S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డైలీ సీరియల్
దూరాన సీజర్ శవం తగలబడుతూండగా విడుదలైన పొగవలెనే ఆమె ఆశలన్నీ ఆకాశంలోకి పాకి, మటుమాటమైపోతూన్నవి. ఇక తనకీ ప్రపంచంలో ఏమున్నదని? జీవచ్ఛవంవలె ఆమె ఈజిప్టు వైపు వెళ్లిపోతోంది. జీవితాన్ని తాను ఇన్నాళ్ళూ భరించింది. ఇక జీవితం తనను ఎన్నాళ్ళు భరిస్తుందో ఆమెకే తెలియాలి. నిరాశ మినహా తనకేమీ మిగలలేదు.
‘ఏం జీవితం!’ అనుకున్నదామె
***
ఐతే, ఈ వీలునామాలో సీజర్‌కు కుడిభుజంగా వున్న ఏంటనీ పేరుగానీ, ఆయన ప్రణయాన్ని పంచుకుని, ప్రాణంలో ప్రాణంగా వున్న క్లియోపాత్రా పేరు కానీ లేవు!
ఏంటనీ, క్లియోపాత్రాలు నిరుత్సాహంగా, నిరాశగా ఒకర్నొకరు చూసుకున్నారు. సీజర్ తమను అన్యాయం చేశాడని అనేందుకు ఆ ఉభయుల్లోనూ ఎవరికీ సాహసం లేదు. ‘చూశావా!’ అన్నట్లు ఒకరి భావాల్ని వేరొకరు అర్థం చేసుకున్నారు.
ఖంగుమనే ఆ కంఠస్వరంలో యవ్వనం తిరిగి ప్రతిధ్వనించింది. ఆ రాత్రి తిరిగి వారు ప్రణయోపాసకులయ్యారు.
క్లియోపాత్రా అనుకున్నదిది. సీజర్ వెళ్ళాక, తాను కూడా ఈజిప్టు వెళ్లాలి. అక్కడ పర్షియన్ యుద్ధంలో వున్న సీజర్‌కు తనకు చేతనైనంత ధన సహాయం, సైనిక సహాయం పంపాలి. ఇపుడు సిరియా కూడా తన పాలనలోనే ఉన్నది కనుక, సీజర్ ఘనవిజయానికి తాను దోహదం ఇవ్వగలదు.
క్లియోపాత్రా కూడా జీవిత శేషాన్ని ప్రశాంతంగా గడపమని సీజర్‌కు చెప్పాలనుకుంది. కాని చెప్పలేకపోయింది. సీజర్ నుంచి ఆమె పరిపూర్ణంగా అర్థం చేసుకున్నది ప్రణయమొక్కటే! సీజర్ దగ్గర ప్రేమోపాసన మినహా, ఆమెకు మరో ఆలోచనే రాదు!
ప్రణయ రంగంలో మాత్రమే ఆమె సీజర్‌ను లొంగదీసుకుంది! ఇది ఆమె జీవిత రహస్యం!
సీజర్ స్పెయన్‌కు సైన్యాలతో తరలివెళ్ళేముందు ‘‘రాణీ! నేను అతి త్వరలోనే విజయలక్ష్మిని చేపట్టి, తిరిగి వస్తాను. నీవు ఇక్కడే ఉండి పరిస్థితుల్ని వివరంగా నాకు తెలియపరుస్తూ ఉండు!’’ అని ఆదేశించాడు.
ఆమె సమ్మతించింది.
అదేవిధంగా మరో వివాహం చేసుకుంటే తన ప్రతిపక్షీయులు మిత్రులౌతారు. ఇలాంటి దురుద్దేశాలతో జరిగిన ఈ పెళ్ళిళ్లలో నీతి ఏ మాత్రం ఉన్నది? వారు వివాహ వ్యవస్థకు ఎంత విలువనూ, గౌరవాన్నీ ఇస్తున్నరు? చివరకు వారు ఎంతవరకూ సుఖపడుతున్నరు? ఒక్కో రాజకీయ నాయకుడికి నాలుగేసి పెళ్లిళ్ళు. తన భార్య ద్వారా తనకు కలిగే మేలు మరిలేదని తేల్చుకోవటం ఆలస్యం ఆమెకు విడాకులివ్వటం, మరొకతెను వెనువెంటనే పెళ్ళాడటం!
ఐతే సీజర్ వారసుణ్ణొక్కణ్ణి తాను కని, పెంచింది. ఈ రహస్యాన్ని కూడా పరోక్షంగా అతనికి తెలియ పరచాలని ఆమె నిశ్చయించుకుంది.
క్షణభంగురమైన రుూ జీవితంలో చేతికందినంతవరకూ సుఖపడదామనేది ఆమె నూతన సిద్ధాంతమూ, జీవితాశయమూ అయినవి.
మన రుూ వియోగం, త్వరలోనే బలవత్తరమైన సంయోగాన్ని కూర్చగలదు!’’
విలాసయుతంగా, ఎంతో ధనవ్యయంతో, అతి స్వల్పకాలంలో రుూ జల విహారార్థం నౌక తయారైంది. సీజర్ కూడా బైటి ప్రపంచాన్ని, ముఖ్యంగా వింతలు గొలిపే దేశమైన ఈజిప్టును చూడాలని కుతూహలపడ్డాడు.