బిజినెస్

యాష్ స్టీవెన్స్.. పిరామల్ హస్తగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: ప్రముఖ ఔషధరంగ సంస్థ పిరామల్ ఎంటర్‌ప్రైజెస్.. అమెరికాకు చెందిన కాంట్రాక్టు డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ యాష్ స్టీవెన్స్‌ను హస్తగతం చేసుకుంటోంది. యాష్ స్టీవెన్స్‌కు 350 కోట్ల రూపాయలకుపైగా (52.95 మిలియన్ డాలర్లు) ఇందుకు పిరామల్ చెల్లిస్తోంది. దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదిరిందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు పిరామల్ తెలిపింది. నగదు రూపంలోనే ఈ లావాదేవీ ముగుస్తుందని వివరించింది. యాష్ స్టీవెన్స్‌ను కొనుగోలు చేయడం వల్ల సంస్థకు లాభం చేకూరుతుందన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా పిరామల్ వ్యక్తం చేసింది. మరోవైపు ఈ లావాదేవీతో పిరామల్ షేర్ విలువ పుంజుకుంది.