వీరాజీయం

రామా! అయ్యో(ధ్య) రామా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై ఏళ్లుగా జనం మెడ మీద రాచపుండులా సతాయిస్తూ - (కొన)సాగుతూవున్న ‘అయ్యోధ్య పేచీ’- సయోధ్య మార్గం పట్టడానికి అనువుగా 2010లో అలహాబాదు హైకోర్టు ‘మూడు ముక్కలు’ చేస్తూ తీర్పు చెప్పింది. ఇది ఎందరికో ఊరట కలిగించింది గానీ, ఆ తీర్పుమీద సుప్రీం కోర్టులో 14 అప్పీళ్లు పడ్డాయి. నాడు అలహాబాదు హైకోర్టు తీర్పు ఏమి చెప్పిందంటే- పేచీలో వున్న 2.77 ఎకరాల భూమిని కక్షిదారులైన మూడు ‘పార్టీ’లకి పంపిణీ చెయ్యాలంటూ వివాదగ్రస్త రామజన్మభూమిని మూడు ముక్కలు చేసింది.
ఇలా చెయ్యడానికి కారణాలు వివరిస్తూ- 8,189 పేజీల సుదీర్ఘమైన వివరణ ఇస్తూ తీర్పు చెప్పింది. ‘వామ్మో! అన్ని పేజీలా? ఎవడు చదవగలడు బాబూ?’ అన్నాడో సామాన్యుడు. నువ్వు చదవకు గానీ, చదవాల్సిన మూడు పార్టీల లాయర్లు చదివారు. కానీ, కథ అంతటితో- రామలల్లా జన్మభూమికి చేరుకోలేదు. ‘అప్పీల్’ అంటూ వివాదం సుప్రీం కోర్టుకెక్కింది. అయితే, విచారణ రంగంలోకి ఇంతవరకూ దిగలేదు.
ఇది ఎప్పటి సంగతి..!? 2010, సెప్టెంబర్ 30న అలహాబాదు హైకోర్టు- లక్నో ధర్మాసనం వివాదగ్రస్త స్థలం ఇకపై ‘పేచీ భూమి’ కాదు.. అది రామజన్మభూమి స్థలమేనంటూ తీర్పు ప్రకటించింది. కానీ- ‘‘రామా! రామా! (అ)య్యోధ్య రామా!’’ అని భక్తులు వాపోయేలాగా సుప్రీం కోర్టు 2011 మే 9న ‘స్టే’ అంటూ ఒక్క దెబ్బతో అలహాబాదు కోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును నిలువరించింది. పైగా, ‘మేం మళ్లీ తీర్పు చెప్పేదాకా, అలహాబాదు హైకోర్టువారు యిచ్చిన ‘మూడు ముక్కలు’ తీర్పు అమలుకారాదు- 1993 జనవరి 7నాడు- ఈ జాగా ఎలా వున్నదో, అక్కడే, అలాగే ‘‘అక్కడ వేసిన గొంగళీ అక్కడే’’నన్నట్లుగా ఉండాలి’’అంటూ ‘హుకుం’ జారీ చేసింది. అది ‘అంతే సంగతులు’గా కొనసాగుతోంది.
అలా వుండగా- వున్నాడుగా, మన సుబ్రహ్మణ్యస్వామి ‘అవర్ ఘల్’- ఆయనగారు న్యాయశాస్త్ర కోవిదుడు. కొన్ని సందర్భాలలో నారదుడే గానీ- రామమందిరం వివాదంలో చిత్తశుద్ధితో- ‘‘దీన్ని సత్వరం పరిష్కరించండి, మహాప్రభో!’’అంటూ అప్పీలు చేశాడు. కదలిక వచ్చింది కేసుకి. కానీ, అది మళ్లీ రుూడిగిల పడిపోయింది!
ఎట్టకేలకు సుప్రీం కోర్టు ధర్మాసనం మొన్న ఇరవై తొమ్మిది నుంచీ- ‘విచారణ’ మొదలెడుతుంది అన్న ప్రకటన రామభక్తులకి, అల్లా భక్తులకీ- తటస్థులకీ ఒక ఓదార్పునిచ్చింది. కానీ, అత్యున్నత న్యాయస్థానం కేసుని కొన్ని నిముషాలతోనే- ‘‘వాయిదా వేస్తున్నాం’’ అంటూ సుత్తిపెట్టి బల్లగుద్దింది. ‘మాకు యింతకన్నా ముఖ్యం అయిన కేసులున్నాయి’-అని కూడా వ్యాఖ్యానించింది. ‘‘అమ్మయ్య! రేపటి ఎన్నికలలో మా మోదీజీకి - ‘రామ్‌లల్లా - దేవాలయం’, కట్టే సమస్యే ఏకుమేకయి కూర్చోదు’’- అన్నాడో మోదీ భక్తుడు- ఉస్మానియా యూనివర్సిటీ ‘లా’ కాలేజీ ముందు విశ్రాంతిగా చతికిలబడుతూ. ఒక మార్నింగ్ వాకర్-ఐతే, అతను అనుకున్నది ‘తప్పు’అని తెల్లారేపాటికే రుజూ అయిపోయింది.
భాజపా వర్గాలు, శివసేన వర్గాలు, సంఘ్ పరివార్ సభ్యులు- అంతా ఒక్క మాటగా- ‘‘ఎన్నాళ్లీ విచారణ? తీర్పు వచ్చేసరికి మేమెవ్వరం వుండం, పాపం! రామలల్లాకి గుడి కూడా వుండదు’’- అంటూ, ప్రత్యక్షంగా, ‘తిరుగుబాటు’ ప్రకటించారు. ‘‘ఒక ఆర్డినెన్స్ తీసుకురండి’’ అంటూ ఎలుగెత్తి చాటారు. అంతేనా? భాజపా పెద్దలు, యు.పి. ముఖ్యమంత్రి యోగి పుంగవుడు- ఆదిత్యనాధ్ సహా సణుగుడు మొదలుపెట్టారు. ‘‘అమలు చెయ్యగల తీర్పులు యిస్తే బాగుంటుంది సార్!’’అంటూ సుప్రీం కోర్టుకి అప్పీల్ రూపంలో ప్రొటెస్టులు కూడా చేశారు.
శబరిమల గుడి మీద తీర్పు అత్యవసరంగా యివ్వగలిగిన సుప్రీం కోర్టు- రామజన్మభూమి వివాదం మీద ఎందుకు తొందరగా యివ్వలేదు?’’ అంటూ చాలామంది గొణిగారు. కానీ, వాళ్లంతా సామాన్యులు. రాజ్యాంగం, సుప్రీం కోర్టు పవర్స్, సెక్యులర్‌రిజమ్- లాంటి జటిలమైన అంశాలను అర్థం చేసుకోలేదు. లేరు కూడా...
ఎందుకయినా మంచిది. నాడు అలహాబాద్ హైకోర్టు యిచ్చిన ‘మూడు ముక్కల తీర్పు’ని వోసారి జ్ఞాపకం చేసుకుందాం- ‘‘అక్కడ వివాదస్థలం రాముడిదే! అక్కడి నుంచి రామ్‌లల్లాని కదపటానికి వీల్లేదు’’-అంటూ న్యాయమూర్తులు ముగ్గురూ తీర్పులో పేర్కొన్నారు. ఆ త్రిమూర్తుల పేర్లు- ఎస్.యూఖాన్, సుధీర్ అగర్వాల్ మరియు డి.వి.శర్మ. ఇందులో మొదటి యిద్దరూ ఒక జట్టుగా తీర్పునిచ్చారు. మూడో ఆయన - ‘‘బాబర్ కట్టించిన మసీదు ముస్లిం ధర్మసూత్రాలకి అనుగుణంగా లేదు’’- అన్నాడు-
ఏది ఏమయితేనేం? జాగాని మూడుముక్కలుగా విభజించారు. హిందువులకి యిప్పుడున్న రామమందిరం ముక్కని కేటాయించారు. ముస్లింలకి ‘ఒక ముక్క’- మిగతా ముక్కని- ‘నిర్మోహీ అఖాడా’కి అప్పజెప్పమన్నారు. ‘‘హాయిగా, రుూ మూడు ముక్కలతో, సమైక్యతా నిర్మాణం సాగనివ్వండి’’-అని భరతవాక్యం పలికిందా కోర్టు ఆనాడు. కానీ అలా జరగలేదు. సుప్రీంలో ‘అయోధ్య’ నానుతోంది. నిర్మాణానికి అత్యవసర ఉత్తర్వులు జారీ చెయ్యమని సంఘ పరివార్, ముఖ్యంగా- విశ్వహిందూ పరిషత్’ హోరెత్తిస్తోంది. హైదరాబాదు నుంచి ‘జనాబ్ ఓవైసీ’ కూడా ‘‘దమ్ముంటే ఆర్డినెన్స్ జారీచెయ్యండి’’- అంటూ సవాల్ విసురుతున్నాడు.
ఐతే, ఎన్నికలలో ఒకసారి ‘‘రామ్‌లల్లా గుడి’’ని జెండా పైన పెట్టుకున్నారు- భాజపావారు. అద్వానీగారు- ‘రామ్ రథమే’ఎక్కారు. కానీ, అజెండా లేని జెండాగా దాన్ని సామాన్య జనం భావించారు. దేనికయినా ప్రణాళిక అవసరం. సంఘ్ పరివార్‌లో మోదీజీ కూడా ఒక సభ్యుడే సుమా! ఆ సంగతి మర్చిపోకూడదు. కాబట్టి అందరూ కలిసి కూర్చుని- కలిసిమెలిసి ఆలోచించి, ఆలోచించి, ఆచి తూచి, ఎన్నికల రంగంలో రుూ అయోధ్య సమస్య- అయ్యో(్ధ్య) సమస్యగా- రగడ కాకుండా చూసుకోవాలి.
‘‘ఐదేళ్లుగా రామ్‌లల్లాకి మీరేమి చేశారు?’’అన్న ప్రశ్నకి కేంద్రం 2019 మొదట్లోనే జవాబు చెప్పాల్సింది వుంటుంది-
బెటర్ థింక్ ట్వయిస్ బిఫోర్ యు టాక్!
*

-- వీరాజీయం.... సెల్: 92900 99512