S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/23/2016 - 00:42

ముంబయి, జూలై 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 92.72 పాయింట్లు పుంజుకుని 27,803.24 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.10 పాయింట్లు పెరిగి 8,541.20 వద్ద నిలిచింది.

07/22/2016 - 01:25

న్యూఢిల్లీ, జూలై 21: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవిఎం)ను ఉత్పత్తి చేసేలా స్టార్టప్‌లను ప్రోత్సహించాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు యోచిస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17తోపాటు వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు (2017-18, 2018-19)గాను ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ యూనిట్ల (వివిపిఎటి) సమీకరణకూ ఆలోచిస్తోంది.

07/22/2016 - 01:25

న్యూఢిల్లీ, జూలై 21: పాన్ కార్డు లేకుండానే భారీగా లావాదేవీలు జరిగాయని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఈ లావాదేవీలు 90 లక్షల వరకు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా తెలుస్తోంది. ఇందులో సంస్థాగత లావాదేవీలతోపాటు వ్యక్తిగత లావాదేవీలు కూడా ఉండగా, త్వరలోనే వీటన్నింటికీ ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయనుంది. దీనికి సంబంధించి 7 లక్షల నోటీసులు జారీ అయ్యే అవకాశాలుండటం గమనార్హం.

,
07/22/2016 - 01:24

న్యూయార్క్, జూలై 21: ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలకు సంబంధించి ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫార్చూన్ 500 జాబితాలో ఏడు భారతీయ సంస్థలకు చోటు దక్కింది. రెవిన్యూ ఆధారంగా రూపొందిన ఈ జాబితాలో ఉన్న భారతీయ సంస్థల్లో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలైతే, మూడు ప్రైవేట్‌రంగ సంస్థలు.

07/22/2016 - 01:22

ముంబయి, జూలై 21: దేశీయంగా ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 20.2 శాతం పెరిగి 3,239 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 2,695.72 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 19,322.63 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 16,502.97 కోట్ల రూపాయలుగా ఉంది.

07/22/2016 - 01:20

న్యూఢిల్లీ, జూలై 21: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో క్రిందటిసారితో చూస్తే 10 శాతం వృద్ధి చెంది 2,384.67 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 2,166 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు ఈసారి 13,156.68 కోట్ల రూపాయలుగా, పోయినసారి 12,150.48 కోట్ల రూపాయలుగా ఉంది.

07/22/2016 - 01:19

న్యూఢిల్లీ, జూలై 21: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే నాలుగింతలు పెరగడం గమనార్హం. 741.97 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 189.78 కోట్ల రూపాయల లాభానికే బ్యాంక్ పరిమితమైంది.

07/22/2016 - 01:16

విజయవాడ, జూలై 21: దేశంలోనే తొలి ఈ-సైకిల్‌ను చెన్నైకి చెందిన ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అనూప్ నిశాంత్ రూపొందించగా, ఈ సైకిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు గురువారం తీసుకువచ్చాడు. వోల్టా పేరుతో రూపొందించిన ఈ సైకిల్ గురించి నిశాంత్ పది నిమిషాలపాటు డెమో ఇచ్చాడు. అవకాశం ఇస్తే శ్రీసిటీలో ఈ-సైకిల్ పరిశ్రమను స్థాపిస్తానని నిశాంత్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించాడు.

07/22/2016 - 01:14

ముంబయి, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకులైన హెచ్‌డిఎఫ్‌సి, కొటక్ మహీంద్ర త్రైమాసిక ఫలితాలు మదుపరులకు మొండి బకాయిలపై ఆందోళనలను కలిగించాయి. దీంతో పెట్టుబడుల ఉపసంహరణకు దిగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు నెల రోజుల కనిష్టాన్ని తాకుతూ 205.37 పాయింట్లు దిగజారి 27,710.52 వద్ద నిలిచింది.

07/22/2016 - 01:12

హైదరాబాద్, జూలై 21: వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) లో 10,000 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుంటామన్న ఆశాభావాన్ని ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డైరీ వ్యక్తం చేసింది. గురువారం ఇక్కడ సంస్థ పాల విభాగం వ్యాపారాధిపతి సందీప్ ఘోష్ విలేఖరులతో మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ టర్నోవర్ 7,186 కోట్ల రూపాయలుగా నమోదైందన్నారు. డైరీ విభాగం నుంచే దాదాపు 75 శాతం టర్నోవర్ వస్తోందని చెప్పారు.

Pages