జాతీయ వార్తలు

ఆర్మీ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 17: కాశ్మీర్‌లో యలో ఆర్మీ కాన్వాయ్‌పై మిలిటెంట్లు తెగబడ్డారు. బారాముల్లా జి ల్లా ఖ్వా జాబాగ్‌లో మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతం లో ఇది చోటుచేసుకుంది. మిలిటెంట్లదాడిలో ఓ సైనికుడు గాయపడ్డాడని పోలీసులు వెల్లడించారు. తీవ్రవాదులను పట్టుకోడానికి ఆ ప్రాంతమంతా గాలింపుచేపట్టినట్టు వారు తెలిపారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. అనంత్‌నాగ్, మాగం ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లోనే ఉన్నాయి. వరుసగా 40 రోజూ ప్రజాజీవనం అస్తవ్యస్థమైంది. బుద్గావ్ జిల్లా మాగంలో మంగళవారం నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించారు. శ్రీనగర్ జిల్లా అనంత్‌నాగ్‌లోనూ నిషేధాజ్ఞలు విధించారు. శ్రీనగర్ సిటీలో భారీ ఎత్తున భద్రతాదళాలను మోహరించారు. సోనావార్‌లోని యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వ్‌స్ గ్రూప్ (యుఎన్‌ఎంఓజి) స్థానిక కార్యాలయాన్ని మూసివేశారు. కార్యాలయం వద్ద వేర్పాటువాదుల నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో ముందు జాగ్రత్తగా బలగాలు మోహరించాయి. వేర్పాటువాదుల 72 గంటల సమ్మె పిలుపునేపథ్యంలో కాలేజీలు, పాఠశాలలు, ప్రైవేటు కార్యాయాలు మూతబడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగుల హాజరు స్వల్పంగా ఉంది. ఇలా ఉండగా కాశ్మీర్ లోయలో ఇంటర్నెట్, మొబైల్ సర్వీసులు నిలిపివేశారు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తరువాత లోయలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఇప్పటి వరకూ 63 మంది మృతి చెందారు. జూలై 9 నుంచి కాశ్మీర్ లోయలో అనిశ్చిత వాతావరణమే ఉంది.

చిత్రం.. శ్రీనగర్‌లో రోడ్డుకు అడ్డంగా పెట్టిన రోలర్‌ను తొలగిస్తున్న జవాను