S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథా సాగరం

05/04/2018 - 14:34

ఒక పడవలో ఒక వివేకవంతుడు, అతని పక్కనే ఒక మామూలు మనిషి ప్రయాణిస్తున్నారు. మామూలు మనిషి ఎగసి పడుతున్న అలల్ని, అవి చేసే ధ్వనుల్ని భరించలేక పోతున్నాడు. వివేకవంతుడు నిర్మలంగా కూచున్నాడు.
మామూలు మనిషి, ‘ఈ అలల శబ్దం ఎంత కర్ణకఠోరంగా ఉంది. ఎంత దారుణంగా ఉంది. దీన్ని భరించలేకపోతున్నానంటే నమ్మండి’ అంటూ చిరాకు ప్రకటించాడు.
వివేకవంతుడు ‘అవునా?’ అన్నాడు.

04/28/2018 - 21:13

హైదరాబాద్‌లో ఒక జడ్జి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ న్యాయస్థానానికి అంటిపెట్టుకుని వుండేవాడు. ఒకసారి లంచ్ టైంలో వీధిలో ఒక కుర్రాడు పాట పాడటం వినిపించింది. ఆ కుర్రాడు అసభ్య పదజాలం నిండిన ఆ పాటను పాడుతున్నాడు.
జడ్జి మనిషిని పంపి ఆ కుర్రాణ్ణి పిలిపించి ఆ పాటను పాడమన్నాడు. మళ్లీ పాడమన్నాడు. ఇంకోసారి పాడమన్నాడు. నాలుగోసారి, ఐదోసారి అట్లా చాలాసార్లు పాడించుకుని విన్నాడు.

04/07/2018 - 22:43

హజ్రత్ బయాజిద్ ఒకసారి దైవచింతనలో మునిగిపోయి, తనను తాను మరచిపోయాడు. ఏవుడు తప్ప అతనికి మరేమీ కనిపించలేదు.
పరవశంతో ‘నేనే దేవుణ్ణి! నేనే దేవుణ్ణి’ అని అరిచాడు.
దగ్గరే వున్న జనం ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు.
‘గౌరవనీయులయిన బయాజిద్‌గారూ! మీరింతకు ముందు అన్న మాటలకు మీకు అర్థం తెలుసా?’ అన్నారు. అప్పుడు బయాజిద్ మామూలు స్థితిలో వున్నారు.

03/31/2018 - 21:33

ఒక ఫకీరు ఒక చెట్టు కింద చల్లని నీడలో కూచుని ముస్లిం చట్టాలలోని ముఖ్యమయిన అంశాల గురించి చర్చిస్తున్నారు. చుట్టూ ఎందరో గొప్ప విద్యావంతులు, కాజీలు చేరి ఆ చర్చలో పాల్గొన్నారు. అందరూ గంభీరంగా న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారు.

03/24/2018 - 20:38

ఒక గొప్ప సుల్తాన్ సమస్య ఐశ్వర్యాలు సమకూరిన అదృష్టవంతుడు వుండేవాడు. అయినా ఆయనకు జీవితానికి ఎందుకో అర్థం లేదనిపించింది. ప్రయోజనం లేదనిపించింది. మూడు ప్రశ్నలు ఆయన్ని పీడించేవి. వాటికి సమాధానాల కోసం తపించాడు.
1.నేను ఏం చేయాలి?
2.నేను ఎవరితో కలిసి దేవుడు చెప్పినట్లు చేయాలి?
3.నేను ఎప్పుడు చేయాలి?

03/11/2018 - 05:32

వౌలానా రూమీ, ఫామ్స్ తబ్రీజ్ మొదటి కలయిక. ఆ ఇద్దరు జ్ఞానుల కలయిక గురించి వివిధ రకమయిన కథనాలు ఉన్నాయి. కానీ ఇది ఆసక్తికరమైంది.
రూమీ గాఢమయిన అధ్యయనంలో ఉన్నాడు. ఒక ఇస్లాం ధర్మగ్రంథ పారాయణంలో వున్నాడు.
అప్పుడు అక్కడికి ఫామ్స్ తబ్రీజ్ వచ్చాడు. రూమీ పుస్తకం చదవడం చూశాడు. ‘ఏం చదువుతున్నావు?’ అని అడిగాడు.

03/04/2018 - 20:33

ఒక కప్పల గుంపు చెట్ల గుండా ఎక్కడికో వెళుతోంది. దారిలో ఒక గుంత వుంటే రెండు కప్పలు దాంట్లో జారిపడిపోయాయి.
ఆ రెండు కప్పలూ ఆ గోతి నించి బయటపడడానికి ప్రయత్నించాయి. గట్టు గుండా పాకుతూ పైకి రావడానికి ప్రయత్నించాయి. ప్రతిసారీ జారి మళ్లీ నీళ్లలో పడిపోతున్నాయి.

02/24/2018 - 21:58

ఒక గృహస్థుని ఇంట్లో ఒక రామచిలుక ఉండేది. పంజరంలో నించి ముద్దుముద్దుగా మాట్లాడేది. దాని యజమాని, భార్యా పిల్లలు దాన్ని ప్రేమగా చూసుకునే వాళ్లు. దానితో మాట్లాడి కాలక్షేపం చేసేవాళ్లు. ఆ గృహస్థు వ్యాపారస్థుడు. పొరుగు వూళ్లకు వెళ్లి వ్యాపారం చేసేవాడు. వస్తూ ఇంట్లో వాళ్లకు, రామ చిలుకకు కావలసినవి తీసుకొచ్చేవాడు.

02/04/2018 - 00:11

ఒక వ్యక్తి సత్యానే్వషణలో పడి జీవిత రహస్యం గ్రహించడానికి ఒక సూఫీ గురువు దగ్గరకు వచ్చాడు. జీవిత రహస్యం తనకు తెలిసే మార్గం చూపమని అభ్యర్థించాడు.

01/06/2018 - 20:57

హసన్ సూఫీ మార్మికుడు. ఆయనకు ఒక కొడుకు వుండేవాడు. యిరవయ్యేళ్లవాడు. అందరికీ ఆ కుర్రవాడంటే ఎంతో ఇష్టం. అతను అందగాడు. ఆహ్లాదంగా చిరునవ్వు నవ్వేవాడు. అతన్తో మాట్లాడడమన్నా అందరికీ ఇష్టం. అతని ఆకర్షణీయమైన రూపం ముచ్చటగొలిపేది. అతని సమవయస్కులతో ఆటలతో పాటలతో ఆనందంగా గడిపేవాడు. అతను తిరిగే వీధులు, అతని కుటుంబం అతని వునికిలో ఉల్లాసంగా వుండేవి.

Pages