S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/08/2018 - 22:53

సమాజాన్ని అన్ని కాలాల్లో కూడా తీర్చిదిద్దేది ‘ప్రశే్న’. అందుకే యక్షప్రశ్నలు అడుగుతూ.. మనసును నియంత్రించేది ఎట్లా? అని కొందరు అడుగుతారు. చిన్న పిల్లలు కూడా ప్రతి అడుగునా ప్రశ్నిస్తారు. ‘బడికి ఎందుకు పోవాలమ్మా?’- అని ప్రశ్నిస్తారు. ఇలా పిల్లలు తల్లిని యక్షప్రశ్నలడుగుతారు. తల్లులు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరై పోతారు. తరగతి గదిలో కూడా విద్యార్థికి ఎన్నో ప్రశ్నలు అడగాలని ఉత్సుకత ఉంటుంది.

03/08/2018 - 03:52

మన దేశంలో లౌకికవాదం గురించిన చర్చ అంతా అల్పసంఖ్యాక వర్గాలవారి హక్కుల గురించి, వారి వ్యక్తిగత చట్టాలు పరిరక్షణ గురించి, వివిధ మతాలవారు కలిసి జీవించటం గురించి మాత్రమే జ రుగుతోంది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాలయాలపై ప్రభుత్వాలు చేస్తున్న పెత్తనం గురించి ఈ చర్చ ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ఇతర మతాలవారి విషయాల్లో ప్రభుత్వ జోక్యం లేదు. హిందూ ఆలయాలు, ధార్మిక సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం అవసరమా?

03/07/2018 - 07:41

తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులోని వెంకటాపురం అటవీ ప్రాంతంలో హోలీ రోజున జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పదిమంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒక గ్రేహౌండ్స్ కమాండో మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఏడాది క్రితం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు లోని రామగూడ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత ఇదే భారీ ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ ఆధిపత్యం సాధించాలన్న ఉద్దేశంతో కొంతకాలంగా మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు.

03/06/2018 - 00:45

‘జై తెలంగాణ’ నుంచి ‘జై భారత్’ నినాదానికి కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఆసక్తికరం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సమయంలో కొందరు చిన్నచూపు చూశారు, వెకిలి మాటలు మాట్లాడారు. ఇప్పుడు సరిగ్గా అలాగే ఎకసెక్కపు మాటలు! తెరాస ఏర్పడినపుడు రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉండేవో, ఇప్పుడు దేశంలో అలాగే ఉన్నాయి.

03/04/2018 - 00:04

సంక్షోభ సమయంలో తమ మనుగడను కాపాడుకునేందుకు రాజకీయ నేతలు ప్రాంతీయతత్వాన్ని ఓ అస్త్రంగా వాడుకుంటారు. అయితే, అన్ని వేళలా ఈ సిద్ధాంతం హిట్ కాదు. ఉత్తరాదిలో ‘సామాజిక న్యాయం’ పేరిట కొందరు చేసిన రాజకీయ ప్రయోగాలకు గతంలో ఆదరణ లభించింది. ఈ ప్రయోగాలు దేశాన్ని సైతం శాసించాయి. తమిళనాడులో 1960వ దశకంలో ద్రవిడ పార్టీలు బ్రాహ్మణ వ్యతిరేక వాదంతో ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చాయి.

03/01/2018 - 00:42

ఆది శంకరాచార్యులు నెలకొల్పిన శ్రీ కంచి కామకోటి పీఠ పరంపరలో 69వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధి గాంచారు శ్రీ జయేంద్ర సరస్వతీస్వామివారు. సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించాలని ప్రబోధించారు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు. మనం ఎక్కడ జీవించినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో వున్నా పరమాత్ముని సంతానమే. ఈ సృష్టికంతకూ కారణభూతుడైన ఈశ్వరుడొక్కడే..

02/28/2018 - 01:05

ఇటీవల మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సులో ‘సాంకేతిక పరిజ్ఞాన విశ్వరూపం’ ఆనవాలు స్పష్టంగా కనిపించింది. రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఊహాగానం చేయడం కాదు. దృశ్యమానంగా కనిపించడం అద్భుతం, అమోఘం. సామాన్యుడు సాధికారత వైపు నడిచేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఊతం ఇస్తోంది. ఆధునిక సాంకేతికత ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజల ప్రయోజనమే కావడం గొప్ప విప్లవాత్మక పరిణామం.

02/27/2018 - 00:46

ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమైనా జమాఖర్చులు, లాభనష్టాలు, పెట్టుబడులు, ఉపసంహరణలు వంటివన్నీ బేరీజు వేసుకుంటూ ఏదో ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఏడాది కాలానికి ఒక నివేదిక సమర్పించడం ఆనవాయితీ. వీటన్నిటితోపాటు మరో కొత్త పద్ధతి అనుసరించడం నేటి రాజకీయం అలవాటు చేసుకుంది. ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారాన్ని నిలుపుకునే దిశగా బేరీజు వేసుకోవడం, అందుకు తగిన పథకాలు, ప్రణాళికలు రూపుదిద్దుకోవడం జరుగుతోంది.

02/24/2018 - 06:43

అఖండ భారతావని నాటి చిన్న చిన్న రాజ్యాలు కనుమరుగై ప్రజాస్వామ్య పాలనా విధానంలో స్వతంత్ర భారతం ఆవిర్భవించింది. సంస్కృతంలో రాజ్యానికి రాష్ట్రం అనే పేరు వుండటంతో, స్వాతంత్య్ర పోరాట కాలంలో అంకురించిన హిందూమత భావైక్యత, దేశం లేదా రాజ్యం లేదా ఒకే రాష్ట్రంగా ఏర్పడాలని హిందూత్వ విశ్వాసులు ప్రగాఢంగా ఆకాంక్షించారు.

02/22/2018 - 23:07

ప్రతి తరం గత తరం భుజాలపై నిల్చొని ఆనాటి తరగతి గది రూపురేఖలను దిద్దుతుంటుంది. దానితో ఎంతోమంది భాగస్వాములు వారి ఫలితమే ఆనాటి సమాజంలో వచ్చిన మార్పులు. ప్రతితరం కొత్త జ్ఞానాన్ని సృష్టిస్తుంది. గత తరం జ్ఞాన వృక్షానికి నీళ్లుపోస్తూ తమ ఆలోచనలను దానిలో పూరిస్తూ ఉంటుంది. కొత్త సమాజానే్న సృష్టించటం కాదు. ఉన్న సమాజాన్ని మెరుగు పరచటం. దీనినే క్రియేటీవ్ థింకింగ్ (కాల్పనిక శక్తి) అంటారు.

Pages