంగ్రెస్ వారు. గుజరాత్లో స్థానికులకే అధిక కోటా ఉండాలన్న ఆందోళన అల్పేష్ వ ర్గాలు చేస్తున్నాయి. ఈ అవకాశం తీసుకొని ఠాకూర్లు ఈ దాడులు చేస్తున్నారని అంటున్నారు ప్రభుత్వ వర్గాల వారు. ఈ తగాదా ఇలా ఉండగా సోషల్ మీడియా తన వంతు ఆజ్యం అగ్గికి పోసింది. హిందీ మాట్లాడే వాళ్ళంతా ఇరవై నాలుగు గంటలలో గుజరాత్ ఒదిలి పోవాలన్న అల్టి మేటంలతో హోరేత్తిం చేసింది సోషల్ మీడియా. సందట్లో సడేమియాగా బస్సుల వాళుల, ట్యాక్సీల వాళ్లు అదనపు ట్రిప్పులు వేసి సొమ్ములు చేసుకున్నారు.
గుజరాత్ ప్రభుత్వం మొత్తానికి ఇరకాటంలో పడ్డది. కారణం ఈ నెలాఖరుకి - సర్దార్ పటేల్ గారి - అత్యంత ప్రతిష్టాత్మకమయిన -విగ్రహాన్ని ప్రధాని మోదీ నర్మదా డ్యాంకి అభిముఖంగా ఆవిష్కరించ వలసి ఉన్నది. మోదీ హయంలో మూడువేల కోట్ల రూపాయల ఖర్చుతో తయారయిన ఉక్కు మనిషి పటేల్ కంచు విగ్రహం రెడీ గా ఉంది. ఇంతకన్నా ఎత్తయన విగ్రహం ప్రపంచంలోనే లేదు. ఇది ఆవిష్కరింప బడితే- దీని ఎత్తు దిమ్మతో కలిపి ఆరువందల అడుగులు. నాలుగున్నరేళ్లలో మోదీ నాయకత్వం పక్కాగా సాధించిన ఘన విజయం ఇది. ఈ గొప్ప విగ్రహం దేశ ఏకత్వానికి, ఐక్యతకి ప్రతీక అనుకుంటూ ఉంటే - హిందీ వాళ్ళనే లోకల్స్ తన్ని తగిలేస్తుంటే -కథ రసాభాస ఐపోదా? ప్రపంచపటం మీద గొప్పగా నిలిచే ఈ గొప్ప సంఘటన- అభాసు కాగూడదనే బాజాపా వర్గాల కృషి. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలాగోలా శాంతి సామరస్యాలను సమకూర్చాలి.

బ్లేమ్ గేమ్ విల్ స్పోయిల్ ది కోలాస్సల్ ఈవెంట్!

--సెల్: 92900 99512