S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/30/2016 - 18:00

దిల్లీ: పార్లమెంటు లైబ్రరీ భవనంలో కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం ప్రారంభమైంది. శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై మోదీ సమీక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలను మంత్రులు ప్రధానికి అందజేశారు.

06/30/2016 - 17:56

శ్రీనగర్‌: శ్రీనగర్‌లో గురువారం ఎయిర్‌ ఇండియా ల్యాండ్‌ అవుతుండగా రెండు టైర్లు పేలాయి. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో సెంట్రల్‌ పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని విమానాశ్రయ పోలీసు అధికారి వెల్లడించారు.

06/30/2016 - 17:46

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శాసనసభ స్పీకర్ కవీందర్ గుప్తా సమక్షంలో గురువారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన అనంత్‌నాగ్ ఉపఎన్నికలో ఆమె ఎమ్మెల్యేగా 12వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆమె తన రాజకీయ జీవితంలో నాలుగోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

06/30/2016 - 15:59

లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఎదురుదెబ్బలు తగులున్నాయి. పార్టీ శాసనసభాపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య పార్టీకి గుడ్ బై చెప్పి 10 రోజులు గడవకముందే మాజీ మంత్రి ఆర్కే చౌదరి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు ముందు సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండడం పట్ల బీఎస్పీలో కలవరం రేపుతోంది. మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని నాయకులు ఆరోపించారు.

06/30/2016 - 15:09

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులపై వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. ఇటీవల వైకాపా నుంచి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు కలిగిస్తున్న పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోవాలని కోరుతూ వైకాపా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

06/30/2016 - 13:07

శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భద్రత దళాలకు, వేర్పాటువాద గెరిల్లాలకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు వేర్పాటువాదులను భద్రత సిబ్బంది మట్టుబెట్టారు. మల్లార గ్రామంలో గెరిల్లాలు దాగి ఉన్నట్లు భద్రత సిబ్బందికి సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది స్థానికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన గెరిల్లాలు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

06/30/2016 - 08:11

పి ఆర్‌సి ప్రకారం కేంద్ర ఉద్యోగులకు కొత్త వేతనాలు
వేతనాల అమలు : జనవరి 1, 2016
మొత్తం పెంపు : 23.55%
మొత్తం పెరుగుదలలో మూలవేతనం : 16%
అలవెన్సులు : 63%
పింఛన్లు : 24%
వార్షిక ఇంక్రిమెంట్ : 3%
కనీస వేతనం: రూ.18వేలు
గరిష్ట వేతనం (కాబినెట్ కార్యదర్శి): రూ.2.50లక్షలు
ఖజానాపై భారం : రూ.1,02,100 కోట్లు

06/30/2016 - 08:08

న్యూఢిల్లీ, జూన్ 29: అటవీ, పర్యావరణ అనుమతుల్లో ఇంకెంత మాత్రం జాప్యం జరగడానికి వీల్లేదని, వంద రోజుల్లోనే వాటిని ఆమోదించాలని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వంద రోజుల్లోనే పూర్తి చేసే విధంగా రాష్ట్ర విభాగాలు పని చేయాలని పిలుపునిచ్చారు.

06/30/2016 - 08:07

న్యూఢిల్లీ,జూన్ 29: తపాలా బిళ్లళపై మీ ఫొటోను లేదా మీ కంపెనీ లోగోను చూసుకోవాలని ఉందా? కేవలం పనె్నండు లక్షలు కడితే చాలు మీ బొమ్మ లేదా మీ కంపెనీ లోగోతో తపాలా బిళ్ల జారీ అవుతుంది. వ్యక్తిగత, కంపెనీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘మై స్టాంప్’పేరుతో ఈ తపాలా బిళ్లలను జారీ చేయాలని నిర్ణయించామని పోస్టల్ విభాగం తెలిపింది.

06/30/2016 - 08:07

న్యూఢిల్లీ, జూన్ 29: 2011 గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను నోటిఫికేషన్లో పేర్కొన్న సిలబస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో విడివిడిగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు నిర్వహించాలని సుప్రింకోర్టు ఆదేశించింది. ఈప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్,జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.

Pages