S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/21/2016 - 08:33

హైదరాబాద్, జూలై 20: జార్ఖండ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువరదాస్ మదుపరులకు పిలుపునిచ్చారు. తమ పారిశ్రామిక విధానం సరళీకృతంగా ఉందని ఆయన చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన జార్ఖండ్ ఇనె్వస్ట్‌మెం ట్ రోడ్‌షో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జార్ఖండ్ ప్రభుత్వంతో ఒరాకిల్, శ్రీ సిమెంట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

07/21/2016 - 08:31

ఒంగోలు, జూలై 20: ప్రకాశం జిల్లాలోని దొనకొండలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో విమానాలు, హెలికాప్టర్ల తయారి పరిశ్రమను స్థాపించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. బుధవారం ఒంగోలులోని మంత్రి నివాసంలో ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మర్యాద పూర్వకంగా కలిసింది.

07/21/2016 - 08:30

ముంబయి, జూలై 20: ప్రమాదకర స్థాయికి చేరిన మొండి బకాయిలను వదిలించుకోవడంలో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. బుధవారం అమెరికాకు చెందిన సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌తో కలిసి 7,350 కోట్ల రూపాయల ఒత్తిడి ఆస్తుల నిధిని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎస్‌బిఐ నికర నిరర్థక ఆస్తులు 55,807 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. కాగా, ఇప్పటికే కొటక్ మహీంద్ర బ్యాంక్..

07/21/2016 - 08:26

ముంబయి, జూలై 20: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ ఔషధరంగ సంస్థలు సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్, అరబిందో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొలెస్ట్రాల్ డ్రగ్ క్రెస్టర్‌కు చెందిన జనరిక్ వెర్షన్స్ అమ్మకాలను అమెరికా మార్కెట్‌లో చేసుకోవచ్చని ఆ దేశ హెల్త్ రెగ్యులేటర్ యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతినివ్వడం మదుపరులను ఉత్సాహపరిచింది.

07/21/2016 - 08:25

కాకినాడ, జూలై 20: వంట నూనె మొదలుకొని వాహనాలకు వాడే ఇంధనం వరకు సర్వం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆయిల్ మాఫియా ఆడుకుంటోంది. ముఖ్యంగా నాణ్యతలేని వంటనూనెలతో ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతోంది. అటు కల్తీ పెట్రోల్, డీజిల్ కారణంగా వాహనాలకు, పర్యావరణానికీ ముప్పు తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరం కేంద్రంగా ఆయిల్ మాఫియా కొనే్నళ్లుగా చెలరేగిపోతోంది.

07/20/2016 - 07:50

న్యూఢిల్లీ, జూలై 19: ఎస్‌బిఐ, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌సహా మొత్తం 13 ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం దాదాపు 23 వేల కోట్ల రూపాయల మూలధనాన్ని కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సాయంలో ఇది తొలి విడత అవగా, బ్యాంకుల పనితీరుపైనే మరిన్ని నిధులు ఇవ్వాలా? వద్దా?

07/20/2016 - 07:48

ముంబయి, జూలై 19: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. 13 ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం మూలధన సాయంగా 23 వేల కోట్ల రూపాయలను అందించడం మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

07/20/2016 - 07:47

బెంగళూరు, జూలై 19: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన విప్రో ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను మంగళవారం ఇక్కడ విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 2,052 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 2,192 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది.

07/20/2016 - 07:46

ముంబయి, జూలై 19: ముంబయిలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక ఆలయం.. డిమ్యాట్ అకౌంట్‌ను తెరిచింది. ఇదేంటి వినాయకుడేమైనా స్టాక్ మార్కెట్ లావాదేవీల్లోకి వెళ్తున్నాడా? అనుకుంటున్నారా.. అదేం కాదండి. ఎంతో శక్తివంతమైన దేవుడిగా పేరున్న సిద్ధివినాయకుడి భక్తుల్లో సంపన్నులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు అధికం. ఈ నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు ఈ డిమ్యాట్ ఖాతాను ప్రారంభించారు.

07/20/2016 - 07:46

విశాఖపట్నం, జూలై 19: యువ శాస్తవ్రేత్తలను ప్రోత్సహించేందుకు జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 1,023 కోట్ల రూపాయల ఖర్చుతో ఇన్నోవేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని రాంకీ ఇండియా లిమిటెడ్ సిఇఒ డాక్టర్ పి లాల్‌కృష్ణ తెలిపారు. రాంకీ కమర్షియల్ హబ్‌లో మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. సైంటిస్టులు ఔషధ ఫార్ములాలను తయారు చేసేందుకు కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుందన్నారు.

Pages