S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనాంతికం - బుద్దా మురళి

06/14/2019 - 01:49

‘‘జై శ్రీరాం! రావోయ్ రా!మనకు కొత్తేమో కానీ ఉత్తరాది వాళ్లు ఎక్కువగా ఇలానే పలకరించుకుంటారు...’’
‘‘సెల్‌ఫోన్లు లేని కాలంలో జై శ్రీరాం అంటూ కాగితం పైన రాసిన తరువాతనే ఉత్తరం రాసేవారు. షాపుల్లో ఖాతాలైనా, పరీక్షల్లో విద్యార్థులైనా జై శ్రీరాం అని రాసిన తరువాతనే మిగతా విషయాలు రాసేవారు. ఇప్పుడా ఉత్తరాలు లేవు, ఆ రాతలు లేవు. స్మార్ట్ఫోన్ అన్నింటినీ మింగేసింది.’’

06/07/2019 - 01:42

‘‘దావూద్ ఇబ్రహీం ఇప్పుడేం చేస్తున్నాడంటావ్?’’
‘‘ఏంటోయ్.. నీకు సడన్‌గా అతనిపైకి మనసు పోయింది?’’
‘‘టీవీలో వార్తలు వింటుంటే సడన్‌గా ఎందుకో గుర్తుకువచ్చాడు. పాపం.. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో??’’

05/24/2019 - 02:31

‘‘మనం అనుకుంటాం కానీ, కాలం ఎలాంటి వారినైనా మార్చేస్తుంది. గిరిబాబునైనా, మోహన్‌బాబునైనా మార్చేస్తుంది’’
‘‘ఎలా?’’

05/17/2019 - 02:26

‘‘ఏరా.. మీవాడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడట కదా? ఎందుకలా?’’
‘‘వాడు ఇంట్లోనే ఉన్నాడు.. పిలుస్తాను.. నువ్వే అడుగు వాణ్ణి’’
‘‘ఏంటో చెప్పండంకుల్..’’
‘‘పరీక్షల్లో ఫెయిల్ అయ్యావట! ఏంటీ కథ?’’

05/10/2019 - 01:30

‘‘ఎన్నికల ఫలితాల కోసం ఇంకో రెండు వారాలు వేచి చూడాల్సిందే, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తాడా? లేక మరో దేవెగౌడ పుట్టుకొస్తాడా? ఈసారి ఉత్తరాది ప్రధానా? దక్షణాది ప్రధానా? ఏది తేలాలన్నా ఈనెల 23వరకూ ఆగాల్సిందే. ప్రధానమంత్రి పదవి నాకు వద్దంటే వద్దు, నేను రేస్‌లో లేను అని ఎంతమంది ప్రకటించినా, ఆ పదవిని ఎవరో ఒకరు స్వీకరిస్తారులే! నువ్వంతగా దిగులు పడాల్సిన అవసరం లేదు.

05/03/2019 - 01:37

‘‘హలో.. నేను సుబ్బారావునే మాట్లాడుతున్నా... ఏంటో తొందరగా చెప్పండి’’
‘‘మీరా సార్..! మీరింత సింపుల్‌గా ఉంటారని ఊహించలేదు. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే మీ గొంతు వంద ఘంటసాలల గొంతులా గంభీరంగా ఉంటుందనుకున్నా. కుటుంబరావుల గొంతులా ఇంత సింపుల్‌గా ఉంటుందని అస్సలు ఊహించలేదు సార్!’’

04/26/2019 - 01:56

‘‘ఛ..ఛ.. ఈ మనుషులకు ఎప్పుడూ బుద్ధి లేదు.. ఇదేం దేశం? ఇలాగేనా పాలించేది? అమెరికాను దాటి పోవలసిన మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడం అంటే తప్పెవరిది? ఇంకెంత కాలం నెహ్రూ విధానాలు, ఇందిర గాంధీ స్టైల్? ఇప్పటికైనా మారాలి.. లేదంటే ప్రపంచం ముందుకు వెళుతుంది, మనం వెనక్కి వెళతాం. చంద్రమండలాన్ని స్వాధీనం చేసుకుని సూర్యలోకంపై జెండా పాతితే ప్రపంచంలో మనకు ఎదురే లేదు’’

04/19/2019 - 02:03

‘‘వచ్చేనెల నా కథల సంపుటి విడుదల, నువ్వు తప్పకుండా రావాలి?’’
‘‘అదేంటోయ్.. నువ్వు కథలు చెబుతావని అందరికీ తెలుసు కానీ కథలు రాస్తావని తెలియదు’’
‘‘నేను కథలు రాశానని ఎప్పుడు చెప్పాను? మా ఆవిడ రాసింది. ఈ విషయం నాకు వారం క్రితమే తెలిసింది’’
‘‘మరి.. నా కథల పుస్తకం విడుదల అన్నావు?’’
‘‘ఔను- నా కథలే’’
‘‘మీ ఆవిడ రాసిందన్నావు?’’
‘‘ఔను మా ఆవిడే రాసింది’’

04/12/2019 - 04:46

‘‘ఏమండీ.. మూర్తిగారూ.. రాజకీయాలు చాలా హాట్‌హాట్‌గా ఉన్నట్టున్నాయి?’’
‘‘ఔనండీ.. ఎవరు గెలుస్తారో అర్థం కావడం లేదు. మీడియానేమో పార్టీలకు అనుబంధంగా మారింది. ఏ సామాజిక వర్గం మీడియా ఆ సామాజిక వర్గం వారిదే విజయం అని బాకా ఊదుతోంది. దేన్ని నమ్మాలో అర్థం కావడం లేదు. రావుగారూ.. మీరు చెప్పండి.. ఎవరు గెలుస్తారు?’’
‘‘మూర్తిగారూ.. మీతో దాపరికం ఏముంటుంది? నేను తటస్తుణ్ణి’’

04/05/2019 - 01:39

‘‘మనుషుల్లో క్రూరత్వం రోజురోజుకూ పెరిగిపోతోంది రావుగారూ’’
‘‘ఔనండీ! ఇంతకూ దేనిగురించి?’’
‘‘చూడండి పాపం.. సార్వభౌమాధికారం అని పలకలేని పసిగుడ్డును పట్టుకుని ఎనే్నసి మాటలంటున్నారు? మంగళగిరి అని చెప్పలేక, గుంటూరును గుంత్రు అని ఏదో నెట్టుకొస్తున్న యువరాజును పట్టుకుని..’’
‘‘ఆ.. పట్టుకుని...’’

Pages