జాతీయ వార్తలు

తెలుగు రాష్రా టల మధ్యే అసలు వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను మొదటి నుంచీ చేయాలనే ఏపీ,తెలంగాణ వాదనలు అర్థరహితమని, ఆ రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం కుదుర్చుకొని కృష్ణా నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకోవాలని ట్రిబ్యునల్‌కు మహారాష్ట్ర స్పష్టం చేసింది. 2013లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు విఘాతం కలగరాదని, కర్ణాటక, మహారాష్టల్రకు ప్రాజెక్టులవారీ కేటాయింపుల విషయంలో భేదాభిప్రాయాలు లేనందువల్లే విభజన చట్టంలో సెక్షన్ 89 ఏర్పాటు చేశారని ట్రిబ్యునల్ ముందు కర్ణాటక వాదించింది. విభజన చట్టలో సెక్షన్ 89ను ఏపి, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల కోసమే ఏర్పాటు చేశారని మహారాష్ట్ర,కర్ణాటకలు ట్రిబ్యునల్ స్పష్టం చేశాయి.
బుధవారం నాడు కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. మహారాష్ట్ర తరఫున సీనియర్ న్యాయవాది అంద్యార్జున వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 కేవలం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించినదని, దీనికి చాలా పరిమితులున్నాయని, నాలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను మొదటి నుంచీ చేయాలనే వాదనలు అర్థరహితమని, రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం కుదుర్చుకోవడం ద్వారా కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించుకోవచ్చునని ట్రిబ్యునల్‌కు మహారాష్ట్ర స్పష్టం చేసింది. అప్పటికీ తేలకపోతే అపెక్స్ కౌన్సిల్‌ను ఆశ్రయించవచ్చునని మహారాష్ట్ర వాదించింది. అదేవిధంగా ఇప్పటివరకు నదీ జలాల వివాదానికి సంబంధించి ఏర్పాటైన ట్రిబ్యునల్స్‌లో బచావత్ ట్రిబ్యునల్ చాలా ప్రత్యేకమైనదని వాదించారు. అలాగే చాలా విస్తృతంగా నీటిపై అధ్యయనం చేసి మహారాష్ట్ర,కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి పంపకాలు చేసిందని, ఇప్పటికి అదే అమలులో ఉందని ట్రిబ్యునల్‌కి తెలిపారు.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే 2013లో తీర్పు ఇచ్చిందన్నారు.
కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ వాదనలు వినిపించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తుది తీర్పు గెజిట్ రూపంలో అధికారికంగా ప్రకటించకపోయినా దీర్ఘకాలం పాటు రాష్ట్రాల మధ్య వాదనలు జరిగాయని ఆయన ట్రిబ్యునల్‌కు గుర్తు చేశారు. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వను అధ్యయనం చేసిన తర్వాతే నీటి కేటాయింపులు చేసినందున ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి జలాల పంపిణీ చేపట్టటమంటే దాని శ్రమ వృథా అయినట్లేనని కర్ణాటక వాదించింది. కృష్ణా జలాల పంపిణీలో వివాదమంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యనే ఉన్నందున సెక్షన్ 89ని ఈ రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోనే పార్లమెంట్ విభజన చట్టంలో పొందుపర్చిందని కర్ణాటక వాదించింది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వెలువరించిన తుది తీర్పులో కర్ణాటక, మహారాష్టల్రకు చేసిన నీటి కేటాయింపులను ముట్టుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయిపులనే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాలనే సూచించింది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలనే ఈ సెక్షన్‌లో పొందుపర్చిన ఉద్దేశం ఈ రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొనేనని వాదించింది. కర్ణాటక,మహారాష్టల్రకు సంబంధించి ఎక్కడా కూడా ప్రాజెక్టులవారీ కేటాయింపుల దగ్గర భేదాభిప్రాయాలు లేనందువల్లే ఈ సెక్షన్‌ను కేవలం ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే వర్తింపజేయాలనే స్పష్టం చేసింది. అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 5(2),5(3)ను ప్రామాణికంగా తీసుకుని పొందుపర్చినవేనని,అందువల్ల సెక్షన్ 89కు చాలా తక్కువ పరిమితులు ఉన్నాయని కర్ణాటక రాష్ట్రం ట్రిబ్యునల్‌కి వెల్లడించింది. మొత్త నాలుగు రాష్ట్రాల వాదనలు ముగిసిపోయినందున ట్రిబ్యునల్ మరోమారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నుంచి అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఆ తర్వాత నీటి పంపిణీ నాలుగు రాష్ట్రాల మధ్యనా? లేక రెండు రాష్ట్రాల మధ్యనా? అనే విషయంపై ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేయనుంది.