S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథా సాగరం

12/23/2017 - 21:52

సృష్టి విచిత్రమయింది. మనోహరమైంది. వైవిధ్య భరితమయింది. ప్రతి మనిషీ ప్రత్యేకత కలిగినవాడే. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఎవర్నీ ఎవరితో పోల్చడానికి లేదు.
సృష్టిలోని ఆ అనంత వైవిధ్యమే మనల్ని చైతన్యవంతుల్ని చేస్తుంది. ఆసక్తిని రేపుతుంది. ప్రతిదీ సృష్టిలో అర్థవంతమైందే.

12/17/2017 - 00:51

ఒక కొండపైన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక బలమైన దృఢమైన గోడ ఉంది. ఒక సూఫీ గురువు ఆ గోడ మీద కూచుని ప్రార్థన చేసుకున్నాడు.
ఏదో శబ్దం వస్తే అటువేపు చూశాడు. ఆ చివర గోడపై ఒక వ్యక్తి కూచుని గోడలోని ఇటుకలు లాగుతూ గోడ కింద పదడుగుల దూరంలో ఉన్న నీటి కాలువలో విసురుతున్నాడు.

12/03/2017 - 00:04

ఒక వేటగాడు అడవికి వెళ్లాడు. దారిలో ఒక చెట్టు కింద అతనికి ఒక పుర్రె కనిపించింది. బాగా ఎండగా వుండటంతో విశ్రాంతి కోసం అతను చెట్టు కింద కూచున్నాడు. పక్కనే కపాలముంది. అది అక్కడ ఎందుకుందో అతనికి అర్థం కాలేదు.
అతను ఎంతో దూరం నడవడం వల్ల అలసిపోయాడు. నిర్జనమైన ఆ ప్రదేశంలో ఎవరూ పలకరించడానిక్కూడా లేరు. నిశ్శబ్దం. మాట్లాడ్డానికి ఎవరూ లేకపోవడంతో పక్కనున్న పుర్రెను చూసి అతను ‘హలో’ అన్నాడు.

11/25/2017 - 21:38

జ్ఞానమన్నది పుస్తకాల ద్వారానో, వయసు పెరగడం ద్వారానో వచ్చేది కాదు. వస్తు జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం వాటివల్ల సమకూరవచ్చు.
వివేకం అలాంటిది కాదు. అది పుస్తకాల ద్వారా అనే్వషణ ద్వారా సమకూరేది కాదు. అది ఇతరుల నించి ఆదుకునేది కాదు. అది మనలోనే ఉంటుంది. అది అందరిలో ఉంటుంది. దానికి ప్రపంచం అడ్డంగా ఉంటుంది. అనుభవాలు ఆటంకంగా ఉంటాయి. అది సహజాతం లాంటిది. ఆ అడ్డంకుల్ని తొలగిస్తే అది బహిరంగమవుతుంది.

Pages