S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/14/2018 - 01:52

నగరాల్లో వాయు కాలుష్యం జన జీవన ప్రమాణాలను మింగేస్తున్నదని ఢిల్లీ ఐఐటి జరిపిన పరిశోధన హెచ్చరిస్తోంది. అలహాబాద్, మీరట్, లక్నో, కాన్పూర్, వారణాసి, గోరఖ్‌పూర్, పాట్నా, గయ, ముజఫర్‌నగర్, రాంచీ నగరాల్లో వాయు కాలుష్యంపై ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎనర్జీ డెవలప్‌మెంట్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి.

06/12/2018 - 23:39

మాజీ రాష్టప్రతి, రాజకీయ మేధావి ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ సమావేశంలో దేశభక్తి, జాతీయ సమైక్యత, సంస్కృతి గురించి ప్రసంగించటం విశేషాంశం అయింది. ఆరెస్సెస్ సభలకు ప్రముఖ వ్యక్తులు హాజరు కావడం అపూర్వం కాకపోయినా, కాంగ్రెస్, భాజపాలు 2019 ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ ప్రణబ్ నిర్ణయం సంచలనం సృష్టించింది.

06/08/2018 - 23:59

భూమిని వదలి మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ బతగ్గలం? భూమి అంటే మనం నిలబడి ఉన్న ఘనరూపమే కాదు. సముద్రాలు, నదులు, అడవులు, సమస్త జంతుజాలం కూడా. మరి.. మన మనుగడకు ఆధారమైన భూమిని ఏం చేస్తున్నాం? అన్ని రకాలుగా విధ్వంసం చేస్తున్నాం. పశుపక్ష్యాదులు, జలచరాలు, వృక్షాల మనుగడకు ఆధారమైన భూమిని జీవయోగ్యం కానిదిగా చేస్తున్నాం. మనం కోరుకొంటున్న ప్రపంచాన్ని రూపొందించుకోవటంలో ధరిత్రి, పర్యావరణానికి సంబంధం ఉందా?

06/08/2018 - 00:09

తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే తరగతి గది ఆరోగ్యం కూడా అలాగే వుంటుంది. శరీరం చురుగ్గా ఉంటేనే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మెదడు బాగా పనిచేస్తేనే కొత్త భావాలు పుట్టుకొస్తాయి. అప్పుడే తరగతి గది కళకళలాడుతుంది. ఉపాధ్యాయులు వయసులో పెద్దవారే కావొచ్చును, సంసార బాధలు కూడా ఉండవచ్చును. కానీ తరగతి గదిలోకి వారు అడుగుపెట్టగానే ఎక్కడి నుంచో చురుకుదనం వస్తుంది.

06/07/2018 - 00:11

దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూపై ఎ.గోపన్న రాసిన పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమంలో మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పాల్గొన్నారు. ఢిల్లీలో ఈమధ్యనే జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్సారీ మాట్లాడుతూ- ‘కొనే్నళ్ళ క్రితం హెచ్.జి.

06/06/2018 - 00:04

ఆర్థిక నేరాలకు పాల్పడినవారి ఆస్తుల జప్తు గూర్చిన వార్తలు తరచూ వినిపిస్తాయి. ఆ జాబితాలో ఇప్పుడు మావోయిస్టు నేతలు కూడా చేరారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఇటీవల బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత బినయ్ యాదవ్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. ఇతను తన బంధువుల ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేశాడని, విలువైన ఆస్తులను పోగుచేశాడని వెల్లడైంది.

06/04/2018 - 23:47

ఎన్ని కుట్రలను, అడ్డంకులను అధిగమించి కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రిగా కొలువుదీరాడు. ఆయన సీఎం కావటానికి- ధర్మాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడినందుకు సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని అందరం అభినందించ వలసిందే. సుదీర్ఘకాలంగా క్రియాశీల రాజకీయాలలో ఉంటూ వస్తున్న మాబోటి వాళ్లకు కర్నాటక గవర్నర్ నిర్ణయం ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

06/03/2018 - 02:04

పాతరాతియుగం నుండి ఉనికిని కలిగి, పూర్వ రాతియుగపు ఆవాసాలకు నిలయమై, షోడశ మహా జనపథాలలో దక్షిణ ప్రాంత ఏకైక ఆశ్మక జనపథాన్ని అంతర్భాగంగా కలిగి, అఖండ భారతావనిలో ప్రత్యేక స్థానం పొందింది తెలంగాణ ప్రాంతం.

06/02/2018 - 02:15

రాజకీయ నేతలు నడిచే దారి పూర్తిగా ‘పూలబాట’ కాదు. తెరాస పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న విధంగానే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రజాజీవితంలో కష్టనష్టాలు లేకుండా ఎంతటివారైనా నిజమైన రాజకీయ నాయకుడు కాలేరు.

05/31/2018 - 23:49

తొంబయి మూడేళ్ల వయసులోనూ ఆయన ఓ నిరంతర అనే్వషి.. వైద్య విద్యావేత్తగా తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవలు చేశారు. అపురూపమైన వైద్య నిఘంటువులను, సైన్స్ పుస్తకాలను వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆయనే- డాక్టర్ ఒ.ఎ. శర్మ.

Pages