S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/26/2016 - 05:22

బెంగళూరు, జూలై 25: విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. సోమవారం బ్యాంకుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. తమతో జరిగిన మాస్టర్ డెట్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ (ఎమ్‌డిఆర్‌ఎ) షరతులను బ్యాంకులు మీరాయని, అనవసరమైన రాద్ధాంతంతో తమ వ్యాపారాన్ని దెబ్బతీశాయని అసహనం వ్యక్తం చేసింది.

07/26/2016 - 05:19

హైదరాబాద్, జూలై 25: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల వల్ల వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తెలిపారు.

07/26/2016 - 05:15

విజయవాడ, జూలై 25: మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సమీకరించడానికి ప్రభుత్వం 185 జిఓను జారీ చేసింది. దీన్ని సోమవారం గెజిట్‌లో ప్రచురించింది. రాజధాని అమరావతికి సుమారు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సునాయాసంగా సేకరించింది. ఇదే తరహాలో మచిలీపట్నం పోర్టు, కారిడార్‌కు భూమిని సమీకరించాలని భావిస్తోంది. కానీ అమరావతిలో భూసమీకరణకు, మచిలీపట్నంలో భూసమీకరణకు చాలా తేడా ఉంది.

07/26/2016 - 05:12

ముంబయి, జూలై 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 292.10 పాయింట్లు పెరిగి 28,095.34 వద్ద స్థిరపడగా, ఆగస్టు 10 నుంచి చూస్తే ఇది గరిష్ఠ స్థాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 94.45 పాయింట్లు ఎగిసి 8,635.65 వద్ద నిలిచి 15 నెలల గరిష్ఠాన్ని తాకింది.

07/26/2016 - 05:11

విశాఖపట్నం, జూలై 25: హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ తమ తొలి బొగ్గు ఆధారిత ప్రాజెక్టును సోమవారం ప్రారంభించింది. హిందు జా గ్రూప్‌లో భాగమైన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ సంస్థ (హెచ్‌ఎన్‌పిసిఎల్) విశాఖలోని తమ 1,040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు వెల్లడించింది. 520 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ వివరించింది.

07/25/2016 - 08:07

న్యూఢిల్లీ, జూలై 24: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

07/25/2016 - 07:41

రాజమహేంద్రవరం, జూలై 24: తూర్పు కనుమల్లో కాంతి రేఖ విరిసింది.. ఆదివాసీ యువతులు పారిశ్రామికవేత్తలుగా ముందడుగు వేస్తున్నారు.. ఎల్‌ఇడి బల్బులు తయారుచేసే స్థాయికెదిగారు.. రంపచోడవరంలో ఎల్‌ఇడి బల్బులు తయారుచేసే ప్రాజెక్టుకు గిరిజన మహిళలే యజమానులు. రంపచోడవరం గిరిజన మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఐటిడిఏ పెట్టుబడితో, బెంగళూరుకు చెందిన సంస్థ ప్రోత్సాహంతో గిరిజన మహిళలు ఉత్పత్తిదా రులుగా మారారు.

07/25/2016 - 07:40

న్యూఢిల్లీ, జూలై 24: పదేళ్లకుపైబడిన డీజిల్ ఆధారిత వాహనాలను స్క్రాపింగ్ చేయడం ద్వారా దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందంటే ఆశ్చ ర్యం అనిపిస్తోంది అని దేశీయ ఆటోరంగ దిగ్గజం మారు తి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ అన్నారు. నిజానికి ఈ నిర్ణయం వల్ల భారత ఆటో పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక ఈ నిర్ణయం..

07/25/2016 - 07:40

న్యూఢిల్లీ, జూలై 24: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను వివిధ సంస్థలు ప్రకటించే త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న అంచనాలు, పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందగలదన్న ఆశాభావం భారతీయ మార్కెట్లలోకి విదేశీ మదుపరుల పెట్టుబడులను రప్పించాయ. ఈ నెలలో ఇప్పటిదాకా 2 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ పెట్టుబడులు భారతీయ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చాయ.

07/25/2016 - 07:39

న్యూఢిల్లీ, జూలై 24: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) పరిశీలనకు 12 విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలు రానున్నాయి. వచ్చే నెల 2న జరిగే సమావేశంలో ఎఫ్‌ఐపిబి ఈ పనె్నండింటిని పరిశీలిస్తుంది.

Pages