బిజినెస్

ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: బాత్‌రూమ్ ఉత్పత్తుల తయారీదారు సెరా సానిటరీవేర్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 36.59 శాతం పెరిగింది. 21.39 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఇదే వ్యవధిలో 15.66 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. స్టాండలోన్ నికర అమ్మకాలు ఈసారి 223.94 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 199.62 కోట్ల రూపాయలుగా ఉంది.
టివి18 బ్రాడ్‌కాస్ట్
మీడియా రంగ సంస్థ టివి18 బ్రాడ్‌కాస్ట్ ఏకీకృత నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 14.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇదే సమయంలో 8.61 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 210.7 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 273 కోట్ల రూపాయలుగా ఉంది.
నెట్‌వర్క్18 మీడియా
నెట్‌వర్క్18 మీడియా అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ ఏకీకృత నికర నష్టం ఈ జూన్ 30తో ముగిసిన మూడు నెలల కాలంలో 49.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 42.84 కోట్ల రూపాయల నికర లాభం సంస్థ అందుకుంది. ఏకీకృత ఆదాయం ఈసారి 351.89 కోట్ల రూపాయలుగా, పోయినసారి 411.08 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక సంస్థ వ్యయం ఈసారి 440.65 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి ఇది 474.49 కోట్ల రూపాయలుగా ఉంది.