S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/29/2016 - 16:00

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహానియాకు బెయిల్ లభించింది. ఆయనకు సాకేత్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. గతవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దినేశ్ మోహానియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో ఎమ్మెల్యే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

06/29/2016 - 14:21

దిల్లీ: ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రూప్-1 పరీక్షలను మూడు నెలల్లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టులోని ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. ఎపిపిఎస్‌సి, టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఈ పరీక్షలను నిర్వహిస్తారు. 2011 నోటిఫికేషన్ ప్రకారం అప్పటి సిలబస్ మేరకు తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలు జరపాలని న్యాయమూర్తులు చలమేశ్వర్, అభయ్ మనోహర్ ఆదేశించారు.

06/29/2016 - 14:19

దిల్లీ: వచ్చే నెల 18 నుంచి ఆగస్టు 12 వరకూ పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రాబోయే సమావేశంలో జిఎస్‌టి బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బుధవారం వ్యక్తం చేశారు. ‘నీట్’ సహా పెండింగ్‌లో ఉన్న మూడు ఆర్డినెన్స్‌లను సమావేశాల్లో ఆమోదించాల్సి ఉందన్నారు.

06/29/2016 - 12:25

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహరచన చేశారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ) అధికారులు పాతబస్తీలో బుధవారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ ఎత్తున మారణాయుధాలు, పేలుడు సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నారు.

06/29/2016 - 07:49

చెన్నై, జూన్ 28: దాదాపురెండున్నర గంటలపాటు తమ కుమార్తె రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్నా ఆమెను ఎవరూ పట్టించుకోలేదని దారుణ హత్యకు గురైన ఐటి ఉద్యోగిని స్వాతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంగంబాకం స్టేషన్ వద్ద నడిరోడ్డుపై ఈ దారుణ హత్య జరిగినా కూడా ప్రతి ఒక్కరూ వౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆమె తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు.

06/29/2016 - 07:44

బాలసోర్ (ఒడిశా), జూన్ 28: మన దేశం ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూతలంనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల కొత్త క్షిపణిని బుధవారం ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి తొలిసారిగా పరీక్షనున్నారు. ‘ఈ తొలి పరీక్షకు సన్నాహాలన్నీ తుది దశకు చేరుకున్నాయి. వాతావరణం గనుక అనుకూలిస్తే బుధవారం చాందీపూర్ ఐటిఆర్‌నుంచి ఈ పరీక్షను నిర్వహిస్తాం’ అని చాందీపూర్ ఐటిఆర్ అధికారి ఒకరు చెప్పారు.

06/29/2016 - 07:44

న్యూఢిల్లీ, జూన్ 28: దేశంలో స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతిలోని 377 సెక్షన్ రద్దుచేయాలంటూ పలువురు సెలబ్రిటీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ చెఫ్ రీతూ దాల్మియా, అమన్‌నాథ్, డాన్సర్ ఎన్‌ఎస్ జోహార్ తదితరులు కోర్టులో పిటిషన్ వేశారు. సెక్స్‌కూడా ప్రాథమిక హక్కుల్లో అంతర్గత భాగమేమని వారు చెప్పారు.

06/29/2016 - 06:47

న్యూఢిల్లీ,జూన్ 28: తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి కృష్ణా నదీ జలాల యాజమాన్యం బోర్డు సభ్య కార్యదర్శి ఆర్.కె.గుప్తాను తొలగించినట్లు తెలిసింది. కృష్ణా బోర్డు బాధ్యతలను తాత్కాలికంగా గోదావరి నదీ జలాల యాజమాన్యం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీకి అప్పగించినట్లు చెబుతున్నారు.

06/29/2016 - 06:43

న్యూఢిల్లీ, జూన్ 28: ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి జన ఔషధ దుకాణాల ఏర్పాటుకు కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖతో ఎపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి జన ఔషధ యోజన పథకం కింద మంగళవారం కేంద్రమంత్రి అనంత్ కుమార్, ఏపీ వైద్యమంత్రి కామినేని శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రతి మండలంలో ఓ జనరిక్ దుకాణం ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.

06/29/2016 - 07:39

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్ట్ర హైకోర్టు విభజన కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తానని బెదిరించటం ద్వారా తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మాదిరి వ్యవహరిస్తున్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ ఎద్దేవా చేశారు.

Pages