జాతీయ వార్తలు

పరువునష్టం కేసులో రాహుల్‌కు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఆగస్టు 6: అస్సాంలోని ఒక దేవాలయ ప్రవేశం విషయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పరువుకు నష్టం కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 21న కోర్టులో హాజరుకావాలని ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. బార్‌పేటలోని ఒక దేవాలయ ప్రవేశం విషయంలో నిరుడు ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని సెక్షన్ 500 కింద విచారణను ఎదుర్కోవడానికి కోర్టుకు హాజరుకావాలని కామ్‌రూప్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ సంజయ్ హజారికా శనివారం రాహుల్ గాంధీకి సమన్లు జారీచేశారు. ఈ సెక్షన్ కింద దోషిగా తేలితే గరిష్ఠంగా రెండు సంవత్సరాల వరకు సాధారణ జైలుశిక్ష లేక జరిమానా లేక రెండూ విధించే అవకాశం ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అంజన్ బోరా దాఖలు చేసిన ఈ క్రిమినల్ పరువు నష్టం దావా పిటిషన్‌పై రాహుల్ గాంధీకి నిందితుడిగా సమన్లు జారీ చేయాలా లేదా అనే అంశంపై నిర్ణయాన్ని కోర్టు ఈ నెల రెండో తేది నుంచి శనివారం నాటికి వాయిదా వేసింది. 2015 డిసెంబర్ 12న అస్సాంలోని బార్‌పేట సత్ర ఆలయంలోకి తనను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ప్రవేశించనీయలేదని ప్రకటించడం ద్వారా రాహుల్ గాంధీ ఆ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీశారని సిజెఎం పేర్కొన్నారు. 2015 డిసెంబర్ 12న రాహుల్ గాంధీ ఆలయంలోకి వెళ్లకుండా పాదయాత్రలో పాల్గొన్నారని, కాని, రెండు రోజుల తరువాత ఢిల్లీలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తాను సత్రాలోకి వెళ్లకుండా దాని ఎన్నికయిన సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని అబద్ధం చెప్పారని బోరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.