జాతీయ వార్తలు

మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో బయటపడ్డ బంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 17: మహారాష్టల్రోని రాజ్‌భవన్‌లోపల బ్రిటీష్ కాలం నాటి బంకర్ ఒకటి బైటపడింది. దశాబ్దాలుగా మూసి ఉన్న ఈ బంకర్ చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం. రాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు బుధవారం సతీసమేతంగా ఈ బంకర్‌ను సందర్శించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ బంకర్‌ను సందర్శించనున్నారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. దాదాపు 150 మీటర్ల పొడవుండే ఈ బంకర్‌ను సందర్శించిన తర్వాత గవర్నర్ దీన్ని పరిక్షించడం కోసం వివిధ రంగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. రాజ్‌భవన్‌లోపల ఒక బంకర్ ఉన్నట్లు మూడు నెలల క్రితం పాతతరం సిబ్బంది ద్వారా తెలుసుకున్న గవర్నర్ దాన్ని తెరవాలని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులను ఆదేశించారు. ఈ నెల 12న సిబ్బంది బంకర్ తూర్పు వైపుప్రవేశద్వారాన్ని మూసి ఉంచడానికి నిర్మించిన తాత్కాలిక గోడను పగుల గొట్టడంతో ఈ బంకర్ బైటపడినట్లు రాజ్‌భవన్ అధికారి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బంకర్‌లో వివిధ సైజుల్లో ఉండే 13 గదులున్నాయి. బాంబ్ షెల్ స్టోర్, గన్‌షెల్, కార్టిడ్జ్ స్టోర్, షెల్ లిఫ్ట్, పంప్, వర్క్‌షాపులాంటి వాటికోసం ప్రత్యేకంగా గదులు కేటాయించారు. అంతేకాదు గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాట్లు కూడా ఇందులో ఉన్నాయి. చరిత్రకారుల కథనం ప్రకారం మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉండే రాజ్‌భవన్‌ను 1885లో అప్పటి లార్డ్ రేయ్ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు. అంతకు ముందు బ్రిటీష్ గవర్నర్లు దీన్ని వేసవి విడిదిగా ఉపయోగించుకునే వారు.

చిత్రాలు.. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో అనూహ్యంగా ఓ బంకర్ కనిపించింది. ఇది ఉందన్న విషయమే దశాబ్ధాలుగా తెలియదు. 150 మీటర్ల పొడవున్నఈ సొరంగాన్ని రాష్టగ్రవర్నర్ విద్యాసాగర్‌రావు గుర్తించారు.
తన భార్య వినోదతో కలిసి బ్రిటీష్ కాలంనాటి ఈ సొరంగాన్ని
ఆయన బుధవారం సందర్శించారు.