S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/28/2016 - 13:21

బెంగళూరు: బెంగళూరులో తొలి మహిళా క్యాబ్‌ డ్రైవర్‌గా గుర్తింపు పొందిన భారతి వీరత్‌ సోమవారం రాత్రి ఉరివేసుకుని కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఆత్మహత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతి తొలుత టైలర్‌గా పనిచేసి, రెండేళ్ల క్రితం బెంగళూరులో తొలి మహిళా ట్యాక్సీ డ్రైవర్‌గా గుర్తింపు పొందారు.

06/28/2016 - 12:18

లక్నో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి తాంజల్ అహ్మద్ హత్యకేసులో కీలక నిందితుడైన మునీర్‌ను యుపి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. గత ఏప్రిల్‌లో అహ్మద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వస్తుండగా మునీర్ గ్యాంగ్ కాల్పులు జరిపింది. ఫలితంగా అహ్మద్, ఆయన భార్య మరణించారు.

06/28/2016 - 11:37

థానే: ఓ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో డబ్బులు జమచేసేందుకు వెళ్తున్న వాహనంపై దోపిడీ దొంగలు ఆయుధాలతో దాడి చేసి, దాదాపు రూ.12కోట్లు ఎత్తుకెళ్లారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

06/28/2016 - 11:36

ముంబయి: ఈరోజు ఉదయం నుంచి స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు బలపడి రూ.67.72 వద్ద కొనసాగుతోంది. 50 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 15 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.

06/28/2016 - 05:34

న్యూఢిల్లీ, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కేరళ మాజీ సిఎం ఊమన్ చాందీని నియమించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ యోచిస్తున్నట్టు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రస్తుత ఇన్‌చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌ను త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని ఏఐసిసి వర్గాలు అంటున్నాయి.

06/28/2016 - 05:39

న్యూఢిల్లీ, జూన్ 27: కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగించే ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేసే అవకాశం ఉంది. వేతన సంఘం సిఫార్సులపై కేబినెట్ కార్యదర్శి పికె సిన్హా సారథ్యంలో అధ్యయనం జరిపిన కమిటీ తన నివేదికను సమర్పించింది. దీన్ని కేంద్రం ఆమోదించే అవకాశం ఉందని, ఈ నెల 29లోగానే అమలుపై నిర్ణయం తీసుకోవచ్చునని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

06/28/2016 - 02:17

న్యూఢిల్లీ, జూన్ 27: భారత్ ఎల్లవేళలా పాకిస్తాన్ పట్ల అప్రమత్తంగా, జాగరూకతతో ఉండాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీనతకు, నిర్లక్ష్యానికి తావు ఉండకూడదు అని ఆయన సోమవారం ఒక ఆంగ్ల వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం విషయంలో భారత్ చేస్తున్న వాదనను ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.

06/28/2016 - 03:15

రాంచీ, జూన్ 27: త్వరలోనే దేశంనుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్రం ప్రకటించింది. వామక్ష తీవ్రవాదంవల్ల దేశం ఎంతో నష్టపోయిందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే నక్సల్స్ రహిత రాష్ట్రంగా జార్ఖండ్ ఆవిర్భవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన ధీమాగా చెప్పారు. ‘జార్ఖండ్‌లో నక్సలిజం మూలాలు దొరికాయి.

06/27/2016 - 23:55

మైసూరు, జూన్ 27: మైసూరు రాజు యదువీర్ వివాహ వేడుక సోమవారం అత్యద్భుతంగా జరిగింది. చరిత్రాత్మక అంబావిలాస్ ప్యాలెస్‌లో దాదాపు 40 ఏళ్ల తరువాత వొడయార్ వంశానికి చెందిన టిటులర్ రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ, రాజస్థాన్‌కు చెందిన దుంగార్‌పుర్ రాజ కుటుంబం నుంచి వచ్చిన త్రిషిక కుమారి సింగ్‌ను వివాహం చేసుకున్నారు. దుంగార్‌పూర్ రాజ్‌పుత్‌లైన హర్షవర్ధన్‌సింగ్, మహేశ్రీ కుమారిల కూతురు త్రిషిక.

06/27/2016 - 23:53

బారాబంకి, జూన్ 27: ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా నుంచి జరిగిన వలసలు, ఇటీవల మధురలో హింస పెచ్చరిల్లడంపై అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కళంకిత యుపిఎ ప్రభుత్వానికి సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి మద్దతు ఇచ్చారని విమర్శించారు.

Pages