బిజినెస్

23 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గత నెల జూలైలో 23 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 3.55 శాతానికి ఎగిసింది. 2014 ఆగస్టులో 3.74 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ స్థాయి దరిదాపుల్లోకి చేరింది. ఇక అంతకుముందు నెల జూన్‌లో ఇది 1.62 శాతంగానే ఉండగా, నిరుడు జూలైలో -4.00 శాతంగా ఉంది. పెరిగిన ఆహారోత్పత్తుల ధరలే తాజా పెరుగుదలకు కారణం. మంగళవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలను పరిశీలిస్తే బంగాళదుంప ధర 58.78 శాతం, పప్పుదాన్యాలు 35.76 శాతం, కూరగాయలు 28.05 శాతం, తృణధాన్యాలు 7.03 శాతం చొప్పున పెరిగాయి. అలాగే చక్కెర ధర 32.33 శాతం, పండ్ల ధర 17.30 శాతం మేర ఎగబాకింది. ఇదిలావుంటే టోకు ద్రవ్యోల్బణం మరింత పెరిగితే, ఆ ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై చూపుతుందని ఇదే జరిగితే ప్రజలకు ధరాఘాతం తప్పదని పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఖరీఫ్‌లో పంట దిగుబడులు పెరిగితే పరిస్థితులు మారవచ్చని ఐసిఆర్‌ఎ లిమిటెడ్ సీనియర్ ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. కాగా, వడ్డీరేట్ల తగ్గింపులు మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చని కేర్ రేటింగ్ అంచనా వేసింది.