S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/18/2016 - 02:00

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మణిపూర్, అసోం, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్‌లను, అండమాన్ నీకోబార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ గవర్నర్‌గా విపి సింగ్ బద్నోర్, అసోం గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్, అండమాన్ నీకోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రొఫెసర్ జగదీష్ ముఖీ నియమితులయ్యారు.

08/18/2016 - 02:37

న్యూఢిల్లీ, ఆగస్టు 17: నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను మొదటి నుంచీ చేయాలనే ఏపీ,తెలంగాణ వాదనలు అర్థరహితమని, ఆ రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం కుదుర్చుకొని కృష్ణా నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకోవాలని ట్రిబ్యునల్‌కు మహారాష్ట్ర స్పష్టం చేసింది.

08/18/2016 - 00:27

న్యూఢిల్లీ, ఆగస్టు 17: జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు విదేశాలలోని వారి సానుభూతిపరులు కాశ్మీర్‌కు చెందిన సామాన్య ప్రజల బ్యాంకు ఖాతాల ద్వారా అందజేస్తున్న విరాళాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు ప్రారంభించింది.

08/18/2016 - 00:26

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బంగ్లాదేశ్ విముక్తికోసం 1971లో జరిగిన యుద్ధం పై భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించనున్నాయి. భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బుధవారం ఈ విష యం తెలిపింది. 2020లో రానున్న బం గ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్ వందవ జయంతిని పురస్కరించుకొని ఆ దేశం ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి భారత్ సహకరించనుంది.

08/18/2016 - 00:24

శ్రీనగర్, ఆగస్టు 17: కాశ్మీర్‌లో యలో ఆర్మీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు తెగబడ్డారు. బారాముల్లా జి ల్లా ఖ్వా జాబాగ్‌లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతం లో ఇది చోటుచేసుకుంది. మిలిటెంట్లదాడిలో ఓ సైనికుడు గాయపడ్డాడని పోలీసులు వెల్లడించారు. తీవ్రవాదులను పట్టుకోడానికి ఆ ప్రాంతమంతా గాలింపుచేపట్టినట్టు వారు తెలిపారు.

,
08/18/2016 - 00:23

ముంబయి, ఆగస్టు 17: మహారాష్టల్రోని రాజ్‌భవన్‌లోపల బ్రిటీష్ కాలం నాటి బంకర్ ఒకటి బైటపడింది. దశాబ్దాలుగా మూసి ఉన్న ఈ బంకర్ చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు బుధవారం సతీసమేతంగా ఈ బంకర్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ బంకర్‌ను సందర్శించనున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.

08/18/2016 - 00:18

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మహారాష్టల్రో జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ దహీ హండీ (ఉట్లు కొట్టే కార్యక్ర మం)లో పాల్గొనే వారి వయ సు 18 ఏళ్ల కన్నా తక్కువ ఉండరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉట్టి కొట్టడానికి ఏర్పడే మానవ పిరమిడ్‌ల ఎత్తు 20 మీటర్లకు మించరాదంటూ బొంబాయి హైకోర్టు విధించిన ఆంక్షను సడలించడానికి సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది.

08/18/2016 - 00:15

వడోదర, ఆగస్టు 17: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బుధవారం నాలుగు కొత్త రకం రైళ్లను ప్రకటించారు. వీటిలో ఒకదానిని అన్‌రిజర్వుడ్ ప్రయాణికులకు, మిగతా మూడింటిని రిజర్వుడ్ ప్రయాణికుల కోసం ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఇవి నడవడం ప్రారంభిస్తాయి. అత్యంత పేద ప్రజలు కూడా రైలు ప్రయాణం చేయడానికి వీలుగా అన్‌రిజర్వుడ్ రైలును ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు.

08/18/2016 - 00:15

షిర్డీ, ఆగస్టు 17: దేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీసాయి గుడికి వచ్చే భక్తులు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేందుకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్‌ఎస్‌ఎస్‌టి) ఏర్పాట్లు చేస్తోంది. గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా ఉండేందుకు ‘దర్శనం’ కల్పిస్తారు. అంటే భక్తులు ముందుగానే దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పద్ధతి తిరుపతిలో అమల్లో ఉంది.

08/18/2016 - 00:14

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని బిఎస్పీ అధినేత మాయావతి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను వాయిదా వేయించడానికి సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఎత్తులు వేస్తున్నారని బుధవారం ఇక్కడ ఆరోపించారు. బిజెపి, ఎస్‌పిలు రెండు పార్టీలూ ఎన్నికలు వాయిదా వేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె తెలిపారు.

Pages