S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

05/31/2018 - 01:54

(నేడు పొగాకు వ్యతిరేక దినం...)

05/29/2018 - 23:30

అచ్చం ‘చందమామ కథ’లా బ్రిటన్ యువరాజు హ్యారీ, అమెరికా టెలివిజన్ నటి మేఘన్ మేర్కవ్‌ల పెళ్లి జరిగింది. పెళ్లికొడుకు రాకుమారుడు, పెళ్లికూతురు ఆఫ్రికా- అమెరికన్ సంతతికి చెందిన యువతి. అందులోనూ టీవీ సీరియళ్ళలో కనిపించే నటీమణి. ఇది సాధ్యమా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, సాధ్యమేనని ఇటీవల లండన్‌కు సమీపాన విండ్సర్ కోటలో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి గూర్చి చెప్పాల్సిందే!

05/27/2018 - 00:17

తంత్ర భారతావనిలో సంస్కరణలకు ఆద్యుడిగా, ప్రజా సంక్షేమ విధానాల రూపశిల్పిగా, నవభారత నిర్మాతగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎనలేని ఖ్యాతిని ఆర్జించారు. వివాహాలకు కనీస వయసును 12 నుండి 15 ఏళ్లకు పెంచడం, విడాకులు తీసుకున్న మహిళలకు వారసత్వ ఆస్తి హక్కు ఇవ్వడం, వరకట్నం ఆచారాన్ని చట్టవిరుద్ధం చేయడం వంటి అనేక కీలక సంస్కరణలకు నెహ్రూ శ్రీకారం చుట్టారు.

05/26/2018 - 00:03

మన దేశం భిన్న మతాల, విభిన్న భాషల సమాహారమైనప్పటికీ అనాదిగా సంస్కృతి పరంగా ఒక్కటే. ఈ పుణ్యభూమిపై దండయాత్రలు చేసి, భూభాగాలను ఆక్రమించుకొని కొంతకాలంపాటు పరిపాలన చేసిన యవణులు, కుశాణులు, శకులు, హూణులు, ఇస్లాంలు, క్రైస్తవులు మొదలైన వారంతా విదేశాల నుండి వచ్చిన దోపిడీ ముఠాలు మాత్రమే. విదేశీ దురాక్రమణదారుల్లో కొందరు పలాయన మంత్రం పఠించగా, మిగిలిన వారు భారతీయ జీవన స్రవంతిలో విలీనమయ్యారు.

05/22/2018 - 23:49

సభ్య సమాజంలో స్వేచ్ఛ తక్కువుంటుంది. ఎందుకంటే అక్కడ సామాజిక నియంత్రణ వుంటుంది. కనుక ఎవరిష్టం వచ్చిన విధంగా వారు చేయడానికి వీలుండదు. బలవంతుడు, ధనవంతుడూ బలహీనుడ్ని పీడించడాన్ని సమాజం లేదా ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుంటుంది. అందువలన సభ్య సమాజంలో రక్షణ ఎక్కువుంటుంది.

05/22/2018 - 00:36

సమసమాజ నిర్మాణం కోసం ఎందరో మహానుభావులు కృషిచేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ సామాజికవర్గాల అత్మగౌరవం తోపాటు వారు స్వయంశక్తిగా ఎదగటానికి ఎందరో సంఘ సేవకులు పనిచేశారు. ఇలాంటివారు చరిత్రపుటల్లో చెప్పుకోతగ్గవారు కొందరే. అణగారిన కులం నుండి వచ్చి సమాజ నిర్మాణంలో తనవంతు కృషి చేస్తూనే, తన అలోచనలు కార్యరూపంలో చూపిన దళిత శిఖరం, నేటి తరానికి మార్గదర్శి భాగ్యరెడ్డి వర్మ.

05/19/2018 - 00:17

మార్క్సిస్టు పరిభాషలో పేర్కొనే ‘పరపీడన పరాయణత్వం’ అన్నమాటకు ఇకపై మాన్యత లేదు. సైబర్ విజ్ఞానంతో సమాజాలు సాధికారత సాధించే వైపు పయనిస్తున్నాయి. ఇదే ఈ కాలపు గొప్ప విప్లవం. గత రెండు శతాబ్దాలుగా చోటుచేసుకున్న రక్తపాత విప్లవాలకు కాలం చెల్లింది. ముఖ్యంగా కారల్ మార్క్స్ చూపిన మార్గంలో విప్లవాలకు నూకలు చెల్లాయి.

05/16/2018 - 23:27

పేద, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని కోల్పోయారు. అందుకే అప్పు చేసైనా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా కోట్లాది రూపాయలను విద్యావ్యవస్థ కోసం ఖర్చు చేస్తున్నా ఆ నిధులన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరువలె మారుతున్నాయి.

05/15/2018 - 22:14

కారల్ మార్క్స్‌పై ఇటీవల వెలువడిన ఘనమైన కీర్తనల ప్రతిధ్వని ఇంకా వినిపిస్తూ ఉంది. అసహజ రీతిలో వాటిని వినిపించిన వైనం కొత్తతరాన్ని, సహస్రాబ్ది తరాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఇంటర్నెట్‌ను అభివృద్ధిపరిచి అమెరికా తన గోతిని తానే తవ్వుకుంటోందని కమ్యూనిస్టుపార్టీ నాయకుడొకరు అన్నారు. ఇది ఎంతటి అనాలోచిత వ్యాఖ్యనో ఇట్టే తెలుస్తోంది.

05/12/2018 - 23:55

నేటి అధునాతన భారతీయ మేధావులకు, తమను తాము ‘స్వేచ్ఛావాదులం’ (జజఇళ్ఘూఒ) అనుకునే వారికి- ‘జాతీయవాదం’ అనేది అర్థరహితమైన ఒక ప్రమాదకారియైన భావం. ముఖ్యంగా కమ్యూనిజం, ఇస్లాం అనేవి ప్రారంభంలో ప్రపంచాన్ని జయించే భావజాలమే సుమా! మన దేశంలో జాతీయవాదానికి పూర్తిగా వ్యతిరేకం- ‘సెక్యులర్ భావన’. దీనిని సరిగ్గా అర్థం చేసుకునేందుకు, మన స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖుల భావాలను ఒక్కసారి గమనిద్దాం.

Pages