S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/07/2016 - 14:19

గాంధీనగర్:గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాధస్వీకారం చేశారు. గవర్నర్ ఓపీకోహ్లి ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా ఉపముఖ్యమంత్రిగా నితిన్‌పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లి, బిజెపి సీనియర్ నేత ఎల్.కె.అద్వాని తదితరులు పాల్గొన్నారు.

08/07/2016 - 14:18

పట్నా:ఉపకార వేతనాలకు కోత విధించడం, దళితుల అణచివేత చర్యలకు నిరసనగా బిహార్ రాజధాని పట్నాలో ఎన్‌డిఎ పక్షాలు మహా ధర్నా నిర్వహించాయి. బిజెపి,ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌ఎస్‌పి, హమ్ (ఎస్) పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

08/07/2016 - 03:31

హైదరాబాద్, ఆగస్టు 6: ఇసుక మైనింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానం బాగుందని చత్తీస్‌గఢ్ మైనింగ్ శాఖ ఎండి అధికారిణి రీనా, మహారాష్ట్ర మైనింగ్ శాఖ ఎండి నిరుపమా డాంగే ప్రశంసించారు. తెలంగాణ ఇసుక పాలసీని పరిశీలించేందుకు వచ్చిన వీరు శనివారం రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి.ఇలంబరితో సమావేశమయ్యారు.

08/07/2016 - 03:05

హైదరాబాద్, ఆగస్టు 6: భారతదేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, అందులో అతిపెద్ద సవాలు ఉన్నత న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ అన్నారు. నల్సార్ వర్శిటీ 14వ స్నాతకోత్సవానికి హాజరైన జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిధిగా మాట్లాడారు. దేశంలో వివిధ న్యాయస్థానాల్లో 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, 1300మంది

08/07/2016 - 02:39

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై త్వరలోనే ఒక స్పష్టత వస్తుందనే ఆశాభావాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ అధ్యక్షుడు పణిగరియా కసరత్తు చేస్తున్నారని చెప్పారు.

08/07/2016 - 04:10

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గోసంరక్షణ పేరుతో దేశంలో పలుచోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అసాంఘిక కార్యకలాపాల పరిధిలోకి వస్తాయని ఆయన అన్నారు. గోసంరక్షకుల పేరుతో చెలామణి అవుతున్న వారిలో 80శాతం మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవారేనని తీవ్రంగా మండిపడ్డారు.

08/07/2016 - 02:32

జైపూర్, ఆగస్టు 6: బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గో సంరక్షణ శాలలో ఆకలి బాధ తాళ లేక, ఆలనా పాలనా చూసే వాళ్లు లేక 500కు పైగా ఆవులు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆవుల రాజకీయాలు నడుస్తున్న వేళ వెలుగు చూసిన ఈ సంఘటన అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇబ్బందికరంగా మారింది.

08/07/2016 - 02:23

సూళ్లూరుపేట, ఆగస్టు 6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెల చివరలో జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు.

08/07/2016 - 01:29

న్యూఢిల్లీ, ఆగస్టు 6: స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రజల ఉద్యమంగా మారాలని ప్రభుత్వ కార్యక్రమంగా దాన్ని చూడకూడదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 మున్సిపాలిటీల్లో ఈ ఏడాది నిర్వహించనున్న స్వచ్ఛ్భారత్ సర్వేక్షణ్-2017ను మంత్రి ఆదివారం ఇక్కడ ప్రారంభించారు.

08/07/2016 - 01:27

న్యూఢిల్లీ, ఆగస్టు 6: పార్లమెంటులో ఎస్‌సి వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ఎస్‌సి వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి దిగ్విజయ్ సింగ్ శనివారం వచ్చి తమ సంఘీభావం ప్రకటించారు.

Pages