S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూడు ప్రశ్నలు

ఒక గొప్ప సుల్తాన్ సమస్య ఐశ్వర్యాలు సమకూరిన అదృష్టవంతుడు వుండేవాడు. అయినా ఆయనకు జీవితానికి ఎందుకో అర్థం లేదనిపించింది. ప్రయోజనం లేదనిపించింది. మూడు ప్రశ్నలు ఆయన్ని పీడించేవి. వాటికి సమాధానాల కోసం తపించాడు.
1.నేను ఏం చేయాలి?
2.నేను ఎవరితో కలిసి దేవుడు చెప్పినట్లు చేయాలి?
3.నేను ఎప్పుడు చేయాలి?
సుల్తాన్ ఎందరో జ్ఞానుల్ని, వివేకవంతుల్ని ఆ మూడు ప్రశ్నలకు సరయిన సమాధానమివ్వమని అడిగాడు. వాళ్లకు వీలుపడలేదు. వాళ్లంతా ఒక ఛిస్తి దర్వీష్ దూర ప్రాంతంలో వున్నాడని అతనొక్కడే మీ ప్రశ్నలకు సరైన సమాధాన మివ్వగలవాడని అన్నారు. వెంటనే సుల్తాన్ ఒంటరిగా బయలుదేరి దూర ప్రయాణం చేసి ఆ దర్వీష్ వున్న ఊరు చేరాడు.
ఆ దర్వీష్ మామూలు రైతులా తన పొలం దున్నుకుంటూ కనిపించాడు. ఆయన ఒక పర్షియన్ పద్యం పాడుకుంటూ కనిపించాడు. సుల్తాన్ ఆ నిరుపేద లాంటి దర్వీష్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. దర్వీష్ పాడుతున్న పద్యానికి అర్థమిది.
‘జ్ఞానాన్ని మించి పని ఉంది. ఆ విషయం తెలుసుకుని వెళ్లు. వజ్రాల కోసం అనే్వషించకు. వజ్రాల గనిలా ఉండు. హృదయం తాత్కాలిక నివాసం, దాన్ని వదిలిరా! ఆత్మ శాశ్వత నివాసం, ఆ విషయం తెలుసుకుని వెళ్లు’
సుల్తాన్ ఆ పద్యాన్ని విన్నాడు. కానీ దాని పట్ల ఆసక్తి ప్రదర్శించలేదు. దర్వీష్‌ని తన మూడు ప్రశ్నల గురించి అడిగాడు. దర్వీష్ అదేమీ పట్టించుకోకుండా తన పొలం దున్నడంలో మునిగిపోయాడు.
‘నేనెవర్నో నీకు తెలుసా? నేను సుల్తాన్‌లకే సుల్తాన్‌ని.’ అయినా దర్వీష్ లెక్కపెట్టకుండా పొలం పనిలో మునిగాడు.
దాదాపు సుల్తాన్ అదుపు తప్పే పరిస్థితిలో పడ్డాడు.
అంతలో హఠాత్తుగా ఒక గాయాలు తగిలిన వ్యక్తి సుల్తాన్ ముందు దభీమని పడ్డాడు. ఆ శబ్దం విని పొలం పని ఆపి పరిగెట్టుకుంటూ కింద పడిన వ్యక్తి దగ్గరకు వచ్చి సుల్తాన్‌ని చూసి ‘ఇతన్ని నా ఇంటిదాకా మోసుకు వెళ్లడానికి సాయపడండి’ అన్నాడు.
సుల్తాన్ ‘తప్పక సాయపడతాను. అయితే నా మూడు ప్రశ్నలకు సమాధానమివ్వాలి’ అన్నాడు.
దర్వీష్ ‘ఆ విషయం తరువాత చూద్దాం’ అన్నాడు.
దర్వీష్, సుల్తాన్ ఇద్దరూ కలిసి ఆ వ్యక్తిని దర్వీష్ ఇంటిదాకా మోసుకొచ్చారు. దర్వీష్, సుల్తాన్ ఇద్దరూ కలిసి ఆ గాయపడిన వ్యక్తి గాయాలను కడిగి మందులు పూశారు.
ఆ పని పూర్తయ్యాక సుల్తాన్ ‘ఇప్పుడు నా మూడు ప్రశ్నలకి సమాధానమివ్వాలి’ అంటూ తన ప్రశ్నల్ని ఏకరువు పెట్టాడు. దర్వీష్ ఆ ప్రశ్నలు విని ‘మీరు మీ రాజధానికి తిరిగి వెళ్లవచ్చు. ఎందుకంటే మీ మూడు ప్రశ్నలకు సమాధానాలు అందుకున్నారు’ అన్నాడు.
సుల్తాన్ ఆశ్చర్యంగా ‘ఏ విధంగా?’ అన్నాడు.
దర్వీష్ ‘మీరు ఏం చెయాలి?’ అని అడిగారు. మీకు దారిలో ఏ పని ఎదురయితే ఆ పని చేయాలి. ఆ పని మీరు చేశారు. రెండు మీరు దైవాదేశం ప్రకారం గాయపడిన వ్యక్తికి నాతో కలిసి సేవ చేశారు. మూడు ఏ క్షణం చేశారంటే అది సంభవించిన క్షణం ఆ పని చేశారు. జీవితానికి ఇదే అర్థం’ అన్నాడు.
సుల్తాన్ ఆ సమాధానాల్తో సంతృప్తి పడ్డాడు.

- సౌభాగ్య, 9848157909