S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/29/2016 - 08:00

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 28: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికులు దళారుల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రశంసించారు. విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంగళవారం ‘విదేశీ ప్రవాసీ దివస్’ కార్యక్రమం జరిగింది.

06/29/2016 - 04:33

న్యూఢిల్లీ,జూన్ 28: రాష్ట్ర హైకోర్టు విభజన వ్యవహారం కేవలం న్యాయమూర్తులు, న్యాయ వాదుల సమస్య కాదు, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మాభిమానంతో సంబంధం ఉన్న సమస్య అని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిలు కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు స్పష్టం చేశారు. హైకోర్టు విభజన వ్యవహారం ముదిరితే తీవ్ర పరిణామాలుంటాయని వారు మంగళవారం గౌడను కలిసి వివరించారు.

06/29/2016 - 01:05

న్యూఢిల్లీ, జూన్ 28: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌కు సంబందించిన అన్ని రికార్డులను బహింరంగపరచాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) కేంద్రాన్ని ఆదేశించింది. రాష్టప్రతి జారీ చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్, దానికి సంబంధించిన ఫైల్ నోటింగ్స్ ఫోటో కాపీలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద వెంకటేష్ నాయక్ గత ఏడాది జనవరిలో రాష్టప్రతి సచివాలయాన్ని కోరాడు.

06/29/2016 - 01:05

న్యూఢిల్లీ, జూన్ 28: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, బీజేపీ నేతలపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించటంతో ఆయన కాస్త వెనక్కు తగ్గారు. మంగళవారం ఆయన దగ్గరకు వెళ్లిన మీడియాతో మాట్లాడేందుకు తిరస్కరించారు. మీడియా తనను అవమానించిందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని ట్వీట్ చేశారు.

06/29/2016 - 01:03

న్యూఢిల్లీ, జూన్ 28: ఉత్తరప్రదేశ్‌లోని దేవా షరీఫ్, రాజస్థాన్ రామ్ దేవ్రా, అసోంలోని పోవా మక్కా.. ఈ మూడింటికి ఒక దానితో మరోదానికి ఎలాంటి సంబంధం లేదు కానీ, ఈ మూడు ఆలయాలకు ఒక సామ్యం మాత్రం ఉంది. అంతగా ప్రఖ్యాతి చెందని ఈ మూడు మందిరాలు ఎన్నో వందల ఏళ్లుగా శాంతి, సహన శీలత, మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తూ అన్ని మతాల వారిని సమాదరిస్తున్నాయి.

06/29/2016 - 01:02

జైసల్మేర్, జూన్ 28: ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదం తనదేనని, కేంద్ర ప్రభుత్వం దాన్ని తస్కరించిందని రాజస్థాన్‌కు చెందిన ఓ పోలీసు అధికారిణి వెల్లడించింది. బాలికలకు విద్యను అందించే ఉద్దేశంతో గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదం ఇచ్చారు. దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయితే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ చేతన్ భాటి ఆ నినాదం తనదేనని వాదిస్తున్నారు.

06/29/2016 - 01:02

న్యూఢిల్లీ, జూన్ 28: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. పాకిస్తాన్ పట్ల అనుసరించాల్సిన సమగ్ర విధానమేదీ మోదీ ప్రభుత్వానికి లేదని వారు ధ్వజమెత్తారు. దౌత్య వ్యవహారాలు, అలాగే విదేశాంగ విధానానికి సంబంధించి మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోతున్నారని విపక్షం ఆరోపించింది.

06/29/2016 - 01:01

న్యూఢిల్లీ, జూన్ 28: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు కొత్త సభ్యులు మంగళవారం పార్లమెంటు ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

06/29/2016 - 01:01

బీజింగ్, జూన్ 28: ‘కొందరు భారతీయులు స్వార్థపరులు. స్వలాభం కోసమే తప్ప మరేమీ అక్కరలేదు. భారత జాతీయులు తామెలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగాలని కోరుకోవటం కాదు, సూపర్ పవర్ దేశాలు ఏ విధంగా ఆటలాడతాయో తెలుసుకోవాలి’ చైనా మీడియా భారతదేశంపై తాజాగా ఘాటుగా చేసిన విమర్శలివి.

06/28/2016 - 18:10

చెన్నై: ‘నా కుమార్తెను ఓ ఆగంతకుడు కత్తితో నరికి చంపుతుండగా అక్కడున్న వారంతా చోద్యం చూసినట్లు వౌనం వహించారు.. అంతా ప్రేక్షకుల్లా ఉండిపోయారే తప్ప ఆమెను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు.. ఒక్కరు స్పందించి అడ్డుకున్నా నా కుమార్తె బతికి ఉండేదేమో..’- అని సుగంబాకం రైల్వే స్టేషన్‌లో హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి తండ్రి గోపాలకృష్ణన్ ఆవేదనతో అన్నారు.

Pages