S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

10/04/2019 - 02:07

‘‘ఇఫ్పుడు ఎన్నికలు జరిగి ఉంటే తడాఖా తెలిసేది?’’
‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాతనా? ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమో? ఆ మధ్య ఓ జాతీయ మీడియా సర్వే జరిపి ప్రధాని మోదీ ఇమేజ్ పెరిగిందని, ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత సర్వే చేసి ఉంటే మోదీ గ్రాఫ్ ఇంకా పెరిగేదని చెప్పారు.’’

09/27/2019 - 04:22

‘‘కడుపు రగిలిపోతోంది..’’
‘‘నీ కొత్త కవితా సంకలనం పేరా? బాగుందోయ్ టైటిల్. నువ్వు నిజంగా గ్రేట్.. గతవారమే ఓ కవితా సంకలనం విడుదల చేశావ్. ఆ అప్పు ఇంకా తీరకముందే మరో కవిత సంకలనానికి టైటిల్ రెడీ చేశావంటే నువ్వు గ్రేట్..’’
‘‘చెప్పుకుంటూ పోవడమేనా? నా మాట వినవా? ఇదేమన్నా కవితా పఠనం అనుకున్నావా? ఎదుటివాళ్లు వింటున్నారా? లేదా? అని కూడా చూడకుండా చెబుతూనే ఉన్నావు’’

09/20/2019 - 01:46

‘‘ఈ రోజుల్లో మంచికి స్థానం లేదు..’’
‘‘ఈ టైటిల్‌తో మూడు దశాబ్దాల క్రితమే సినిమా వచ్చింది. సరిత మొదటి సినిమా అది. అయితే విడుదలైన మొదటి రోజు రెండో ఆటకే సినిమా ఎత్తేశారు. ఆమె కూడా ఈ సినిమా పేరు చెప్పదు. మరోచరిత్రనే తన మొదటి సినిమా అంటుంది. టైటల్ బాగానే ఉంది కానీ.. కథ లేక నడవలేదు. ఇంకో టైటిల్ ఏదైనా వెతుక్కో..’’

09/13/2019 - 03:49

‘‘ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు..’’
‘‘ఏమైంది..?’’
‘‘సులభ్ కాంప్లెక్స్‌లో టాయ్‌లెట్‌కు పది రూపాయలు తీసుకున్నాడు. ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? ప్రజలకు బతికే హక్కు లేదా? టాయ్‌లెట్‌కు వెళ్లకుండా ప్రజలు అలానే పైకి పోవాలని కుట్ర పన్నుతున్నారా? ’’

09/06/2019 - 21:47

‘‘చెప్పినా వినకుండా... సర్వనాశనం చేస్తున్నారు...’’
‘‘ఏం జరిగిందోయ్...?’’
‘‘మన జీడీపీ ఎంతో తెలుసా? టాటా కార్ల ఫ్యాక్టరీలను రెండు రోజులు మూసేశారన్న సంగతైనా తెలుసా? పార్లే-జీ బిస్కట్లు తింటున్నావా? ఆ ఫాక్టరీలో పదివేల మంది ఉద్యోగులను తొలగించారన్నది తెలుసా?’’

08/30/2019 - 02:01

‘‘మనిషన్నాక అనేక పనులుంటాయి. ఏం మీకుండవా? వారం రోజులు సెలవు పెడితే ఇక అంతేనా? ప్రపంచంలో ఎవరూ సెలవు పెట్టరా? ఏం నువ్వు సెలవు పెట్టవా? అంతెందుకు ట్రంప్ భార్యాపిల్లలతో విహారానికి వెళ్లడా? మోదీ మొన్న వెళ్లలేదా? అతనెవరో చానల్ అతనితో కలిసి అడవుల్లో తిరగలేదా? మీ అందరూ సెలవు పెడతారు. నేనెందుకు సెలవు పెట్టోద్దు’’

08/23/2019 - 02:04

‘‘ఈ లోకంలో అధికారం ఉన్నవాడు చెబితే రైట్, అధికారం పోయినవాడు చెబితే నవ్వులాటగా ఉంటుంది’’
‘‘ఏమైంది? ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఎవరు నవ్వారు?’’
‘‘నాకేమైనా అధికారం ఉందా? ఇప్పుడు పోవడానికి. నా గురించి కాదు. నేనెప్పుడూ నా గురించి ఆలోచించను. లోకం తీరు గురించి ఆలోచిస్తాను’’

08/16/2019 - 02:04

‘‘ఇంకెందుకోయ్ అంత దిగులు? మనం చిన్నప్పటి నుంచి జోకులేసుకునే వాళ్లం. కశ్మీర్ సమస్య, తెలంగాణ సమస్యకు ముగింపు ఉం టుందా? ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా? అని. దీనిపై సినిమాల్లోనూ డైలాగులున్నాయి. 2014లో తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరికింది, మరో ఐదేళ్లకు కశ్మీర్‌కు ఏదో ఒక పరిష్కారం అయితే చూపారు. ఇది లాభమా? నష్టమా? అన్నది కాలమే చెబుతుంది. ఇంకా నీలాంటివాడు దీర్ఘంగా ఆలోచించాల్సిన సమస్య ఏముంది?

08/08/2019 - 22:39

‘‘ఊరందరిదీ ఒకదారి ఐతే ఉలికి పిట్టది ఇంకోదారిలా.. సందట్లో సడేమియాలా..’’
‘‘దేని గురించి.. ?’’
‘‘దేశమంతా కశ్మీర్ గురించి ఆలోచిస్తుంటే వర్మ మాత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రయల్ శుక్రవారం రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. పైగా మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ సినిమానట’’
‘‘నాకు కేతిగాడు గుర్తుకొస్తున్నాడురా!’’

08/02/2019 - 01:58

‘‘ముఖంలో అంత వైరాగ్యం ఎందుకు?’’
‘‘చిత్రంగా ఉందే? మాటల్లో వైరాగ్యం కనిపిస్తుంది కానీ, ముఖంలో ఎక్కడైనా వైరాగ్యం కనిపిస్తుందా? ముఖంలో కనిపించేది దిగులు. వైరాగ్యం కాదు. ’’
‘‘భాషలో ఏముంది? భావం ముఖ్యం. నేనేం అడగాలనుకున్నానో నీకు అర్థం అయింది. అది చాలు. దిగులైతేనేం, వైరాగ్యమైతేనేం.. నువ్వు ఏదో ఆలోచిస్తూ దిగులుపడుతున్నావనేది మాత్రం నిజం’’

Pages