S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/16/2016 - 23:53

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రముఖ ఔషధరంగ సంస్థ పిరామల్ ఎంటర్‌ప్రైజెస్.. అమెరికాకు చెందిన కాంట్రాక్టు డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ యాష్ స్టీవెన్స్‌ను హస్తగతం చేసుకుంటోంది. యాష్ స్టీవెన్స్‌కు 350 కోట్ల రూపాయలకుపైగా (52.95 మిలియన్ డాలర్లు) ఇందుకు పిరామల్ చెల్లిస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరిందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పిరామల్ తెలిపింది.

08/16/2016 - 23:52

ముంబయి, ఆగస్టు 16: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనం, నిరాశపరిచిన దేశ స్థూల ఆర్థిక గణాంకాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 87.79 పాయింట్లు పడిపోయి 28,064.61 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 29.60 పాయింట్లు కోల్పోయి 8,642.55 వద్ద నిలిచింది.

08/16/2016 - 23:52

న్యూఢిల్లీ, ఆగస్టు 16: టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెల జూలైలో 23 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 3.55 శాతానికి ఎగిసింది. 2014 ఆగస్టులో 3.74 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లోకి చేరింది. ఇక అంతకుముందు నెల జూన్‌లో ఇది 1.62 శాతంగానే ఉండగా, నిరుడు జూలైలో -4.00 శాతంగా ఉంది. పెరిగిన ఆహారోత్పత్తుల ధరలే తాజా పెరుగుదలకు కారణం.

08/16/2016 - 23:51

న్యూఢిల్లీ, ఆగస్టు 16: న్యూయార్క్‌లోని సహారా గ్రూప్‌నకు చెందిన సుప్రసిద్ధ ప్లాజా హోటల్.. ప్రపంచంలోని అత్యుత్తమ విలాసవంతమైన విడిదిలలో ఒకటిగా నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అపరు కుబేరుల్లో అత్యధికులు ఈ హోటల్‌లో విడిది చేసేందుకు ఇష్ట పడతారని తేలింది. దీనికి సంబంధించిన జాబితాలో ప్లాజా మూడో స్థానంలో ఉంది.

08/16/2016 - 23:57

న్యూఢిల్లీ, ఆగస్టు 16: విధి నిర్వహణలో నిజాయితీ ప్రదర్శించిన ఉద్యోగికి పదోన్నతి కల్పించి ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా హేట్సాప్ అనిపించుకుంది. ఎయిర్ ఇండియా చరిత్రలో ఈ తరహా ప్రమోషన్ ఇవ్వడం ఇదే మొదటిసారవగా, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెక్యురిటీ విభాగంలో పనిచేస్తున్న సుభాష్ చందర్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

08/16/2016 - 23:48

ముంబయి, ఆగస్టు 16: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పైస్థాయి ఉద్యోగుల కంటే కిందిస్థాయి ఉద్యోగులకే జీతాలు అధికంగా వస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇందుకు తాను కూడా మినహాయింపు కాదని చెప్పారు.

08/16/2016 - 23:46

హైదరాబాద్, ఆగస్టు 16: ప్రయాణ అవసరాలకు అనుగుణంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మొబైల్ యాప్ ఓలా క్యాబ్స్.. మంగళవారం ఓలా రెంటల్స్‌ను ఆవిష్కరించింది. గంటల లెక్కన ప్యాకేజీ ఇస్తున్నట్లు ఆ సంస్థ సిఎంఒ రఘువేష్ సరూప్ తెలిపారు. ఓలా లగ్జరీ, ఓలా ప్రైమ్, ఎస్‌యువితోపాటు ఓలా మినీ సర్వీసులు ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 35 నగరాల్లో అందుబాటులోకి తెచ్చామని, త్వరలో వంద నగరాలకు విస్తరిస్తామన్నారు.

08/16/2016 - 23:45

హైదరాబాద్, ఆగస్టు 16: మోటార్ సైకిల్ విభాగంలో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ.. హోండా మోటార్ సైకిల్ స్కూటర్ ఇండియా తమ డ్రీమ్ యుగ బైక్ కలర్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది సరికొత్తగా పరిచయం చేసింది. బ్లాక్ విత్ అథాంటిక్ బ్లూ మెటాలిక్‌ను జోడించి దీన్ని ఆవిష్కరించామని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు.

08/16/2016 - 23:45

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 33 శాతం పెరిగి 1,801.77 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,355.64 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 6,119.86 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,689.88 కోట్ల రూపాయలుగా ఉంది.

08/16/2016 - 16:43

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 88 పాయింట్లు కోల్పోయి 28,064 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 8,642 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.82 వద్ద కొనసాగుతోంది.

Pages