జనాంతికం - బుద్దా మురళి

ఇంటింటి నీతికథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏంటీ.. ఇన్ఫోసిస్‌లో ఏదో గోల్‌మాల్ అట..!’’
‘‘ఇన్ఫోసిస్‌లో గోల్‌మాల్ లేదు కానీ.. అలాంటి వార్తలు రావడం వెనుక ఏదో గోల్‌మాల్ ఉందనిపిస్తోంది. రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు కూడా ఇదే అనుమానం వచ్చింది..’’
‘‘అస్సలు అర్థం కాలేదు. ఆ ఝున్‌ఝున్‌వాలా ఎవరో అస్సలే తెలియదు’’
‘‘ఝున్‌ఝున్ వాలా స్టాక్ మార్కెట్‌లో సూపర్ స్టార్‌లే! మార్కెట్ ఆయన కనుసన్నల్లో నడుస్తుందని అంటారు. అయన కనుసన్నల్లో నడవకపోయినా, స్టాక్ మార్కెట్ అడుగులను ఆయన ముందే పసిగడతాడని నా అంచనా’’
‘‘పానకంలో పుడకలా మధ్యలో ఆయన సంగతి ఎందుకులే.. కానీ విలువలకు జీవం పోస్తే నారాయణమూర్తిలా ఉంటాడనిపిస్తోంది. అలాంటి మూర్తి కంపెనీలో గోల్‌మాల్...?’’
‘‘అక్కడ ఎలాంటి గోల్‌మాల్ జరగలేదని తేలింది కదా? ఆ షేర్ల విలువను పడగొట్టేందుకు ఈ పుకారు లేవదీసి ఉంటారని ఝున్‌ఝున్‌వాలాకు వచ్చిన అనుమానమే నాకూ వచ్చింది.’’
‘‘అలానే అంటారు. మనం ఎంతో గొప్పగా చెప్పుకున్న సత్యం కంపెనీ సంగతి ఏమైంది?’’
‘‘నీ అనుమానం నీ ఇష్టం.. కానీ పుకారు ఫలించి ఒక్క రోజే మార్కెట్‌లో ఇన్ఫోసిస్ షేర్ విలువ 15 శాతం పడిపోయింది. రెండు రోజుల్లోనే మరలా పుంజుకుంది.’’
‘‘నువ్వెన్నయినా చెప్పు. మనలాంటి వాళ్లం నీతి నిజాయితీ అని పడిచస్తాం.. కానీ పెద్ద పెద్ద వాళ్లు అంతా రెండేసి లెక్కల బుక్కులు మెయింటెన్ చేస్తారు తెలుసా?’’
‘‘అందులో నుంచి నిన్ను, నన్ను మినహాయించావెందుకు?’’
‘‘అంటే?’’
‘‘అంటే ప్రతి ఒక్కరికీ రెండేసి ఉంటాయని నా సిద్ధాంతం. అంటే రెండు లెక్కల బుక్కులు ఉంటాయి. రెండేసి ముఖాలు ఉంటాయి. మనం కనిపించేది ఒకటి, లోపల మరి ఒకటి’’
‘‘నేను నమ్మను. నువ్వు అలాంటి వాడివేమో కానీ.. నేను కాదు..మా బంధువులు కూడా కాదు. ఇంకా మాట్లాడితే మా కులం వాళ్లు కూడా కాదు.’’
‘‘ఓ చిన్నకథ గుర్తుకు వస్తుంది చెప్పనా? ’’
‘‘వద్దన్నా ఊరుకోవు కదా? చెప్పు?’’
‘‘అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో కొందరు తెలివైన వారికి- తాము అందరి కన్నా తెలివైన వారమని, నిజాయితీ పరులమని, తమవి విలువలతో కూడిన జీవితాలనే నమ్మకం. తమ గొప్పతనం ప్రపంచానికి తెలియాలి అనుకుని దేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశారు.’’
‘‘దేవుడు ప్రత్యక్షమై మీకే వరం కావాలో కోరుకో అన్నాడు- అంతే కదా?’’
‘‘ఔను- వరాలు కోరుకో అన్నాడు దేవుడు. అంతవరకే నీకు తెలుసు. వారేం వరం కోరుకున్నారో నీకు తెలియదు’’
‘‘తెలియదు చెప్పు?’’
‘‘తమ నిజాయితీ ప్రపంచానికి తెలియాలి అంటే అవినీతి పరులు ఎవరో తెలియాలి కదా? అందుకే తమ రాజ్యంలో నిజాయితీ పరులు మాత్రమే మిగలాలి అని వరం కోరుకున్నారు.’’
‘‘లంచం తీసుకోవడమే కాదు. ఇవ్వడం కూడా అవినీతే కదా?’’
‘‘ఔను.. కొత్తగా చట్టం చేశారు.’’
‘‘చట్టాలు పుట్టక ముందే నైతికంగా లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం తప్పే?’’
‘‘అది సరే- ఏమైందో చెప్పు?’’
‘‘తథాస్తు అని దేవుడు వరం ప్రసాదించిన తరువాత ఆ రాజ్యంలో ఒక్కరు కూడా బతికి లేరు. ఎందుకంటే మనుషుల్లో లంచం ఇచ్చిన వారు, పుచ్చుకున్న వారు అనే రెండు వర్గాలు మాత్రమే ఉంటాయి కదా? ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ రెండింటిలో ఏదో ఒక దానికి చెందుతారు కదా?’’
‘‘అక్కడెవరో మహిళా అధికారిపై పెట్రోల్ పోసి చంపిన తరువాత పుట్టిన నీతికథలు చదివాక ఈ కథ గుర్తుకు వచ్చిందా?’’
‘‘ఔను!’’
‘‘నువ్వెన్నయినా చెప్పు? మనలాంటి సామాన్యులు నిజాయితీగా ఉన్నట్టు పెద్దవారు ఉండరు?’’
‘‘నిజమే కావచ్చు.. కానీ మీ అబ్బాయి పెళ్లి సంబంధం కోసం వివరాలు ఇచ్చావు కదా? ఆ వివరాలు చదివితే ఎవరైనా మీ అబ్బాయికి పిల్లనిస్తారా? ఆ జాబితాలో మీ ఇంట్లో పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చదివాక నాకు కన్నీళ్లు ఆగలేదు. చూస్తే బాగానే కనిపిస్తావు కదా? మరీ అంత పేదరికం ఏంటిరా? అసలేం జరిగింది? నీ ఆస్తి అంతా ఏమైంది?’’
‘‘ఏదీ.. నీకిచ్చిన పేపర్ ఇటివ్వు’’
‘‘ఇదిగో తీసుకో...’’
‘‘కొంప మునిగింది! మా ఆవిడకు రెండు జాబితాలు.. ఒకటేమో అబ్బాయి పెళ్లి సంబంధం కోసం మా ఆస్తుల జాబితా. ఇంకోటి మా అమ్మకు వృద్ధాప్య పెన్షన్, తెల్ల రేషన్ కార్డు కోసం అవసరం అయిన కాగితాలు ఇచ్చాను. ఇంకా నయం అబ్బాయి ఇంటికి ఈ పేపర్ పోలేదు. మధ్యలో కలవడం వల్ల బతికి పోయాను. ఏదో వృద్ధాప్య పెన్షన్ కోసం ఈ పేదరికం జాబితా.. అంతే కానీ పేదవాడిగా బతకాల్సిన ఖర్మ నాకేంటిరా? పదెకరాల పొలం ఈ మధ్యనే కొన్నాను. పెద్దకొడుకు అమెరికాలో ఉన్నాడు. హైదరాబాద్‌లో ఐదు ప్లాట్లు ఉన్నాయి. నీ ఎరుకలో ఎక్కడైనా ప్లాట్లు ఉంటే చెప్పు.. ఇప్పుడే కొనేస్తాను.’’
‘‘నువ్వు అంతటి సమర్ధుడివేలే! ఎన్ని ప్లాట్లయినా నగదుతో కొనేస్తావు. నలుగురి దృష్టి నీ ఆస్తి మీద పడకుండా దిష్టిచుక్కలా వైట్ రేషన్ కార్డు, మీ అమ్మకు పెన్షన్ తీసుకున్నావుకదూ?’’
‘‘కావచ్చు కూడా.. కానీ అందరూ తీసుకుంటున్నప్పుడు నేనెందుకు తీసుకోవద్దు అని తీసుకుంటున్నాను. ఏం..? ప్రభుత్వ సొమ్ము తినే అధికారం మాకు లేదా?’’
‘‘ఎందుకు లేదు..?’’
‘‘ఐనా నువ్వా పిట్టకథ ఎందుకు చెప్పినట్టు? మనమంతా అవినీతి పరులమే అని చెప్పదలుచుకున్నావా? నువ్వెన్ని కథలు చెప్పినా, వేల కోట్లు సంపాదించే పెద్ద పెద్ద అవినీతి పరులు ఎక్కడ? లక్షల కోట్లు బ్యాంకులకు ముంచే వారు.. దేశం విడిచి వెళ్లే వాళ్లు. వీళ్లందరూ ఎక్కడ? ఏదో సరదాగా తెల్ల రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్ తీసుకునే మనమెక్కడ?’’
‘‘తేడా ఏమీ లేదు. ఎవడి స్థాయిలో వాడు అవినీతికి పాల్పడుతున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వంద రూపాయల లంచంతో పని కానిచ్చుకుందామని నువ్వనుకుంటావ్! అందరూ కోట్లు సంపాదిస్తున్నారు.. నేనో వంద తీసుకుంటే తప్పేమిటని వాడనుకుంటాడు. ప్లాట్ కొనే ధర ఒకటి.. రిజిష్ట్రేషన్ చేయించుకునే ధర ఒకటి.. పన్ను కట్టడం కన్నా పాతిక శాతం ముడుపులతో తప్పించుకోవడంలోనే భారతీయులకు మక్కువ. నీ స్థాయిలో నువ్వు, వాళ్ల స్థాయిలో వాళ్లు. చిన్నగీత అయినా పెద్దగీత అయినా గీత గీతనే.’’
‘‘అవినీతిపరుల కొమ్ము కాస్తున్నావా?’’
‘‘నీతిమంతుడిని అనే భ్రమల నుంచి బయటపడు అని అంటున్నాను. అందరూ నీతిమంతులే’’ *

buddhamurali2464@gmail.com