జనాంతికం - బుద్దా మురళి

రాజధానులు 3 జిల్లాలు 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏంటోయ్ విశేషాలు?’’
‘‘జబ్ ఖుదా దేతా హై తో చప్పడ్ పాడ్‌కే దేతా అంటారు’’
‘‘ఔను! అంటారు. భగవాన్‌కే కృపామే దేర్ హోగా మగర్ అందేర్ నహీ హోతా అని కూడా అంటారు. ఆ సంగతి నాకు కూడా తెలుసు కానీ. ఇలా తలా తోకా లేకుండా మధ్యలో నుంచి చెబితే ఏం అర్థం అవుతుంది. ఇంతకూ దేవుడు అంతగా చప్పడ్ పాడ్‌కే ఏమిచ్చాడో? ఎవరికిచ్చాడో ఆ మాట చెప్పు?’’
‘‘ఆంధ్రకు మూడు రాజధానులు అట! దేవుడి కరుణలో ఆలస్యం కావచ్చు కానీ కరుణించి తీరుతాడు!’’
‘‘ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అమరావతి అభివృద్ధి కోసం తపిస్తున్నాయి. ఊ అంటే క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని గ్రాఫిక్స్‌తో ఒకాయన ఐదేళ్ల పాటు ఊరించారు. ఇప్పుడు ఇంకొకాయన మూడు అంటున్నారా?’’
‘‘చూడోయ్ ఎంత గొప్ప నిర్మాణం అయినా ముందు మనసులో, ఆ తరువాత కాగితంపైనే పుడుతుంది. నవాబుగారి మదిలో ఐదువందల ఏళ్ల క్రితం చార్మినార్ పుట్టింది. తరువాత వాస్తవ రూపం దాల్చింది. గోల్కొండ కావచ్చు, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆలయాలు కావచ్చు ముందు కాగితంపైనే కదా పుట్టేవి. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ టెక్నాలజీ లేదు కాబట్టి షాజహాన్ కూడా తాజ్‌మహల్‌ను కాగితంపైనే ముందు గీశారు. ఆ తరువాతే కదా? ఆగ్రాలో తాజ్‌మహల్ కట్టింది. ఇప్పుడంటే గ్రాఫిక్స్ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ముందుగా గ్రాఫిక్స్‌లో పంచ రంగుల రాజధానిని చూపించారు. మరి కొంత కాలం అవకాశం ఇచ్చి ఉంటే ఇంత కన్నా అద్భుతమైన గ్రాఫిక్స్‌ను చూపించి ఉండేవారు’’
‘‘ఔను! నిజమే రాజవౌళి బిజీగా ఉండడం వల్ల కొత్త కొత్త డిజైన్లు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది అన్నారు. ఆయన షూటింగ్ ముగించుకునే సరికి డిజైన్ల అవసరం లేకుండా పోయింది. పాపం రాజవౌళి కృషి వృధా అయింది.’’
‘‘నిజమేనోయ్! బాహుబళిలో డిజైన్లు ఎంత బాగున్నాయి’’
‘‘ఒక్క రాజవౌళికే ఆ చాన్స్ దక్కిందని ఈర్శ పడాల్సిన అవసరం లేదు. మూడు రాజధానుల్లో ముగ్గురు దిగ్గజ డైరెక్టర్లకు కు అవకాశం ఇవ్వ వచ్చు.’’
‘‘ఔను! మాయా బజార్, పాతాళా బైరవి ఆర్ట్ డైరెక్టర్లు ఎవరో నీకు తెలుసా?’’
‘‘తెలియదు... ఎందుకు?’’
‘‘మరీ పాత చింతకాయ పచ్చడి ... టెస్ట్ లేదంటావేమో కానీ నాకు బహుబలి సెట్టింగ్‌ల కన్నా ఆనాటి మాయాబజార్, పాతాళా బైరవి సెట్టింగ్‌లు ఇప్పటికీ నచ్చుతాయి. బ్లాక్ అండ్ వైట్‌లో సైతం ఆద్భుతంగా కనిపిస్తాయి. అలాంటి సెట్టింగ్‌లతో ఏ రాజ్యమైనా నిజంగా ఉండేదేమో అని ఇప్పటికీ నేను గట్టిగా నమ్ముతాను. భూలోకంలో లేకపోయినా మరో లోకంలో నైనా అద్భుతమైన అలాంటి భవంతులు ఉన్న దేశం ఉండే ఉంటుంది’’
‘‘అంటే మాయాబజార్ లాంటి రాజధాని కావాలంటావు’’
‘‘మనం అనుకుంటే అవుతుందా? ఎవరిష్టం వారిది. మాయాబజార్‌లో కనిపించే భవనాలున్న రాజ్యం ఈ రోజుల్లో కనిపించక పోవచ్చు కానీ... ప్రతి ఒక్కరూ మాయగాళ్లే అనే దానిలో మాత్రం అనుమానం లేదు. ’’
‘‘పౌరసత్వ సవరణ చట్టంతో దేశమే మాయాబజార్ అవుతుందట లే!’’
‘‘ఆ మాట ఏ మేధావి అన్నారు?’’
‘‘మేధావులు ఏ మంటే ఏం కానీ నువ్వు చెప్పు అలా కాదంటావా?’’
‘‘ఈ దేశం దేన్నయినా జీర్ణం చేసుకుంటుంది. వెయ్యేళ్ల మొఘలాయిల పాలన, రెండువందల ఏళ్ల బ్రిటీష్ పాలనను సైతం జీర్ణం చేసుకుని ఈ దేశం తన సహజ లక్షణాన్ని కోల్పోలేదు. ఏదో ఒక చట్టం, మేధావుల ఆగ్రహం, నిరసనలతో ఏదో అయిపోతుందనుకుంటే భ్రమ. ఆర్టికల్ 370 తీసేస్తే భూకంపం అని మన దేశంలోని మేధావులతో పాటు పాక్ పాలకులు సైతం కలలు కన్నారు. అణుయుద్ధం తేదీలు కూడా ప్రకటించారు. ఏమైంది? ఏమీ కాదు. దేశం అన్నింటిని జీర్ణం చేసుకుంటుంది. ’’
‘‘అంటే సమర్ధిస్తున్నావా?’’
‘‘నేను వ్యతిరేకించడం లేదు. సమర్ధించడం లేదు. ఏదో అయిపోతుందనే మేధావుల కల నెరవేరదు అంటున్నాను’’
‘‘శవాలు మాత్రమే తటస్థంగా ఉంటాయని నువ్వే ఓ సారి అన్నావు. ఇప్పుడు తటస్థంగా ఎలా ఉంటున్నావు’’
‘‘తటస్తున్ని అని నేనెక్కడన్నాను. వ్యతిరేకించడం లేదు. సమర్ధించడం లేదు అన్నాను. తెలియని విషయం గురించి మాట్లాడడం లేదు. మొన్న ఢిల్లీలో ప్రదర్శనలో పాల్గొన్న కొందరితో టీవి చానల్ వాళ్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు కాస్త వివరించండి అంటే ఎందుకో చెప్పలేం కానీ మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చాలా గట్టిగా చెప్పాడు’’
‘‘అసలు విషయం దాటేస్తున్నావు. మూడు రాజధానుల గురించి ఏమంటావు?’’
‘‘ఒకటికి మించిన రాజధానులు ప్రపంచంలో మొదటి సారేమీ కాదు. ఈ దేశంలోనే పది రాష్ట్రాల్లో అలా ఉన్నాయి. దీని వల్ల ప్రయోజనమా? నష్టమా? ఏం ప్రయోజనం? ఏం నష్టం అని చర్చ జరపాలి. నిపుణులు తేల్చాలి అంతే తప్ప...’’
‘‘అంతే తప్ప... ఆపేశావేం?’’
‘‘మొన్న తుగ్లకే బాప్ లాంటి నేత ఒకరు తుగ్లక్ చర్య అని తిట్టారు’’
‘‘కాదా? ’’
‘‘కాదనడం లేదు. ఔను అనడం లేదు. లాభనష్టాలు నిపుణులు చెప్పాలి. టీవిల్లో పార్ట్ టైం, ఫుల్ టైం యాంకర్లు కాదు’’
‘‘పార్ట్ టైం ఏంటి? ’’
‘‘్ఫల్ టైం యాంకర్లు అంటే టివిల్లో ఉద్యోగులు, పార్ట్ టైం వారికి ఎలాంటి జీతం ఉండదు. అయా పార్టీల్లో ఉంటూ పార్ట్ టైంగా టివి చర్చల్లో కనిపిస్తారు. ప్రపంచంలో వీరికి తెలియని అంశం అంటూ ఉండదు. ప్రతి దానిపై మాట్లాడేస్తారు.’’
‘‘ఆ సబ్జెక్ట్‌లో నిపుణులే మాట్లాడాలి అంటే ఒక్క చానల్ కూడా ఒక్క రోజు కూడా ఉండదు. నూటా పాతిక చానల్స్‌లో రోజూ చర్చలంటే ఎంత కష్టం ఆలోచించు. నిపుణులు వారి పనిలో వారు బిజీగా ఉంటారు కానీ టివి చర్చల్లో దానిపై మాట్లాడేందుకు వస్తారా? నాయకులంటే ఏదో మాట్లాడి జన జీవన స్రవంతిలో కనిపించాలనే తపనతో చలి కాలంలో కూడా చలికి భయపడకుండా ఠంచనుగా టివి స్టూడియోలకు వచ్చేస్తారు.’’
‘‘ఇంతకూ మూడు రాజధానులు మంచివే అంటావా?’’
‘‘33 జిల్లాలతో తెలంగాణ ముందుంటే రాజధానుల్లో 3 రాజధానులతో ఆంధ్ర ముందుంది’’
‘‘ఇంతకూ ఏమంటావు?’’
‘‘సైజ్ డస్ నాట్ మ్యాటర్ అని ఓ పాపులర్ మాటుంది’’
‘‘అంటే?’’
‘‘బాబుగారు తొలిసారిగా సిఎం అయినప్పుడు ఓ మాట పదే పదే చెప్పేవారు. అది నల్లపిల్లా తెల్ల పిల్లా అని కాదు. రంగు ఏదైనా కావచ్చు ఎలుకలను పడుతుందా? లేదా అనేదే ముఖ్యం అనేవారు. అలానే 33 జిల్లాలా? మూడు రాజధానుల అని సంఖ్య ప్రధానం కాదు. ప్రజల ఆకాంక్షలు తీరుస్తున్నారా? లేదా అనేది ముఖ్యం. ’’
‘‘ఐనా భూములు కొని లాభపడ్డవారు, నష్టపోయిన వారు ఆలోచించుకుంటారు లే! మనకెందుకు?’’

buddhamurali2464@gmail.com