S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/15/2016 - 04:36

ముంబయి, జూలై 14: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 10 శాతం పెరిగింది. 6,317 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 5,747 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు గురువారం ఇక్కడ టిసిఎస్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.

07/15/2016 - 04:34

ముంబయి, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 126.93 పాయింట్లు పెరిగి 27,942.11 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 45.50 పాయింట్లు అందుకుని 8,565 వద్ద నిలిచింది.

07/15/2016 - 04:34

న్యూఢిల్లీ, జూలై 14: ప్రపంచ వ్యాప్తంగా కార్మిక మార్కెట్ అభివృద్ధి, కార్మికులకు సామాజిక భద్రత కల్పనే లక్ష్యంగా జి-20 దేశాల సదస్సు జరిగిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చేప్పారు. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ నెల 12, 13 (మంగళ, బుధవారం) న నిర్వహించిన జి-20 దేశాల కార్మిక శాఖ మంత్రు ల సమావేశానికి దత్తాత్రేయ హాజరైయ్యారు.

07/15/2016 - 04:33

న్యూఢిల్లీ, జూలై 14: స్వచ్చంధ నల్లధన వివరాల వెల్లడి పథకంలో భాగంగా పన్నులు, జరిమానాల చెల్లింపుల గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మూడు విడతల్లో ఈ చెల్లింపులను చేసుకోవచ్చని గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతిచ్చింది.

07/15/2016 - 04:30

విజయవాడ, జూలై 14: కృష్ణా, నాగార్జునసాగర్, ఇతర ఆయకట్టులకు రానురాను సాగునీటి సమస్య జటిలంగా మారుతుండటంతో బోర్లపై ఆధారపడ్డ రైతాంగం క్రమేణా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారిస్తున్నది. నేడు ఎక్కువగా వినియోగిస్తున్న వంట నూనెల్లో పామాయిల్ ఒకటి. పేదల ఆయిల్‌గా కూడా పామాయిల్‌కు పేరుంది. దీన్ని పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుండడంతో పామాయిల్‌కు ఆ పేరు వచ్చింది.

07/15/2016 - 04:28

విశాఖపట్నం, జూలై 14: హుదూద్ వంటి భారీ తుపాన్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ప్రయోగంగా నిర్వహించే భూగర్భ విద్యుద్దీకరణ భారీ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ముహూర్తం ఖరారు కానుంది. విశాఖలోని పలు సబ్‌స్టేషన్ల పరిధిలో 109 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ ప్రాజెక్టుకు అయ్యే రూ. 720 కోట్ల ప్రతిపాదనలకు మోక్షం లభించనుంది.

07/14/2016 - 00:20

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమను నెలకొల్పడానికి ప్రముఖ స్టీల్ సంస్థ జైరాజ్ స్టీల్స్ ముందుకు వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలంలో 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 250 ఎకరాల విస్తీర్ణంలో స్టీల్ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తూ జైరాజ్ ఇస్పాత్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారకరామరావును కలిసి డిపిఆర్‌ను అందజేశారు.

07/14/2016 - 00:15

న్యూఢిల్లీ, జూలై 13: బాత్‌రూమ్ ఉత్పత్తుల తయారీదారు సెరా సానిటరీవేర్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 36.59 శాతం పెరిగింది. 21.39 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఇదే వ్యవధిలో 15.66 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.

07/14/2016 - 00:14

న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బిసిసిలో వాటా విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. ఈ కేంద్ర ప్రభుత్వ నిర్మాణరంగ సంస్థలో 15 శాతం వాటా అమ్మకానికి బుధవారం ఇక్కడ జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ఈ వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఖజానాకు 1,706 కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా.

07/14/2016 - 00:13

విశాఖపట్నం, జూలై 13: అర్బన్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణీకరణపై విశాఖ వేదికగా బ్రెజిల్, రష్యా, చైనా, భారత్, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల సదస్సు సెప్టెంబర్ 14 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. పట్టణీకరణ, పెట్టుబడుల ఆకర్షణ, కొత్త పట్టణాల నిర్మాణం తదితర అంశాలపై బ్రిక్స్ సదస్సులో చర్చించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ వెల్లడించారు.

Pages