బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 16: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనం, నిరాశపరిచిన దేశ స్థూల ఆర్థిక గణాంకాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 87.79 పాయింట్లు పడిపోయి 28,064.61 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 29.60 పాయింట్లు కోల్పోయి 8,642.55 వద్ద నిలిచింది.
ద్రవ్యోల్బణం గణాంకాలు పెరగడం, పారిశ్రామికోత్పత్తి సూచీ వృద్ధిరేటు క్షీణించడం వంటివి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. జూలై నెలకుగాను గత శుక్రవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 6.07 శాతానికి పెరిగితే, జూన్ నెలకుగాను వెల్లడైన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) 2.1 శాతానికి దిగజారినది తెలిసిందే. ఇకపోతే ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు కూడా 0.09 శాతం నుంచి 0.49 శాతం మేర నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.04 శాతం నుంచి 0.13 శాతం మధ్య పడిపోయాయి.