S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/07/2016 - 01:17

గాంధీనగర్, ఆగస్టు 6: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికయిన విజయ్ రూపాని శనివారం రాష్ట్ర గవర్నర్ ఓపి కోహ్లీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. రూపాని ఆదివారం మధ్యాహ్నం 12.40 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దినేశ్ శర్మ ప్రకటించారు.

08/07/2016 - 01:15

గౌహతి, ఆగస్టు 6: అస్సాంలోని ఒక దేవాలయ ప్రవేశం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పరువుకు నష్టం కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 21న కోర్టులో హాజరుకావాలని ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.

08/07/2016 - 01:08

న్యూఢిల్లీ, ఆగస్టు 6: అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. మూడు రోజుల క్రితం ఎడమ భుజానికి ఆపరేషన్ చేసిన తర్వాత శనివారం ఆమె కొంతసేపు నడిచారని, కొన్ని ఎక్సర్‌సైజులు కూడా చేశారని ఇక్కడి సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

08/07/2016 - 01:08

శ్రీనగర్, ఆగస్టు 6: జమ్మూ, కాశ్మీర్‌లో శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. అనంత్‌నాగ్, హోపియాన్ జిల్లాల్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. మరోవైపు కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతాల్లో వరసగా 29వ రోజు కూడా కర్ఫ్యూ కొనసాగడంతో జన జీవితం స్తంభించిపోయింది.

08/07/2016 - 01:07

చండీగఢ్, ఆగస్టు 6: ప్రజలకు చౌక ధరల్లో ఔషధాలను అందించేందుకు ప్రభుత్వం ఈ సంవత్సరం 300 అమృత్ ఔట్‌లెట్లను, మూడు వేల జన్ ఔషధి స్టోర్‌లను ఏర్పాటు చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా తెలిపారు. శనివారం ఇక్కడి పిజిఐఎంఇఆర్ వద్ద రెండు అమృత్ ఔట్‌లెట్లను ఆయన ప్రారంభించారు.

08/07/2016 - 01:06

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలంగాణకు తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తి చేయకపోవటంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని టి.పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. పొన్నాల శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆదివారం పర్యటిస్తున్న ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించడాన్ని తప్పుపట్టారు.

08/07/2016 - 01:05

కోక్రాఝార్ (అస్సాం), ఆగస్టు 6: ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశాన్ని నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) బృందం శనివారం పరిశీలించింది. దాడి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఉగ్రవాద దాడిలో 14 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

08/06/2016 - 18:07

దిల్లీ: దిల్లీలో టౌన్‌హాల్‌ పేరిట ప్రజావేదిక ఏర్పాటు చేయడంతో ప్రధాని మోదీ సరికొత్త ఒరవడి సృష్టించారు. ‘మై-గవ్‌’ పోర్టల్‌ ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో ‘టౌన్‌హాల్‌ తరహా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల ఆలోచనలతో రూపుదిద్దుకున్న పీఎంవో యాప్‌ను కూడా ఆవిష్కరించారు.

08/06/2016 - 17:53

మహారాష్ట్ర: మహద్‌లోని సావిత్రి నదిలో గాలింపు కొనసాగుతోంది. నదిలో గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు 23 మృతదేహాలను వెలికి తీశారు. భారీ వర్షం కురుస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. బ్రిడ్జ్ కూలిపోయిన ఘటనలో 50 మంది గల్లంతయ్యారు.

08/06/2016 - 17:44

దిల్లీ: ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం దావా కేసులో సెప్టెంబరులో కోర్టు ముందు హాజరుకావాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కామ్‌రూప్‌లోని కోర్టు ఆదేశించింది. 2015 డిసెంబరులో రాహుల్‌ గాంధీ అసోంలోని బార్‌పేట సత్ర(బౌద్ధ ఆలయం) నుంచి మసీదు వరకు ర్యాలీ చేశారు. తనను బార్‌పేట సత్రలోకి వెళ్లకుండా ఆరెస్సెస్‌ అడ్డుకుందని మరుసటి రోజు పార్లమెంటులో ఆరోపించారు.

Pages