వీరాజీయం

అందరివాడు అయ్యప్ప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ ‘ఇరుముడిధారుల’ వెంట ఇప్పుడు అసలు ముడి అంటే- కొప్పులున్న మహిళలు కూడా నిరభ్యంతరంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు శబరిమలై మీదున్న బ్రహ్మచారి అయ్యప్పస్వామిని దర్శనం చేసుకుని రావచ్చును. పనె్నండేళ్ల లోపు ఆడ పిల్లలు -యాభై దాటిన ముదితలు మాత్రమే శబరి కొండ ఎక్కడానికి అర్హులు అన్న ఆంక్షని రాజ్యంగ విరుద్ధమని అయిదుగురు జడ్జీలున్న సుప్రీం ధర్మా సనం తీర్పు ఇచ్చింది. కానీ, ధర్మాసనంలోని మహిళా జడ్జి ఇందూ మల్హోత్రా ఇది దర్మబద్ధం కాదని అసమ్మతి తెలుపుతూ సుదీర్ఘమైన తీర్పు పత్రాన్ని జత చేసింది. ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకపోవడమే మంచిదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ‘ఆ మతం లేదా తెగకు చెందిన వారు కోర్టును ఆశ్రయిస్తే తప్ప ఇలాంటి వాటిపై కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదు, మత విశ్వాసాలను కోర్టులు అలవోకగా కొట్టిపారేయడానికి వీల్లేదు’ అని ఆమె అంటూ, పిటిషన్‌దారులలో శబరిమలై మెట్లు ఎక్కదలచినట్టి ఒక్క మహిళ కూడా లేదు అన్నారు. ఈ పిటిషన్‌ని కేరళలోని కొందరు న్యాయ వాదులు 2006లో వేశారు. అది 2016 దాకా సాగి 2016లో సుప్రీంకు చేరింది.
శబరిమల ఆలయ బోర్డు నిబంధనలపై విద్యావంతులైన కేరళ మహిళలు అసంతృప్తిగా లేరని ఇందూ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అయ్యప్పకూ రాజ్యాంగం హక్కులు ఇవ్వాలి కదా? వాటిని ఉల్లంఘించడం భావ్యం కాదని ఆమె అన్నారు. వివిధ మతాల్లో భిన్న ఆచార వ్యవహారాలను పాటిస్తారని కోర్టులు అందులో జోక్యం చేసుకోవడం, మత విశ్వాసాలను ఆర్టికల్ 14తో సరి పోల్చి చూడడం సమంజసం కాదంటారామె. ఇందూ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలంచాలని కేరళలో విద్యావంతులైన మహిళలు భావిస్తున్నారు. కేరళ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు సుప్రీం తీర్పుకు తలవంచాయ. రివ్యూ పిటిషన్‌కు వెళ్లే యోచన అర్చకుల కైతే ఉంది. శబరిమలైకి వచ్చే మహిళలకు సదుపాయాలు కల్పిస్తామని కేరళ సీఎం చెప్పినప్పటికీ, వేరే క్యూలు ఏర్పాటు చేయడానికి చోటు లేదు కనుక మహిళలు సర్దుకోవాలని అన్నారు. అయ్యప్పసాముల సరసన దీక్ష పట్టని స్ర్తీలు పోలేరు కదా? కనుక మహిళలకూ దీక్ష తప్పదని శబరిమలై చాలాసార్లు పోయి వచ్చిన ఒక ‘స్వామి’ అన్నాడు. దేవుడంటే నమ్మకం లేని కమ్యూనిస్టులు కోర్టు తీర్పుని అడ్డం పెట్టుకుని హిందూ సంప్రదాయాలను భ్రషుపట్టించాలని చూస్తున్నారని కేరళ భాజపా అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ‘శివసేనవాళ్లం మేము’ అంటూ కొందరు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు.
‘లేచింది మహిళాలోకం..’ అంటూ అరచుకుంటూ వచ్చినదో టీనేజర్. ‘బామ్మోయ్ .. నేను కూడా శబరిమలైకి రెడీ ’ అన్నాదా టీనేజర్. ‘అమ్మాయ్...! అదేదో పిక్నిక్ యాత్ర అనుకుంటున్నావా? తిరుమలకి వెళ్లి లడ్డూ తెచ్చుకుని రావడం అనుకుంటున్నావా.. పిచ్చిపిల్లా? ‘మాల’ ధరిస్తావా నువవు? నిటారుగా ఉన్న కొండని కాలినడకన మగాళ్లతో సమానమంటూ ఎక్కుతావా? అయితే పద దీక్షకి..’ అన్నది బామ్మ. ‘ఓ దానికేం? బ్లాక్ డ్రెస్ భలే ఇష్టం నాకు’ అన్నది ఇరవైలో పడ్డ భామ. ‘ఓసి హైహీలూ ! నా జీన్ పేంటూ’- అని నవ్వేసి బామ్మ- ‘మగ భక్తులు అంటే అయప్ప స్వాములు , నీ మొబైల్ దాసులు కాదు. కఠోర దీక్షధరిస్తేనే- హరిహర స్వామిని దర్శించే వీలవుతుంది.. నలభై ఒక్క రోజు మండల దీక్ష -ఆనక ఇరుముడి నెత్తిన పెట్టుకు పోవాలి అదీ మగాళ్లతో ‘సమంగా హక్కులతో పోదాం’ అంటే అని చెప్పింది బామ్మ.
భక్తులు కార్తీకమాసం మొదలు మార్గశిర- పుష్య మాసాల దాకా దీక్ష బూనుతారు. మద్యం, మాంసం త్యజించాలి. స్వామి చింతనలో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం, సంయమనం ముఖ్యం. బ్రహ్మచర్యం తప్పదు. తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేసి, నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విబూది దానిమీద పై గంధం బొట్టు, ఆనక పూజలు భజనాది కార్యక్రమాలు... కటికనేల మీద పడక. నోటివెంట అశ్లీల పదాలు రాకూడదు. ఇలా ఒక మండలం (41 రోజులు) సాగాలి గురుస్వామి (ఆరుసార్లు మాల వేసిన సీనియర్ స్వామి) వద్దనుండి ఉపదేశంతో మాలను పొందాలి. శబరిమల దీక్ష, యాత్ర స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తాయి. అయ్యప్ప గుడి సముద్ర మట్టం నుంచి 3,000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులున్న 18 కొండల మధ్య విలసిల్లింది. చలి కాలంలో ప్రారంభమై జనవరితో ముగుస్తాయి పూజలు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. చాలా భయపెడతారు అయ్యప్పసాములు కొత్తవాళ్లని. ఏటా మూడు కోట్ల మంది భక్తులు శివకేశవసంగమ మూర్తిని ప్రాణాలకు తెగించి దర్శిస్తారు. అక్కడకి చివరి మజిలీ- నిటారు కాలి బాటయే... అయిననూ -‘పోయి రావలె’. అన్నదో తృప్తి దేశాయ్.
తృప్తి దేశాయ్ అనగానే జ్ఞాపకం వస్తుంది మనకి- శనిసింగనాపురంలో- శనిదేవత -ఓపెన్ ఎయిర్ దేవాలయం. 2016 లో అక్కడ స్ర్తీల ప్రవేశానికి ఉద్యమం మొదలెట్టింది ఈ కుమారి తృప్తియే. అహ్మద్‌నగర్‌లోని శని దేవాలయానికే కాదు -ఆ వూళ్ళో ఏ ఇంటికీ ‘నో డోర్స్’. కాని సింగనపుర శనిదేవతకి స్ర్తీలు తైలాభిషేకం చేయరాదన్నారు. అఫ్ కోర్సు.. నేడు స్ర్తీలు మాత్రమే అక్కడ శనికి నెత్తిన నూనె పోసి అభిషేకం చేస్తున్నారు. ఈపాటికే ఓ బృందంతో తృప్తి అండ్ పార్టీ చలో శబరిమలై అంటూ బయలు దేరి ఉంటుంది. ఇది విని కాబోయే ఓ అయ్యప్ప సామి -‘మొదట మాలధారణ ఆనక దీక్ష-అప్పుడు రమ్మనండి ఆమెని.. పాన్సీ షో లాగ కాదు అన్నాడు.
కేరళలోనే చాలా పాపులర్ దేవాలయాల్లో - పురుషులకు ‘నో ఎంట్రీ’! అట్టుకాల్ భగవతి టెంపుల్ గిన్నిస్ బుక్ లోకి.. కేవలం స్ర్తీలకు మాత్రమే ప్రవేశం అన్న- నిబంధనతో ఎక్కింది. అక్కడ ఏటా జరిగే పొంగలి నైవేద్యం కార్యక్రమంలో లక్షలాది స్ర్తీలు మాత్రమే పాల్గొంటారు. చక్కులతుక్కవు గుడి అని మరొక అమ్మవారి ఆలయంలో పూజారి మాత్రమే మగాడు. గుడిలోకి వచ్చిన స్ర్తీలందరికి కుల, వర్గ వ్యత్యాసం లేకుండా పాదాలు కడిగి ఆహ్వానిస్తాడు. మరో కేరళగుడిలో- ఏటా పురుషులు చీర ధరించి అమ్మవారిని అర్చించుకుంటారు. రాజస్థాన్‌లోని పుష్కర గ్రామంలో బ్రహ్మదేవుడి గుడిలోకి పెళ్లి చేసుకున్న మగాడు అడుగు పెట్టరాదు. ఉత్తరాదిన ఉన్న ఓ గుడిలో అమ్మవారిని ఏడాదికోసారి- ‘బహిష్టులో ఉన్న’ ఆడవాళ్లే దర్శనం చేసుకోవాలి. అక్కడికి మగాళ్లు వెళ్తే తంతారు. ఇలాంటి దేవాలయాల్లో ప్రవేశానికి మాకు కూడా హక్కు కావాలి అని పురుషులు ఆందోళనకి దిగినా, కోర్టు కెక్కినా- సబబేనా?
డోంట్ బీ సర్‌ప్రైజ్డ్... ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా..!

92900 99512