S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరాజీయం

05/10/2018 - 01:01

దళితుల ఇంట భోజనమా? దళితుల ఆతిథ్యమా? ఏది నిజం?- ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా లోహగఢ్‌లో ఈ మధ్య ఒక చిత్రం జరి గింది. భాజపా మంత్రి సురేష్‌రాణా గారి అనుచరులు-ఒక దళి తుడి ఇంటికి పోయి టకటక తలుపులు కొట్టారుట. కళ్లు నులుము కుంటూ ఆ ఇంటి- నిరుపేద ఆసామీ తలుపు తెరిచేసరికి ఎదురుగా మంత్రి గారి అనుచరులు ప్రత్యక్ష మయ్యారు. ‘మాసారూ, మీ ఇంట్లో భోజనం చేస్త్తారు తక్షణం ఏర్పాట్లు కానివ్వమన్నారు’ట..

05/02/2018 - 23:57

త్రిపుర ఎంత చిన్న రాష్టమ్రైతేనేమి? పాతికేళ్ల వామపక్ష పరిపాలనకి చెల్లు చీటీ రాసేసింది. ఒక సునామీ లాగా కాంగ్రెస్సు పార్టీని మింగేసి లోగడ ఢిల్లీలో గద్దెనెక్కినంత సంబర పడిపోయింది మరోసారి కమలం పార్టీ. అతి పెద్ద రాష్ట్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసినంత ఆర్భాటంగా త్రిపురలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది మోదీ గారి కాషాయ సేన.

04/25/2018 - 23:31

‘దొంగాడా ? కరవకుమా?’ అన్న సామెత చందాన- కొంతమంది భాజపా ప్రబుద్ధులు వ్యాఖ్యానాలు చెయ్యడం ఇటీవల పరిపాటైందని మనం అనడం కాదు.. సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే అన్నాడు . అసలు ఆ సామెత ఏమిటో ముందు చూద్దాం. వెనుకటికి ఓ ఇంట్లో దొంగ పడ్డాడు.. ఇల్లాలు మొత్తం నగలన్నీ ధరించి పడుకొని ఉంది.. అరిస్తే దొంగాడు తన పీక నొ క్కు తాడెమో నన్న భయం తో -గప్చిప్ గా ఆమె ఉంది.

04/18/2018 - 23:38

సర్దుకుపోతే చాలు అమ్మాయిలూ.. మార్కులూ మీవే - ప్లస్ డబ్బులూ మీకే వస్తాయి’- అని మూడో కంటికి తెలియకుండా చెప్పింది లెక్కల ప్రొఫ్ఫెసరమ్మ నిర్మలాదేవి (46). విద్యార్ధినులు ప్రాయంలో ఉన్న పిల్లలు- ప్రస్తుత ఇంటర్నెట్ కాలంలో అడ్జస్ట్మెంట్ అంటే అర్థం చేసుకోలేరా? అందుకే నిర్మలాదేవి చెప్పిన ఇరవై నిమిషాల హితబోధల్ని రికార్డు చేసు కున్నారు. కాకపొతే లెక్కల ప్రొఫెసర్‌కీ సంగతి తెలియదు.

04/11/2018 - 23:40

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలొచ్చేశాయ్. ‘నెలగంట’ పెట్టి వారం దాటింది. భాజపా అధ్యక్షుడు అమిత్ షా హుబ్లీలో ప్రచారాన్ని మొదలెట్టి యడ్యూరప్పని గద్దెమీద కూర్చోబెట్టటానికి ఉపవాసదీక్ష చేసి మరీ ప్రొసీడ్ అయిపోతున్నాడు. 72 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది భాజపా అప్పుడే. కర్నాటక ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలకి జోస్యం చెప్పే అసలు సిసలు ‘ప్రివ్యూ’ అంటున్నారు పొలిటికల్ పండిట్స్.

04/04/2018 - 23:32

రంగేళీ రంగంలోకి దూకడానికి అవతల ఐపిఎల్ వీరులు బ్యాటూ బాలూ పట్టుకుని ఉరికిస్తూ ఉండగా -నువ్వేమిటి? అసుర సంధ్యవేళ -ఇంట్లో ర్యాకట్ ఝళిపిస్తూ గెంతుతున్నావ్? పైగా- ‘కిల్.. కిల్..’ అంటూ ఈ గెంతులేమిటి? నేవ్వేమయినా సింధూవా? సానియావా? ..
-రెండూ కాను... నీ ఇల్లాలిని నేను, ఇంటావిడను నేనూ... అంటూ.. ఎలక్ట్రిక్ రాకెట్తో ఒక్కటి ఇచ్చుకుంది భామామణి. అఫ్కోర్స్.. దోమని అనుకోండి.

03/29/2018 - 02:03

ప్రత్యర్థి జట్టుని సతాయించి గెలుపు సాధించాలనే కుళ్ళు బుద్ధి క్రికెట్ ఆడే దేశాలన్నింటికీ కొద్దో గొప్పో వుంటుంది. కాని మరీ ఇంతలా కాదు. ‘కంగారూలు’ అనవసరంగా కంగారుపడ్డారు. కేప్ టౌన్‌లో వాళ్ళ పాపం బద్దలైంది. కెమరా కంటికి అడ్డంగా దొరికిపోయారు. క్రీడాప్రపంచం యావత్తు ముక్కున వేలేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సైతం తమ దేశానికి తలవంపులు తెచ్చిన ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోయాడు. ‘మీ దుంపలు తెగ..

03/22/2018 - 01:47

గో రఖ్‌పూర్, ఫూల్పుర్ ఉపఎన్నికల ఫలితాలు ఎట్లా వున్నాయి భారుూ? అంటే- ‘కళ్లు మూసి జెల్లకొట్టినట్లు’ వున్నాయ్ అన్నాడో సామాన్యుడు. ‘ముప్ఫై ఏండ్లుగా ముట్టుకుంటే షాక్ కొడుతుంది ప్రత్యర్థులకి? అనుకున్న యోగీజీ కంచుకోట-గాలికోట అయిపోయింది- అదిత్యనాథ్ ఆశ్రమం వేపు అలా వెళ్ళిన జర్నలిస్టులకి అంతా శూన్యంగా కనబడ్డది. 1975 నాటి మనోజ్‌కుమార్ హేమమాలిని సినిమా ‘సన్యాసి’లోని ‘‘చల్..

03/14/2018 - 23:56

‘బతికున్నవాడికి సెంటర్‌లో దిమ్మ కట్టి దాని మీద బొమ్మ పెట్టకండిరా..’ అని అంటారు డఖ్ఖామొక్కీలు తిన్న పెద్దమనుషులు. అస్మదీయ జనాలకి సంతోషం వచ్చినా, తస్మదీయ మూకలకు ఆగ్రహం వచ్చినా పట్టలేరు. సంతోషం కలిగితే విగ్రహాల నెత్తిన డబ్బాలకు డబ్బాలు పాలు పోస్తారు. నిచ్చెనలు వేసుకుని ఎక్కిమరీ పూలమాలలతో ముంచెత్తుతారు. కానీ, ఆగ్రహం వస్తేనే ఇబ్బంది. విగ్రహాలను ఖండ ఖండాలుగా కోసి కాలవలో పారేస్తారు.

03/08/2018 - 03:56

రోజురోజుకీ మరింత ఎండ.. ఈ సమ్మర్ ‘డింగ్ డాంగ్ హెల్’.. గత ఆదివారమే మచ్చు చూపెట్టింది విరోధకృతి తన వికారాకృతి. ఈ ఏడాది ఎండలు మెండుగా కాయును.. అని మన వాతావరణ పరిశోధన సంస్థ అనగా ఇండియన్ మెటిరియలాజికల్ డిపార్టుమెంటు చెప్పేసింది. దానికి తగ్గట్టు గత ఆదివారమే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఐ మీన్- ఇండియాలో పాదరసం నలభై డిగ్రీలకి నిచ్చెన ఎక్కేసింది.

Pages