S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/27/2018 - 23:44

ఆమె పేరు మమతా బెనర్జీ.. మనసంతా హిందువులపై ద్వేషమే.. కమ్యూనిస్టుల పాలనలోనూ బెంగాల్‌లో ఇంతటి హింస జరగలేదేమో! ప్రధాని మోదీపై వ్యతిరేకతను మమత హిందువులపై చూపిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు మోదీ చేసిన సూచనలు మీడియాలో ప్రసారం కానీయకుండా ఆమె అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే- తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాత్రికేయులను చితకబాదుతున్నారు.

04/26/2018 - 23:11

ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెదేపా, విపక్షమైన వైకాపా గత నాలుగేళ్లుగా రాజకీయ స్వార్థంతోనే వ్యవహరిస్తున్నాయి. సొంత బలం లేనందున వైకాపా, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లయినా గెలవాలని భాజపా తాపత్రయ పడుతోంది. ఈ పార్టీలకు ప్రజల గోడు వినిపించడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్న విషయమై ఈ మూడు పార్టీల నేతల్లో ఎలాంటి చిత్తశుద్ధి లేదు.

04/25/2018 - 23:32

వృత్తిపరమైన ‘ప్రొఫెషినల్ ప్యాషన్’ ఒకే రోజు తరగతి గతిలో అడుగుపెట్టగానే వచ్చేది కాదు. అది ఒక అవిచ్ఛిన్నమైన ఒక ప్రక్రియ. దానికి ఉపాధ్యాయుడే కారకుడని అనుకోవటం తప్పే. ఇందుకు తానెంత బాధ్యుడో తన పరిసరాలది కూడా అంతే బాధ్యత. భువనగిరి హైస్కూల్‌లో విద్యార్థుల అభిమానం, సహచర ఉపాధ్యాయుల హితబోధ, తల్లిదండ్రుల ఆదరణ, సమాజం సహాయం లేకపోతే నాకు ఆ ప్రొఫెషినల్ ప్యాషన్ రాకపోయేదనుకుంటా. అదేకాదు..

04/25/2018 - 03:56

కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని సీపీఎం మరోసారి ప్రకటించింది. ఆ పార్టీ 22వ జాతీయ మహాసభలు ఐదురోజులపాటు హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించిన ఆ పార్టీ తెలంగాణ రాజధానిలో మహాసభల క్రతువును హంగూ ఆర్భాటాలతో పూర్తిచేసుకుంది. అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలకు భారత్‌ను మోదీ ప్రభుత్వం తాకట్టుపెడుతోందని మహాసభల్లో ఆరోపించారు.

04/21/2018 - 00:05

సామాజిక, మతపరమైన అంశాలపై రాజకీయ పార్టీలు కత్తులు దూ స్తున్నాయి. దీంతో పలు సున్నితమైన విషయాలపై ప్రజల్లో వేడి రాజుకుని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ‘ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీస్ యాక్ట్-1989’పై సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా దళితులు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

04/17/2018 - 23:50

ప్రపంచంలో ‘కులాల విభజన’ ఉన్నది హిందూ సమాజంలో మాత్రమే. ముస్లింలలో సున్నీలు, షియాలు అనే తెగలు, క్రైస్తవుల్లో రోమన్ కాథలిక్కులు, ప్రొటెస్టంట్లు అనే తెగలున్నాయి. ఆ తెగల్లో ఉన్నవి మత సంబంధమైన భేదాలే. హిందూ సమాజంలోనూ శైవ, వైష్ణవ, శాక్తీయ ఆర్య సమాజం, వీరశైవం వంటివి ఉన్నాయి. మతభేదాల కంటే కులభేదాల వల్లే హిందూ సమాజానికి, సంస్కృతికి, ధర్మానికి తరతరాలుగా హాని జరిగింది, జరుగుతోంది.

04/14/2018 - 00:29

‘లోకమాన్య’ తిలక్ గనుక అస్పృశ్యుడిగా జన్మించినట్టయితే- ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని ఉండడు.. ‘అస్పృశ్యత నివారణే నా జన్మహక్కు’ అని ప్రకటించి ఉండేవాడు..
* హిందూత్వమనేది ఎంత సవర్ణ హిందువుల సొత్తో- అంతగా అది ‘అస్పృశ్యులని పిలవబడే’ హిందువుల సొత్తు కూడా. హిందూత్వ భావన ఫలితంగా నిర్మించబడిన దేవాలయాలు అందరికీ అందుబాటులో ఉండాల్సిందే..

04/10/2018 - 23:55

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికారమే పరమావధిగా అన్ని రాజకీయ పక్షాలు భారీగా కసరత్తు చేస్తున్నాయి. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజాచైతన్యం వెల్లివిరియాలని కోరుకునేవారు సైతం రాజకీయ రంగు పులుముకుంటున్నారు, కొత్త పార్టీలు పెడుతున్నారు. తమ బాధ్యతల్ని, చిరకాలంగా చెబుతున్న మాటల్ని మింగేసి అధికార పగ్గాలు చేపట్టాలన్న తాపత్రయంతో బరిలోకి దిగుతున్నారు. తమ శక్తిసామర్థ్యాలు, విశ్వసనీయత ఏమిటి?

04/10/2018 - 00:08

కర్నాటక ప్రభుత్వం లింగాయుతులు హిందువులు కారని, వారిది ఒక ప్రత్యేక మతమని నిర్ధారించి, మతపరమైన మైనారిటీలుగా వారిని గుర్తించాలంటూ కేంద్రానికి సిఫారసు చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలకు పరాకాష్ఠ. గతంలో మైనారిటీలను బుజ్జగించి ఓట్లు అడిగేవారు. ఇప్పుడు హిందూ మతస్థులను విభజించి, ఓట్లు సంపాదించే సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు.

04/06/2018 - 23:15

‘రైతేరాజు.. అన్నదాత.. జనం ఆకలి తీర్చే ఆపద్బాంధవుడు’.. ఇలా ఎన్నో రకాలుగా సమాజంలోని అన్ని వర్గాల వారూ రైతన్నలను పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఈ పొగడ్తలది ఒక కోణం. మరో కోణంలో చూస్తే కర్షకుల కష్టాలు, వారు అనునిత్యం ఎన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నదీ మనకు అవగతమవుతుంది. సమాజంలో రైతులు మాత్రమే పలురకాలుగా దోపిడీకి గురవుతున్నాడు. మిగతా వృత్తులను నమ్ముకున్న వారు ఎంతోకొంత లాభసాటిగానే జీవించగలుగుతున్నారు.

Pages