బిజినెస్

వరుస లాభాల్లో సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 14: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 126.93 పాయింట్లు పెరిగి 27,942.11 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 45.50 పాయింట్లు అందుకుని 8,565 వద్ద నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాల మధ్య మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలోనే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, పిఎస్‌యు, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 2.16 శాతం నుంచి 1.01 శాతం మేర పెరిగింది. ఇతర ఆసియా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లో ముగియగా, ఐరోపా మార్కెట్లలో కూడా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ సూచీలు లాభాలను అందుకున్నాయి.